సొంత ఆర్మీ పోస్టుకు నిప్పు పెట్టుకున్న పాకిస్థాన్.. ఇంకా మారని దొంగబుద్ధి

జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు నుంచి ఓ నలుగురు ఉగ్రవాదులు శుక్రవారం రాత్రి భారత్ లోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. వారిని అడ్డుకున్న సైన్యం ఇద్దరిని మట్టుబెట్టింది. వారికి సహకరించిన పాక్ ఆర్మీ ఇందుకోసం భారత నిఘా వ్యవస్థ దృష్టి మరల్చేలా సొంత ఆర్మీ పోర్టును దగ్ధం చేసింది.

New Update
సొంత ఆర్మీ పోస్టుకు నిప్పు పెట్టుకున్న పాకిస్థాన్.. ఇంకా మారని దొంగబుద్ధి

Indian Army: కుక్క తోక లాగే ఉంది పాకిస్థాన్ బుద్ధి.. అదెప్పుడూ వంకరే. ఎన్నిసార్లు హెచ్చరించినా, ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నా ఇంకా భారత్ పైకి ఉగ్రవాదులను ఎగదోస్తూ కుట్రలకు పాల్పడుతోంది. ఇప్పుడైతే భారత్ లోకి ఉగ్రవాదులను ఉసిగొల్పి, మన సైన్యం కళ్లుగప్పేందుకు ఏకంగా సొంత ఆర్మీ పోస్టుకే నిప్పుపెట్టుకుందట! ఉగ్ర కుట్రలను తిప్పికొట్టిన భారత ఆర్మీ ఈ విషయాలను బహిర్గతపరిచింది.

ఇది కూడా చదవండి: Gambhir Vs Kohli: ‘అదంతా గ్రౌండ్‌లోనే..’ కోహ్లీతో ఫైట్‌ గురించి గంభీర్‌ లవ్‌లీ రిప్లై!

జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు నుంచి ఓ నలుగురు ఉగ్రవాదులు శుక్రవారం రాత్రి భారత్ లోకి ప్రవేశించడానికి విఫలయత్నం చేశారు. వారి చొరబాటు ప్రయత్నాలను విజయవంతంగా అడ్డుకున్న సైన్యం ఇద్దరిని మట్టుబెట్టింది. మరో ఇద్దరు పాకిస్థాన్ వైపునకు పారిపోయారు. దేశంలో చొరబడుతున్న వారికి పాక్ ఆర్మీ సహకరించిందని, ఇందుకోసం భారత నిఘా వ్యవస్థ దృష్టి మరల్చేలా కంత్రీ ప్లాన్ వేశారని ఆర్మీ వెల్లడించింది.


సొంత ఆర్మీ పోస్టుకే నిప్పుపెట్టుకుని ఉగ్రవాదులను భారత్ మీదికి పంపాలని భావించింది. అయితే, వారి చొరబాటు యత్నాన్ని గుర్తించిన ఆర్మీ వెంటనే అప్రమత్తమై వెంటనే తిప్పికొట్టింది. ఇండియన్ ఆర్మీ 16 కార్ప్స్ ఈ విషయాన్ని నిర్ధరించింది. అఖ్నూర్ సెక్టార్‌లో ఉగ్రవాదుల కదలికలను నిఘా పరికరాలు గుర్తించాయని, కాల్పుల్లో ఇద్దరు మృతిచెందారని ఆర్మీ వర్గాలు చెప్పాయి.

కాగా, ఇటీవల సరిహద్దుల్లో పాకిస్థాన్ కవ్వింపు చర్యలు మితిమీరాయి. నియంత్రణ రేఖతో పాటు అంతర్జాతీయ సరిహద్దు వెంట తరచూ భారత బలగాలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోంది. మరోవైపు కశ్మీర్ లో రెండు రోజుల క్రితమే ఉగ్రవాదులతో జరిగిన కాల్పుల్లో సైనికులు నేలకొరిగిన సంగతి తెలిసిందే.

Advertisment
Advertisment
తాజా కథనాలు