Pakistan Vs England: పాకిస్తాన్ కి చావో రేవో.. ఆ అద్భుతం చేస్తే సెమీస్ చేరినట్టే.. 

వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్-పాకిస్తాన్ మధ్య లీగ్ మ్యాచ్ ఈరోజు జరగనుంది. ఈ మ్యాచ్ లో పాక్ జట్టు 287 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను ఓడిస్తే సెమీఫైనల్ చేరే అవకాశం ఉంది.

New Update
Pakistan Vs England: పాకిస్తాన్ కి చావో రేవో.. ఆ అద్భుతం చేస్తే సెమీస్ చేరినట్టే.. 

Pakistan vs England: వరల్డ్ కప్ (World Cup 2023) లీగ్ మ్యాచ్ లు చివరికి వచ్చేశాయి. దాదాపుగా సెమీ ఫైనల్స్ ఆడేది ఎవరో తేలిపోయింది. ఈరోజు లీగ్ దశలో రెండు మ్యాచ్ లు ఉన్నాయి. తొలి మ్యాచ్ ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ (Australia Vs Bangladesh) మధ్య జరగనుంది. ఆస్ట్రేలియా 12 పాయింట్లతో మూడో దానికి 4 పాయింట్లు ఉన్నాయి. అందువల్ల ఈ మ్యాచ్ లో ఎవరు గెలిచినా ఓడినా పాయింట్స్ టేబుల్ టాప్ 4లో పెద్దగా మార్పులు రావు. 

రెండో మ్యాచ్ ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్ల మధ్య జరగనుంది. ఇందులో ఇంగ్లాండ్ గెలిస్తే ఏమీ తేడా ఉండదు. ఒకవేళ పాకిస్తాన్ గెలిస్తే మాత్రం నాలుగో స్థానానికి చేరుకునే ఛాన్స్ ఉంది. అయితే, దీని కోసం పాకిస్తాన్ టీమ్ అద్భుతాన్ని చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే న్యూజీలాండ్ టీమ్ (New Zealand) ఇప్పటికే పది పాయింట్స్ తో టేబుల్ లో టాప్ 4 లో నిలిచింది. పాకిస్తాన్ కి ఇప్పుడు 8 పాయింట్స్ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం ద్వారా పాకిస్థాన్ 10 పాయింట్లు సాధించాలనుకుంటోంది. కానీ.. సెమీఫైనల్‌కు చేరుకోవాలంటే న్యూజిలాండ్ కంటే పాకిస్థాన్ నెట్ రన్ రేట్‌ను మెరుగుపరుచుకోవాల్సిన పరిస్థితి ఉంది. 

Also Read: India vs New Zealand: సెమీస్ లో న్యూజీలాండ్ పై ప్రతీకారం తీర్చుకుంటుందా?

దీని కోసం పాకిస్థాన్ 287 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించాలి. ఉదాహరణకు ఇంగ్లాండ్  మొదట బ్యాటింగ్ చేసి 150 పరుగులకు ఆలౌట్ అయితే కనుక పాకిస్థాన్ 22 బంతుల్లో 151 పరుగులు చేయాలి. అదే ఇంగ్లాండ్ కనుక 300 పరుగుల చేసి ఆలౌట్ అయితే.. పాకిస్థాన్ 37 బంతుల్లో ఈ లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. అదే ఇంగ్లండ్‌పై పాక్‌ ముందుగా బ్యాటింగ్‌ చేస్తే 287 పరుగుల తేడాతో విజయం సాధించాల్సి ఉంటుంది. ఇది దాదాపు ఏ టీమ్ కైనా అసాధ్యమైన టాస్క్ అని చెప్పవచ్చు. అందువలన ఏదైనా అద్భుతం జరిగితే మాత్రమే.. పాకిస్తాన్ కి సెమీస్ ఛాన్స్ ఉంటుంది. 

 కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి మ్యాచ్ ఇంగ్లాండ్-పాకిస్తాన్(Pakistan vs England)మ్యాచ్ జరగనుంది. పాకిస్థాన్ 8 మ్యాచ్‌ల్లో 4 విజయాలు, 4 ఓటములతో 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ఇంగ్లండ్ 8 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో 4 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. ఈరోజు మ్యాచ్‌లో గెలిస్తే ఇంగ్లిష్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీకి అర్హత సాధిస్తుంది. లేకపోతే డిపెండింగ్ ఛాంపియన్ గా వరల్డ్ కప్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఇంగ్లాండ్ టీమ్ తీవ్ర అవమానంతో ఇంటి దారి పడుతుంది. 

ఇక ఈరోజు మ్యాచ్ విషయానికి వస్తే..  ఇప్పటివరకూ వన్డే ప్రపంచకప్‌లో ఇరు జట్ల మధ్య 10 మ్యాచ్‌లు జరగగా, పాకిస్థాన్ 5, ఇంగ్లండ్ 4 గెలిచాయి. ఒక్క మ్యాచ్ లో ఫలితం రాలేదు.

వన్డేల్లో ఈ రెండు టీమ్స్ మధ్య 91 మ్యాచ్‌లు జరగగా, పాకిస్థాన్ 31, ఇంగ్లండ్ 56 మ్యాచ్‌లు గెలిచాయి. 3 మ్యాచ్‌లు అసంపూర్తిగా మిగిలిపోయాయి. ఇటీవలి ఫామ్‌ను బట్టి చూస్తే పాకిస్థాన్‌దే పైచేయి అయినప్పటికీ ఇంతకు ముందు  మ్యాచ్‌లో గెలిచిన తర్వాత ఇంగ్లండ్ కూడా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉంది.

పాకిస్తాన్ ఇలా..  

వన్డే ప్రపంచకప్ 2023లో నెదర్లాండ్స్‌ను ఓడించి పాకిస్థాన్ తన ప్రయాణాన్ని అద్భుతంగా ప్రారంభించింది. ఆ తర్వాత రెండో మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించింది. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. భారత్‌, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్‌, దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. అయితే, బంగ్లాదేశ్ - న్యూజిలాండ్‌లతో జరిగిన చివరి రెండు మ్యాచ్‌లలో వరుసగా విజయాలు సాధించింది.

రిజ్వాన్ టాప్ స్కోరర్: 

పాకిస్థాన్ కు చెందిన మహ్మద్ రిజ్వాన్ టాప్ స్కోరర్. అతను 8 మ్యాచ్‌ల్లో సెంచరీ సాధించాడు. అతను 359 పరుగులు చేశాడు. పేసర్ షాహీన్ షా ఆఫ్రిది జట్టులో టాప్ వికెట్ టేకర్ కాగా, అతని పేరిట 16 వికెట్లు ఉన్నాయి.

ఇంగ్లండ్ ఇలా.. 

ప్రస్తుత ఛాంపియన్ ఇంగ్లండ్ కు ఈ ప్రపంచకప్ లో శుభారంభం లేదు. తొలి మ్యాచ్‌లోనే న్యూజిలాండ్‌పై ఓటమి చవిచూడాల్సి వచ్చింది. రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించింది. ఆ తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది. చివరి మ్యాచ్‌లో ఇంగ్లిష్‌ జట్టు నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది.

మలన్ టాప్ స్కోరర్
ఇంగ్లండ్‌కు చెందిన డేవిడ్ మలన్ (David Malan) అత్యధికంగా 373 పరుగులు చేశాడు. 13 వికెట్లు తీసిన ఆదిల్ రషీద్ జట్టులో టాప్ వికెట్ టేకర్ గా నిలిచాడు. 

పిచ్ రిపోర్ట్
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలోని వికెట్ ఎప్పుడూ బ్యాటింగ్‌కు ఉపయోగపడుతుంది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఇక్కడ 3 మ్యాచ్‌లు జరిగాయి. ఇక్కడ మొత్తం 34 వన్డేలు జరిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 20 మ్యాచ్‌లు, ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన జట్లు 13 మ్యాచ్‌లు గెలిచాయి. ఒక్క మ్యాచ్ ఫలితం లేదు.

2014లో శ్రీలంకపై భారత్ చేసిన 404 పరుగులే ఈ మైదానంలో అత్యధిక స్కోరు. ఈ ప్రపంచకప్‌లో భారత్‌పై దక్షిణాఫ్రికా చేసిన 83 పరుగుల అతి చిన్న స్కోరు.

వాతావరణం ఎలా ఉంటుందంటే..
కోల్‌కతాలో శనివారం వాతావరణం స్పష్టంగా ఉంటుంది. వర్షం పడే అవకాశం 1% మాత్రమే ఉంది. గంటకు 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశము ఉంది.  తేమ దాదాపు 33% ఉంటుంది. ఉష్ణోగ్రత 21 నుంచి 32 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది.

ఫైనల్ టీమ్స్ ఇలా ఉండొచ్చు:
పాకిస్తాన్: 

 బాబర్ అజామ్ (కెప్టెన్), ఫఖర్ జమాన్, అబ్దుల్లా షఫీక్, మహ్మద్ రిజ్వాన్ (వికెట్ కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, సల్మాన్ అలీ అగా, షాహీన్ షా ఆఫ్రిది, హసన్ అలీ, మహ్మద్ వసీం జూనియర్ - హరీస్ రౌఫ్ ..

ఇంగ్లాండ్: 

జోస్ బట్లర్ (కెప్టెన్ - వికెట్ కీపర్), జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, బెన్ స్టోక్స్, హ్యారీ బ్రూక్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, డేవిడ్ విల్లీ, ఆదిల్ రషీద్ - గుస్ అట్కిన్సన్.

Watch this interesting video:

Advertisment
Advertisment
తాజా కథనాలు