Pakistan: పాకిస్తానీలను చంపింది భారత ఏజంట్లే..భారత్‌ పై పాక్‌ సంచలన ఆరోపణలు!

పాక్‌ లో కొద్ది రోజుల క్రితం జరిగిన హత్యల్లో భారత ఏజంట్లు యోగేష్‌ కుమార్‌, అశోక్‌ కుమార్‌ ఆనంద్‌ ల ప్రమేయం ఉందని సజ్జాద్ ఆరోపించారు.లతీఫ్‌ అనే వ్యక్తిని హత్య చేసేందుకు యోగేష్‌ ఉమైర్‌ అనే వ్యక్తిని నియమించుకున్నాడని ఆరోపించారు.

New Update
Pakistan: పాకిస్తానీలను చంపింది భారత ఏజంట్లే..భారత్‌ పై పాక్‌ సంచలన ఆరోపణలు!

Pakistan: పాక్‌ లో కొందరు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో పాక్‌ ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ హత్యల వెనుక భారత్‌ (Bharat) ఏజెంట్లు ఉన్నారని పాక్‌ (Pak)  సంచలన వ్యాఖ్యలు చేసింది. తొలిసారి పాక్‌ విదేశాంగ కార్యదర్శి సైరస్‌ సజ్జాద్‌ భారత్‌ పై ఆరోపణలు చేశారు. పాక్‌ లో కొద్ది రోజుల క్రితం జరిగిన హత్యల్లో భారత ఏజంట్లు యోగేష్‌ కుమార్‌, అశోక్‌ కుమార్‌ ఆనంద్‌ ల ప్రమేయం ఉందని సజ్జాద్ ఆరోపించారు.

లతీఫ్‌ అనే వ్యక్తిని హత్య చేసేందుకు యోగేష్‌ ఉమైర్‌ అనే వ్యక్తిని నియమించుకున్నాడని..అంతే కాకుండా స్థానిక నేరస్తులతో సంబంధాలు కూడా ఏర్పాటు చేసుకున్నాడని ఆరోపించారు. చాలాసార్లు హత్యప్రయత్నం చేసినప్పటికీ అవి విఫలం కావడంతో ఇక ఉమైర్‌ నే స్వయంగా హత్యలు చేయాలని నిర్ణయించుకున్నాడు.

భారత్‌ ఏజెంట్‌ తో సంబంధాలు...

ఈ క్రమంలోనే అతను 5గురితో కలిసి కిల్లర్‌ టీమ్‌ ను ఏర్పాటు చేసుకున్నాడు. గత సంవత్సరం లతీఫ్‌ పై రెండు సార్లు హత్య ప్రయత్నం జరగగా..రెండోసారి హత్య చేసినట్లు ఆరోపించారు. లతీఫ్‌ హత్యలో ప్రమేయం ఉన్న ఉమైర్‌ ఇతర వ్యక్తుల్నీ, అరెస్ట్‌ చేసిన సమయంలో వారికి యోగేష్‌ కుమార్‌ అనే భారత్‌ ఏజెంట్‌ తో సంబంధాలు ఉన్నట్లు తెలిసిందని పాక్‌ విదేశాంగ కార్యదర్శి తెలిపాడు.

ఈ క్రమంలోనే మరో పాకిస్తానీ మహ్మద్‌ రియాజ్‌ ని భారత్‌ ఏజెంట్‌ అశోక్‌ కుమార్‌ ఆనంద్‌ హత్య చేయించినట్లు సైరస్‌ పేర్కొన్నాడు. రియాజ్‌ పోయిన ఏడాది సెప్టెంబర్‌ లో హత్యకు గురైయ్యాడు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మహ్మద్‌ అబ్దుల్లా అలీ అనే వ్యక్తిని పాక్‌ పోలీసులు అరెస్ట్‌ చేయగా..విచారణలో అతడిని అశోక్‌ కుమార్‌, యోగేష్‌ లు నియమించుకున్నట్లు తెలిసిందని పాక్‌ ఆరోపణలు చేసింది.

వీరంతా కూడా టెలిగ్రామ్‌ ద్వారా కమ్యూనికేషన్‌ చేసుకుని మధ్యవర్తుల ద్వారా హత్య చేసే వారికి డబ్బు పంపినట్లు సైరస్‌ పేర్కొన్నారు. చనిపోయిన ఇద్దరు ఉగ్రవాదులకు కూడా జైష్‌ ఏ మహ్మద్‌, లష్కరే తోయిబా ఉగ్రసంస్థలతో సంబంధాలు ఉన్నాయి.

Also read: రామ్‌ లల్లా విగ్రహం మారిపోయింది..శిల్పి అరుణ్‌ యోగిరాజ్‌ సంచలన వ్యాఖ్యలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు