BRS Vs CNG: హుజూరాబాద్‌ లో హైటెన్షన్‌.. పాడి కౌశిక్‌రెడ్డి హౌస్‌ అరెస్ట్‌!

హుజూరాబాద్‌ రాజకీయం మరింత వేడెక్కింది. పొన్నం ప్రభాకర్ కు మద్ధతుగా కాంగ్రెస్‌ నేత ప్రణవ్‌ విసిరిన సవాల్‌ను స్వీకరించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి తడిబట్టలతో హనుమాన్‌ ఆలయంలో ప్రమాణం చేయడానికి వెళ్తుండగా పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. దీంతో ఇంట్లోనే ప్రమాణం చేశారు కౌశిక్‌.

New Update
BRS Vs CNG: హుజూరాబాద్‌ లో హైటెన్షన్‌.. పాడి కౌశిక్‌రెడ్డి హౌస్‌ అరెస్ట్‌!

Kaushik Reddy: హుజూరాబాద్ నియోజకరవర్గంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నేతలు సవాళ్లు ప్రతిసవాళ్లు విసుకుంటున్న నేపథ్యంలో నేతల ఇండ్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. కాంగ్రెస్‌ నేత ప్రణవ్‌ సవాల్‌ను స్వీకరించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ప్రమాణం చేయడానికి ఆలయానికి వెళ్తుండగా కౌశిక్‌రెడ్డిని పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. దీంతో ఇంట్లోనే తడిబట్టలతో ప్రమాణం చేశారు కౌశిక్‌రెడ్డి.

అసలేం జరిగిదంటే.. ఫ్లైయాష్‌ తరలింపు, ఓవర్‌లోడ్‌ లారీల నుంచి పొన్నం డబ్బులు డిమాండ్‌ చేయలేదని ఆలయంలో ప్రమాణం చేసి నిరూపించుకోవాలని సవాల్‌ విసిరారు. అయితే మంత్రి పొన్నంపై ఆరోపణలకు స్పందించిన కాంగ్రెస్‌ నేత ప్రణవ్‌.. శాంతిభద్రతల కారణంగా ఆలయానికి వెళ్లడంలేదని తెలిపారు. కౌశిక్‌రెడ్డే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో అవినీతికి పాల్పడడ్డాడని ఆరోపించారు. కౌశిక్ అవినీతి చేయలేదని నిరూపించుకోవాలని డిమాండ్‌ చేశారు. కౌశిక్‌ చెల్పూరు హనుమాన్‌ టెంపుల్‌లో ప్రమాణం చేయాలని సవాల్‌ విసిరడంతో కౌశిక్ ప్రమాణం చేసేందుకు వెళ్తున్న క్రమంలో పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

RCB VS RR: హుర్రే..ఓన్ గ్రౌండ్ లో ఆర్సీబీ గెలిచింది..ఆరఆర్ పై విక్టరీ

మొత్తానికి సొంతగడ్డపై బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ గెలిచింది. ఐపీఎల్ 18 సీజన్ లో బెంగళూరు చినస్వామి స్టేడియంలో ఆర్సీబీ గెలవడం ఇదే మొదటిసారి. రాజస్థాన్ రాయల్స్ మీద ఆర్సీబీ 11 పరుగులు తేడాతో విజయం సాధించింది. 

New Update
ipl

RCB VS RR

ఐపీఎల్ లో ఈ రోజు ఆర్సీబీ, ఆర్ఆర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో బెంగళూరు 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 205 పరుగులు చేసి ఆర్ఆర్ కు 206 టార్గెట్ ఇచ్చింది. ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులే చేసింది.  పరుగుల ఛేదనలో ఆర్ఆర్ తొమ్మిది వికెట్లను కోల్పోయింది. యశస్వీ జైస్వాల్‌ (49), ధ్రువ్‌ జురెల్‌ (47) పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బెంగళూరు జట్టులో హేజిల్ వుడ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 19వ ఓవర్లో కేవలం ఒక పరుగే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. చివరి ఓవర్లో లక్ష్యం 17 పరుగులు కాగా, యశ్‌ దయల్‌ వికెట్‌ తీసి కేవలం 5 పరుగులే ఇచ్చాడు. ఆర్సీబీలో హేజిల్‌ వుడ్‌ 4, కృనాల్‌ పాండ్య 2, భువనేశ్వర్‌ కుమార్‌, యశ్‌ దయాల్‌ ఒక్కో వికెట్‌ తీశారు. 

చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రసవత్తరమైన మ్యాచ్ జరుగింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ  20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. 

ఎవరెన్ని కొట్టారంటే?

ఫిల్ సాల్ట్ 23 బంతుల్లో 26 పరుగులు, విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 70 పరుగులు, పడిక్కల్ 27 బంతుల్లో 50 పరుగులు, కెప్టెన్ రజత్ పాటిదార్ 3 బంతుల్లో 1 పరుగు చేశాడు. అలాగే మ్యాచ్ ఆఖరి వరకు ఆడిన డేవిడ్ 15 బంతుల్లో 23 పరుగులు, జితేశ్‌ శర్మ 10 బంతుల్లో 20 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 

కోహ్లీ పరుగుల వరద

32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఆ తర్వాత కూడా దూకుడుగానే ఆడుతూ రన్స్ రాబట్టాడు. అప్పటికే రెండు సిక్సులు కొట్టి ఫ్యాన్స్‌కు మంచి ఊపు తెప్పించాడు. కానీ మరో షార్ట్ ఆడే క్రమంలో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో 42 బంతుల్లో 70 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అయితే ఈ మ్యాచ్‌లో రెండు సిక్సులు కొట్టిన కోహ్లీ.. మరో సిక్స్ కొట్టుంటే అరుదైన రికార్డు క్రియేట్ చేసి ఉండేవాడు. 

today-latest-news-in-telugu | IPL 2025 | rcb-vs-rr | match

Advertisment
Advertisment
Advertisment