NCBN: ప్రతిపక్షాల ఓట్లను తీసేస్తున్నారు.. ఈసీకి చంద్రబాబు లేఖ రాష్ట్రంలో అధికార పక్షం వైసీపీ ఓట్ల అవకతవకలకు పాల్పడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన ఆరోపణ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి శుక్రవారం ఆయన లేఖ రాశారు. By Naren Kumar 09 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ విజయవాడ New Update షేర్ చేయండి TDP - Chandra Babu Naidu: రాష్ట్రంలో అధికార పక్షం వైసీపీ ఓట్ల అవకతవకలకు పాల్పడుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన ఆరోపణ చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి శుక్రవారం చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. ఇది కూడా చదవండి: ‘అహంకారంతో విర్రవీగితే…’ తెలంగాణ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు! ‘‘ఎలక్టోరల్ మాన్యువల్ 2023 ప్రకారం మార్పులు జరగట్లేదు. క్షుణ్నంగా పరిశీలించి డబుల్ ఎంట్రీలను తొలగించాలి. ఇప్పటికీ డబుల్ ఎంట్రీలు గుర్తిస్తూనే ఉన్నారు. ఓటరు జాబితాలో ఇంకా మరణించిన వారి ఓట్లున్నాయి. ఆన్‌లైన్‌లో ఇష్టానుసారంగా ఓట్లు నమోదు చేస్తున్నారు.. ప్రతిపక్షాల ఓట్లను తొలగిస్తున్నారు. మా అభ్యంతరాలపై ఇప్పటికీ దృష్టిపెట్టలేదు. ఓట్లను తొలగించాలంటే కచ్చితమైన ఆధారాలు చూపించాలి. ఎలాంటి విచారణ లేకుండానే ఓట్లను తొలగిస్తున్నారు. ఓట్ల అవకతవకలు పునరావృతం కాకుండా ఈసీ చూడాలి’’ అని ఈసీకి రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: నా ఫోన్ హ్యాక్ చేశారు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు! రాష్ట్రప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని చంద్రబాబు నాయుడు విమర్శించారు. న్యాయబద్ధంగా ఎన్నికలను ఎదుర్కోలేక ఓటరు జాబితాలో అధికార పార్టీ అవకతవకలకు పాల్పడుతోందని వ్యాఖ్యానించారు. తమ పార్టీ ఎల్లప్పుడూ ప్రజల వైపే ఉంటుందని, ప్రజా ప్రయోజనాల కోసమే పోరాడుతుందని చంద్రబాబు స్పష్టంచేశారు. అధికార పార్టీ తీరు మారకపోతే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు. #chandra-babu-naidu #election-commission మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి