CBSE Controversy: CBSEలో సిస్టమ్ ఫెయిల్యూర్.. ప్రశ్నిస్తే పాకిస్థానీ అంటారా?

ఆన్సర్ షీట్ మారడంతోనే తనకు తక్కువ మార్క్స్ వచ్చాయని ప్రశ్నించిన ఓ స్డూడెంట్ పై CBSE బోర్డు పాకిస్థానీ అంటూ నిందలు వేసింది. ఇప్పుడు అదే CBSE  విద్యార్థి ఫిర్యాదు కరెక్ట్ అని ఒప్పుకుంది.  అతడిని ఎందుకు టార్గెట్ చేశారు? తన ఆన్సర్ షీట్ తనదేనా అని అడిగినందుకా?

New Update
CBSE Ravi Prakash

CBSE Controversy

 -RAVI PRAKASH

Ravi Prakash

ఒక్కసారి ఊహించండి.  17 ఏళ్ల వయసు.  ఒక సంవత్సరం మొత్తం బోర్డ్ ఎగ్జామ్స్ కోసం పడ్డ కష్టం.  నిద్ర లేదు. టెన్షన్ తప్పదు.  ప్రతి మార్క్ జీవితాన్ని నిర్ణయించే పరిస్థితి.  అలాంటి సమయంలో రిజల్ట్స్‌ వచ్చాయి. ఒక విద్యార్థికి షాక్ తగిలింది.  రీ-వాల్యుయేషన్ కోసం CBSEకి అప్లై చేశాడు. ఆ తర్వాత వచ్చిన ఆన్సర్ షీట్ చూసి షాక్ అయ్యాడు.  ఇది నా హ్యాండ్‌రైటింగ్ కాదు.  ఇవి నేను రాసిన ఆన్సర్స్ కావు అని ఆక్రోశించాడు.   కానీ సమాధానం ఇవ్వాల్సిన వాళ్లు, అతనినే పాకిస్థానీ అని టార్గెట్ చేశారు.


ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చ ఏంటంటే, సీబీఎస్ఈ కొత్త డిజిటల్ సిస్టమ్‌లో భారీ తప్పిదాలు జరిగాయా?  ఎందుకంటే, చివరికి CBSEఏ ఒప్పుకుంది. అవును, విద్యార్థుల ఫిర్యాదు కరెక్ట్.  ఇంతకీ ఎవరు ఈ వేదాంత్?

వేదాంత్..  క్లాస్ 12 స్టూడెంట్.  దేశంలోని లక్షల మంది స్టూడెంట్స్‌లాగే ఈ ఏడాది సీబీఎస్ఈ బోర్డ్ (CBSE Board) పరీక్షలు రాశాడు.  ఫలితాలు వచ్చిన తర్వాత ఫిజిక్స్ మార్కులు చూసి షాక్ అయ్యాడు. మార్కుల కోసం రీచెకింగ్(Exam Checking Error) అడగడం కొత్త విషయం కాదు.  కానీ తర్వాత జరిగినది మాత్రం షాకింగ్ డెవలప్‌మెంట్‌.  వేదాంత్ అధికారికంగా తన ఫిజిక్స్ ఆన్సర్ షీట్ ఫోటోకాపీ కోరాడు.

Also Read: దమ్ముంటే అరెస్ట్‌ చేసుకోండి..జైల్లో ఆత్మకథ రాసుకుంటా..ప్రొఫెసర్ నాగేశ్వర్‌ సంచలన వ్యాఖ్యలు

ఆ షీట్ వచ్చిన తర్వాత అతను చెప్పిన మాట..  ఇది నా పేపర్ కాదు.  కేవలం వేదాంత మాత్రమే కాదు.  తల్లిదండ్రులు చూసారు.టీచర్లు చూశారు.  ఫ్రెండ్స్ కూడా చూశారు. వేదాంత్‌ తన ఇంగ్లీష్, కంప్యూటర్ సైన్స్ పేపర్లతో పోల్చాడు.  అక్కడ హ్యాండ్‌రైటింగ్ ఒకలా ఉంది.  కానీ ఫిజిక్స్ పేపర్ మాత్రం పూర్తిగా డిఫరెంట్.  అక్షరాలు వేరు. రాసే స్టైల్ వేరు.  స్పేసింగ్ వేరు.  సెంటెన్స్ ఫార్మేషన్ కూడా వేరు.  వేదాంత్ సోషల్ మీడియాలో ఒకే మాట అన్నాడు.  ఇది నా హ్యాండ్‌రైటింగ్ కాదని నాకు ఖచ్చితంగా తెలుసు.  

ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే.  అతను రాజకీయ ఆరోపణలు చేయలేదు.  ఒక భయపడిన విద్యార్థిలా మాట్లాడాడు.  ఒక సంవత్సరం కష్టపడ్డాను. నిద్రలు మానేశాను. ఇప్పుడు నా అసలు పేపర్ చెక్ అయ్యిందో లేదో కూడా తెలియడం లేదు.  ఈ మాట ప్రతి తండ్రిని ఆలోచింపజేస్తుంది. 

అసలు OSM సిస్టమ్ అంటే ఏమిటి? (Online Script Monitoring)

ఈ ఏడాది సీబీఎస్ఈ కొత్త డిజిటల్ ప్రాసెస్ తీసుకొచ్చింది.  దాని పేరే OSM.. అంటే ఆన్లైన్ స్క్రీప్ట్ మానిటరింగ్.  దీని ఉద్దేశ్యం ఏంటంటే..  డిజిటలైజేషన్, ట్రాన్స్‌పరెన్సీ,  ఫాస్ట్ ప్రాసెసింగ్.  కానీ ఇలాంటి సిస్టమ్స్‌లో ఒక చిన్న తప్పు జరిగినా, విద్యార్థి భవిష్యత్తే మారిపోతుంది.  ఎందుకంటే, ఈ ప్రాసెస్‌లో ఏముంటాయో ఒక్కసారి చూద్దాం. 


స్కానింగ్,  ట్యాగింగ్,  డేటాబేస్ మ్యాపింగ్,  అప్లోడ్స్,  వెరిఫికేషన్.  ఇందులో ఎక్కడైనా మిస్‌మ్యాచ్ అయితే?  ఒకరి ఆన్సర్ షీట్ ఇంకొకరి పేరుతో వెళ్లే ప్రమాదం ఉంటుంది.  అదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.  ఎందుకంటే ఇది కేవలం మార్కుల విషయం కాదు. ఇది నమ్మకానికి సంబంధించి విషయం. దేశంలోని కోట్ల మంది విద్యార్థులు నమ్మే సిస్టమ్ మీద ఇప్పుడు సందేహాలు వస్తున్నాయి.

Also Read: గాంధీ భవన్‌లో టెన్షన్‌..టెన్షన్..మంత్రుల ముందే తన్నుకున్న నేతలు

వేదాంత్‌ తర్వాత రంగంలోకి వచ్చింది సంజన.  మొదట్లో చాలా మంది వేదాంత్‌ను సీరియస్‌గా తీసుకోలేదు.  మార్కులు తక్కువ వచ్చాయి కాబట్టి డ్రామా చేస్తున్నాడు అన్నారు.  ఇప్పుడు  ఇంకో విద్యార్థిని సంజన ముందుకొచ్చింది.  ఆమె కూడా తన కెమిస్ట్రీ ఆన్సర్ షీట్ తనది కాదని చెప్పింది.  మళ్లీ అదే సమస్య.  హ్యాండ్‌రైటింగ్ మ్యాచ్ కాలేదు.  రాసిన ఆన్సర్స్ స్టైల్ వేరు.  

ఇంగ్లీష్ పేపర్‌తో పోల్చితే క్లియర్ డిఫరెన్స్ కనిపించింది.  ఇక్కడే కథలో టర్నింగ్ పాయింట్ వచ్చింది.  సీబీఎస్ఈ అధికారికంగా స్పందించింది. ఏమందంటే, మీ ఫిర్యాదు సరైనదే అని గుర్తించాం.  అంటే, తప్పు ఆన్సర్ షీట్ పంపినట్టు సీబీఎస్ఈ ఒప్పుకుంది.  సరైన ఆన్సర్ బుక్ ఇప్పుడు దొరికిందని తెలిపింది. రిజల్ట్ కూడా అప్‌డేట్ చేస్తామని చెప్పింది. ఇది ఇక సోషల్ మీడియా ఆరోపణ కాదు. ఇది  అధికారికంగా ఒప్పుకున్న విషయం.   

అయితే, వేదాంత్ విషయంలో కూడా సీబీఎస్ఈ ఒప్పుకుందా?  అవును.  తర్వాత వేదాంత్‌కూ మెయిల్ వెళ్లింది.  ఆ మెయిల్‌లో ఏముందంటే,   మీ సరైన ఫిజిక్స్ ఆన్సర్ బుక్ జతపరిచాం. కొత్త మార్కుల ఆధారంగా ఫలితాలు అప్‌డేట్ చేస్తాం.  అంటే ఏమిటి?  మొదట పంపిన పేపర్ తప్పు. తర్వాత మరో ఆన్సర్ బుక్ దొరికింది.  ఇప్పుడు మార్కులు చేంజ్‌ చేస్తారట. అంటే విద్యార్థి చెప్పిందే నిజమైంది. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే,  ఇలాంటి తప్పులు ఇంకా ఎంతమందికి జరిగాయి?  అత్యంత షాకింగ్ విషయం  ఏంటంటే,  ఈ కథలో టెక్నికల్ ఫెయిల్యూర్ కంటే భయంకరమైన విషయం ఇంకోటి ఉంది.  వేదాంత్ సోషల్ మీడియాలో ప్రశ్నించగానే… కొంతమంది జర్నలిస్టులు అసలు సమస్యపై ప్రశ్నలు అడగకుండా,  అతడినే టార్గెట్ చేశారన్న విమర్శలు వచ్చాయి.

Also Read: CBSE త్రిభాషా సూత్రంపై పిటిషన్‌ .. కేంద్రానికి ‘సుప్రీం’ నోటీసులు

ఈలోగా, ఒక సీనియర్ టీవీ యాంకర్ అతడిని పాకిస్థానీ  అని పిలిచారన్న ఆరోపణలు వైరల్ అయ్యాయి.  ఒక్కసారి ఆలోచించండి.  17 ఏళ్ల విద్యార్థి ఏమన్నాడు?  సార్… ఇది నా ఆన్సర్ షీట్ కాదనిపిస్తోంది అన్నాడంతే.  కానీ అతని దేశభక్తినే ప్రశ్నించారన్న విమర్శలు వచ్చాయి.  ఇది
చాలా మందిని షాక్‌కు గురి చేసింది. ఎందుకంటే జర్నలిజం పని ఏంటి?  సిస్టమ్‌ని ప్రశ్నించడం.  కానీ ఇప్పుడు ప్రశ్నించిన విద్యార్థినే ప్రశ్నించే పరిస్థితి వచ్చిందా అన్న చర్చ మొదలైంది. ఇక్కడ ఇంకా పెద్ద విషయం ఏంటంటే, ఇప్పుడు సీబీఎస్ఈ విద్యార్థి ఫిర్యాదు కరెక్ట్ అని ఒప్పుకుంది.  

అంటే,  అతడిని ఎందుకు టార్గెట్ చేశారు?  తన ఆన్సర్ షీట్ తనదేనా అని అడిగినందుకా?  ఇప్పుడు ఇదే దేశం ముందు ఉన్న పెద్ద ప్రశ్న.   ఇక్కడే అసలు భయం మొదలవుతోంది. ఎందుకంటే, చాలా మంది విద్యార్థులు ఫోటోకాపీల కోసం అప్లై చేయరు.  కొంతమందికి డబ్బులు ఉండవు.  కొంతమంది  మన తప్పే అయి ఉంటుంది అనుకుని వదిలేస్తారు.  మరి ఇలాంటి మిస్‌మ్యాచ్లు ఇంకెంతమందికి జరిగాయి? ఇంకా ఎన్ని ఆన్సర్ షీట్లు తప్పుగా అటాచ్ అయ్యాయి?  

ఇంతలో,  మరింత మంది విద్యార్థులు కూడా ఇప్పుడు బయటకు రావడం ప్రారంభించారు. ఇది కేవలం వేదాంత్, సంజనా దగ్గరే ఆగిపోలేదు.  మరో విద్యార్థిని ఇక్రా సోషల్ మీడియాలో ఇలా రాసింది.  నేను సీబీఎస్ఈ క్లాస్ 12 స్టూడెంట్‌ని.  ఫిజిక్స్‌లో అనూహ్యంగా తక్కువ మార్కులు రావడంతో, సీబీఎస్ఈ రీ-ఎవాల్యుయేషన్ ప్రాసెస్ ద్వారా ఆన్సర్ షీట్ ఫోటోకాపీలు కోరాం. అలాగే మరో విద్యార్థి అనుజ్ కూడా షాకింగ్ పోస్ట్ చేశాడు.  అతను ఏమన్నాడంటే, ఈరోజు మాకు ఆన్సర్ షీట్ కాపీలు వచ్చాయి.  కానీ సీబీఎస్ఈ అప్లోడ్ చేసిన ఫిజిక్స్ ఆన్సర్ షీట్ నాది కాదు.  దీంతో నేను పూర్తిగా షాక్ అయ్యానని. 


ఇప్పుడు ఇక్కడ అసలు విషయం ఏంటంటే,  ఇది ఇక ఒక్క విద్యార్థి సమస్య కాదు.  ఒక్క వేదాంత్ విషయం కాదు.  ఒక్క సంజనా విషయం కాదు. నెమ్మదిగా, మరింత మంది విద్యార్థులు ఒకే రకమైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  మా ఆన్సర్ షీట్ నిజంగా మాదేనా?  మా పేపర్‌కే మార్కులు వేశారా?  ఎక్కడైనా మిస్‌మ్యాచ్ జరిగిందా?  అనే భయం బయటపడుతోంది.

Also Read: ప్రేమ నుంచి బ్రేకప్ వరకు.. బండి భగీరథ్ ను పోలీసులు అడుగుతున్న 10 ప్రధాన ప్రశ్నలివే!

ఇప్పుడు దేశం ముందున్న అసలు ప్రశ్న ఒక్కటే.  సీబీఎస్ఈ ఈవాల్యుయేషన్ సిస్టమ్‌లో,  లోపల మరింత పెద్ద సిస్టెమేటిక్ ఎర్రర్ ఉందా? ఇంకా ఎంత మంది స్టూడెంట్స్ తమ భవిష్యత్తు కోల్పోయారో ఎవరికీ తెలియదు.  భారతదేశంలో ఒక్క మార్క్ ర్యాంక్ మార్చేస్తుంది.  ర్యాంక్ కాలేజ్ మార్చేస్తుంది.  కాలేజ్ జీవితం మార్చేస్తుంది.  అందుకే ఇది చిన్న టెక్నికల్ ఇష్యూ కాదు. ఇది లక్షల కుటుంబాల భవిష్యత్తుకు సంబంధించిన విషయం.

ఈ కథ రాజకీయాల గురించి కాదు.  లెఫ్ట్-రైట్ డిబేట్ కాదు.  ఇది 17 ఏళ్ల పిల్లల గురించి.  సార్… నా ఆన్సర్ షీట్ నిజంగా నాదేనా చూసి చెప్పండి అని అడగాల్సిన పరిస్థితి రావడం గురించి.  వేదాంత్‌ను ట్రోల్ చేశారు.  అవమానించారు.  పేర్లు పెట్టారు. కానీ చివరికి సీబీఎస్ఈ అతనికి సరైన ఆన్సర్ షీట్ పంపింది.  సంజనాను కూడా మొదట నమ్మలేదు.  తర్వాత సీబీఎస్ఈ ఆమె ఫిర్యాదు కరెక్ట్ అని ఒప్పుకుంది.  ఇప్పుడు దేశం అడుగుతున్న ప్రశ్న ఒక్కటే.   విద్యార్థులు ఇంత కష్టపడి నిజం నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే,  మార్కులు భవిష్యత్తును నిర్ణయించే దేశంలో ఖచ్చితత్వం ఒక ఆప్షన్ కాదు. అది బాధ్యత.  ఆ బాధ్యత వైరల్ అయిన తర్వాత కాదు మొదటి రోజు నుంచే ఉండాలి. 17 ఏళ్ల పిల్లవాడు తన ఆన్సర్ షీట్ తనదేనని నిరూపించుకోవాల్సిన పరిస్థితి రావడం ఏ సిస్టమ్‌కైనా పెద్ద హెచ్చరికే. దీన్ని సంక్షిప్తంగా సిస్టం ఫెయిల్యూర్ అంటారు.

                                                                                                                                                                                                                      

Advertisment
తాజా కథనాలు