Onion Exports: ఉల్లి ఎగుమతులపై నిషేధం తొలగింపు.. ఇప్పుడే ఎందుకు? దేశంలో ధరలు పెరుగుతాయా?

ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని కేంద్రం ఎత్తివేసింది. ఇప్పుడే హఠాత్తుగా ఎందుకు నిషేధం ఎత్తివేశారు? దేశంలో దీనివలన ఉల్లి ధరల పెరుగుదలకు అవకాశం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్ పూర్తిగా చదవాల్సిందే. 

New Update
Onion Exports: ఉల్లి ఎగుమతులపై నిషేధం తొలగింపు.. ఇప్పుడే ఎందుకు? దేశంలో ధరలు పెరుగుతాయా?

ఒకపక్క ఎన్నికలు జరుగుతున్నాయి. పార్టీలన్నీ హోరాహోరీ ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని(Onion Exports) అకస్మాత్తుగా ఎత్తేసింది ప్రభుత్వం. గత అక్టోబర్ నెలలో ఉల్లిధరలు ఆకాశాన్నంటాయి. ఈ సమయంలో సామాన్యులపై భారం తగ్గించడం కోసం.. దేశంలో ఉల్లిధరలు నియంత్రించడానికి ప్రభుత్వం ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. దీంతో దేశంలో ఉల్లి ధరలు నియంత్రణలోకి వచ్చాయి. ఆ తరువాత ఉల్లి ఎగుమతులపై(Onion Exports) నిషేధాన్ని తొలగించాలని ఉల్లి రైతులు చాలాసార్లు ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చారు. కానీ, ప్రభుత్వం మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అప్పటి నుంచి మార్కెట్లో ఉల్లిధరలు కూడా నియంత్రణలోనే కొనసాగుతున్నాయి. 

ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకు?
నిజానికి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాల్లో ఉల్లిని ఎక్కువగా పండించే ప్రాంతాలు ఉన్నాయి. తరువాతి దశ ఎన్నికలు ఈ ప్రాంతాల్లో జరుగనున్నాయి. దీంతో అక్కడి రైతుల ఓట్లను కొల్లగొట్టేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉల్లి ఎగుమతుల(Onion Exports) నిషేధాన్ని ఇప్పుడు తొలగించింది అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మహారాష్ట్రలోని నాసిక్, కొల్హాపూర్, అహ్మద్‌నగర్, ధూలే, పూణే, మరఠ్వాడా, షిరూర్, షిర్డీ, ఛత్రపతి శంభాజీనగర్, బీడ్, దిండోరి లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ఉల్లి ఉత్పత్తిదారులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీన్ని తొలగించాలని వారు చాలా కాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర మంత్రి డాక్టర్‌ భారతీ పవార్‌, ఎంపీ డాక్టర్‌ సుజయ్‌ విఖే పాటిల్‌, హేమంత్‌ గాడ్సే సహా పలువురు పెద్ద నేతలు ఈ ఉల్లిగడ్డ నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఉల్లి ఎగుమతుల(Onion Exports)పై నిషేధం ఆయా అభ్యర్థులను వెనుకబడేలా చేసింది. దీంతో ఇప్పుడు ఉల్లి ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేశారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. 

Also Read: వ్యవస్థపై కోపం వచ్చి బట్టలు లేకుండా ఫుట్ బాల్ మ్యాచ్

పాక్షికంగా ఎగుమతులు..
అయితే, గత ఏడాది డిసెంబర్‌లో ప్రభుత్వం మార్చి 31, 2024 వరకు ఉల్లి ఎగుమతి(Onion Exports)ని నిషేధించింది. అయితే, నిషేధం మధ్య కూడా ప్రభుత్వం కొన్ని స్నేహపూర్వక దేశాలకు ఉల్లిపాయలను ఎగుమతి చేస్తోంది. బంగ్లాదేశ్, యుఎఇ, భూటాన్, బహ్రెయిన్, మారిషస్ -శ్రీలంక వంటి ఆరు పొరుగు దేశాలకు 99,150 టన్నుల ఉల్లిపాయలను ఎగుమతి చేయడానికి ప్రభుత్వం గత నెలలో అనుమతించింది. వారికి తెల్ల ఉల్లిని పంపించారు.

దేశంలో ఉల్లి ధరలు పెరుగుతాయా?
ఎగుమతుల(Onion Exports)పై నిషేధాన్ని ఎత్తివేయడం వల్ల ఇప్పటికిప్పుడు ఉల్లిధరలు పెరిగే అవకాశం ఉండదని నిపుణులు భావిస్తున్నారు. తగినంతగా ఉల్లి నిల్వలు ఉండడం, ప్రభుత్వం కూడా చాలా బఫర్ స్టాక్ పెట్టుకోవడంతో ఉల్లి ధరలపై ఈ నిర్ణయం పెద్దగా ప్రభావితం చేయకపోవచ్చం వారి అంచనా. 

Advertisment
Advertisment
తాజా కథనాలు