Oldest Ostrich Nest: ఆస్ట్రిచ్ అంటే ఆఫ్రికా పక్షి కాదు.. ఏపీలోనూ దాని ఉనికి ఉంది!

ప్రపంచంలోనే అతి పెద్ద పక్షి ఆస్ట్రిచ్.. ఆఫ్రికా అడవుల్లో మాత్రమే ఉంటుందని మనకు తెలుసు. కానీ, ఇటీవల పరిశోధకులు ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో ఆస్ట్రిచ్ పక్షి పురాతన గూడును కనుగొన్నారు. దీనిని 41 వేల సంవత్సరాల క్రితం గూడుగా పరిశోధకులు చెబుతున్నారు.

New Update
Oldest Ostrich Nest: ఆస్ట్రిచ్ అంటే ఆఫ్రికా పక్షి కాదు.. ఏపీలోనూ దాని ఉనికి ఉంది!

Oldest Ostrich Nest: ఆస్ట్రిచ్ అంటే ఉష్ట్రపక్షిగా పిలుచుకునే అతి పెద్ద పక్షి జాతి ప్రస్తుతం ఆఫ్రికాలోనే కనిపిస్తుంది. మన పుస్తకాలలో కూడా ఈ పక్షి ఆఫ్రికా పక్షిగానే మనకు పరిచయం చేస్తారు. నిజానికి ఈ పక్షి ఉనికి మనదేశంలో.. అందులోనూ ఏపీలో ఉండేదనే విషయం ఎవరికీ తెలీదు. అసలు ఆ ఊహ కూడా ఎవరికీ రాదు. కానీ, ఇటీవల ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఈ ఆస్ట్రిచ్ పక్షికి సంబంధించిన పురాతన ఆనవాళ్లు కనిపించి ఆశ్చర్యాన్ని కలిగించాయి. అవును.. అంతర్జాతీయ పురావస్తు శాస్త్రవేత్తల బృందం దక్షిణ భారతదేశంలో ఉష్ట్రపక్షి గూడును కనుగొంది. ఈ గూడు 41,000 సంవత్సరాల కంటే పాతది.  దక్షిణ భారతదేశంలో ఇప్పటివరకు కనబడిన అత్యంత పురాతన ఉష్ట్రపక్షి గూడు ఇది.

Oldest Ostrich Nest: వడోదరకు చెందిన MS యూనివర్శిటీ (MSU)కి చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు జర్మనీ, ఆస్ట్రేలియా, అమెరికాకు చెందిన సహోద్యోగుల సహకారంతో ఈ ఆస్ట్రిచ్ గూడు బయటపడింది.  టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన రిపోర్ట్ ప్రకారం, ఈ గూడులో 9-11 ఉష్ట్రపక్షి గుడ్లు శిలాజాలుగా కూడా ఉన్నాయి. 

Archaeologists Discover 41,000-Year-Old Ostrich Nest in AP

In a groundbreaking archaeological revelation, a team of international researchers has unearthed the world's oldest ostrich nest, dating back an astonishing 41,000 years. The remarkable find was made by archaeologists… pic.twitter.com/yxWWBSxS2t

— Sudhakar Udumula (@sudhakarudumula) June 25, 2024

Oldest Ostrich Nest: నిజానికి ఇప్పుడు ప్రపంచంలో అతి పెద్ద జంతువులుగా చెప్పుకుంటున్న వాటిలో చాలా జంతువులు భారతదేశంలోనూ మనుగడ సాగించాయి. డైనోసార్స్ కూడా భారత్ లో ఉండేవని పరిశోధకుల అభిప్రాయం. మెగాఫౌనా జంతువులు అంటే 40 కిలోల కంటే ఎక్కువ బరువున్న జంతువులు భారత్ లో ఎందుకు అంతరించిపోయాయి అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం పరిశోధకులు శోధన కొనసాగిస్తున్నారు. ఈ పరిశోధనకు ఇప్పుడు దొరికిన ఆస్ట్రిచ్ గూడు చాలా ఉపయోగపడుతుంది. సాధారణంగా ఆస్ట్రిచ్ గూడు 9 నుంచి 10 అడుగుల వెడల్పుగా ఉంటుంది.  కానీ.. ప్రకాశం జిల్లాలో దొరికిన ఉష్ట్రపక్షి గూడు 1X1.5 మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ గూడులో 3,500 ఉష్ట్రపక్షి గుడ్డు పెంకులు దొరికాయి. 

Oldest Ostrich Nest: దక్షిణ భారతదేశంలో నిప్పుకోడి ఉనికికి ఇది మొదటి సాక్ష్యంగా చెప్పవచ్చు. ప్రపంచంలో 41,000 ఏళ్ల నాటి నిప్పుకోడి గూడు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించడం ఇదే తొలిసారి. అన్ని పెద్ద జంతువులు (గుర్రాలు, పశువులు, ఏనుగులు, హిప్పోలు మొదలైనవి) మెగాఫౌనా వర్గంలోకి వస్తాయి. వీటిలో చాలా వరకు దాదాపు 40,000 సంవత్సరాల క్రితం ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో అంతరించిపోయాయి. భారతదేశం కాకుండా, మంగోలియా,  చైనా లలో కూడా ఉష్ట్రపక్షి శిలాజాలు కనుగొన్నారు. అయితే, ఇప్పుడు ఈ ఆస్ట్రిచ్ పక్షి ఆఫ్రికా అడవులలో మాత్రమే కనిపిస్తుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు