AP: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం సిబ్బందిపై స్పెషల్ ఫోకస్.. వారి మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకుని..

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలోని పూర్తి స్థాయి కార్యాలయ సిబ్బందిని SP విద్యా సాగర్ నాయుడు విచారిస్తున్నారు. అగ్నిప్రమాదం ఘటనకు ముందు, తరువాత కార్యాలయం లోకి వెళ్లిన సిబ్బందిని అధికారులు DSP కార్యాలయానికి తరలించారు. సిబ్బంది మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు.

New Update
AP: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం సిబ్బందిపై స్పెషల్ ఫోకస్.. వారి మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకుని..

Madanapalle Sub Collector Office: మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ ఆఫీస్‌లో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఘటనను అత్యంత సీరియస్‌గా తీసుకున్న సర్కార్‌.. అగ్నిప్రమాదమా? కుట్రపూరితమా? అనే కోణంలో విచారణ చేయాలని ఆదేశించింది. అగ్ని ప్రమాదంలో కీలక ఫైల్స్‌ దగ్ధం అయ్యాయి. కంప్యూటర్లు, రికార్డులు, ఫర్నీచర్‌ పూర్తిగా కాలిపోయాయి. కొత్త సబ్ కలెక్టర్ బాధ్యతలు చేపట్టేముందు ఘటన జరగడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

భూములకు సంబంధించిన కీలక పైళ్లు దగ్ధం చేశారనే ఆరోపణలపై వెంటనే విచారణ చేయాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) డీజీపీకి సూచించారు. ఈ క్రమంలో మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలోని పూర్తి స్థాయి కార్యాలయ సిబ్బందిని SP విద్యా సాగర్ నాయుడు విచారిస్తున్నారు. అగ్నిప్రమాదం ఘటనకు ముందు తరువాత కార్యాలయం లోకి వెళ్లిన సిబ్బందిని అధికారులు DSP కార్యాలయానికి తరలించారు. సిబ్బంది మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నారు.

Also Read: ఎన్డీఏ సభ్యుల సమావేశం.. ఎమ్మెల్యేలకు సీఎం దిశా నిర్దేశం..!

Advertisment
Advertisment
తాజా కథనాలు