Ap Crime: తునిలో క్షుద్ర పూజలు కలకలం..

తూర్పు గోదావరి జిల్లా తునిలో క్షుద్ర పూజల కలకలం రేగింది. క్షుద్ర పూజలు చేసి గేదె దూడని వధించిన సంచార జాతి వ్యక్తులు. పూజలు ఎందుకు చేస్తున్నారని వారిని గ్రామస్థులు ప్రశ్నించగా వారు గ్రామస్థుల పై కత్తితో దాడికి దిగారు. దీంతో గ్రామస్తులు వారికి దేహశుద్ది చేశారు.

New Update
Ap Crime: తునిలో క్షుద్ర పూజలు కలకలం..

Black Magic in Tuni: తూర్పు గోదావరి జిల్లా తునిలో క్షుద్ర పూజల కలకలం రేగింది. క్షుద్ర పూజలు చేసి గేదె దూడని వధించిన సంచార జాతి వ్యక్తులు. పూజలు ఎందుకు చేస్తున్నారని వారిని గ్రామస్థులు ప్రశ్నించగా వారు గ్రామస్థుల పై కత్తితో దాడికి దిగారు. దీంతో గ్రామస్తులు వారికి దేహశుద్ది చేశారు. దాంతో సంచార జాతి వారు పారిపోతుండగా ఒకరిని పట్టుకున్నారు.

మిగిలిన వారు పారిపోయారు. మద్యం మత్తులో క్షుద్ర పూజలు చేస్తున్న వ్యక్తిని పట్టుకుని దేహశుద్ది చేసిన గ్రామస్థులు. ఆ వ్యక్తిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటన తెరి మండలం లోవకొత్తూరు గ్రామంలో జరిగింది. నిన్న అమావాస్య కావడంతో క్షుద్ర పూజలు చేసినట్లుగా గ్రామస్థులు అనుమానిస్తున్నారు. క్షుద్ర పూజలు నేపథ్యంలో ఆందోళనకు గురవుతున్న గ్రామస్థులు. సంఘటనా స్థలంలో పూజా సామాగ్రితో పాటు.. బలి ఇచ్చిన దూడ మాంసాన్ని గుర్తించిన స్ధానికులు. ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకుని పరిశీలించి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

Also Read: పేలిన భారీ అగ్ని పర్వతం..బూడిదమయమైన విమానాశ్రయం!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

నాగాంజలి అంత్యక్రియల్లో ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు!

ఫార్మసిస్ట్ విద్యార్థిని నాగాంజలి అంత్యక్రియల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది.  నాగాంజలి మృతికి కారణమైన దీపక్‌ను...కఠినంగా శిక్షించాలని బంధువులు,గ్రామస్తుల ఆందోళన చేపట్టారు. న్యాయం జరిగిన తర్వాతే అంత్యక్రియలు నిర్వహిస్తామని నిరసనకు దిగారు.

New Update
pharmacist Naganjali

pharmacist Naganjali

ఏలూరు జిల్లా, జీలుగుమిల్లిలో టెన్షన్ వాతవరణం నెలకొంది.  ఫార్మసిస్ట్ విద్యార్థిని నాగాంజలి అంత్యక్రియల్లో ఉద్రిక్తత చోటుచేసుకుంది.  నాగాంజలి మృతికి కారణమైన దీపక్‌ను...కఠినంగా శిక్షించాలని బంధువులు,గ్రామస్తుల ఆందోళన చేపట్టారు. న్యాయం జరిగిన తర్వాతే అంత్యక్రియలు నిర్వహిస్తామని నిరసనకు దిగారు.  దీంతో నాగాంజలి స్వగ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు.  రాజమండ్రి బొల్లినేని ఆసుపత్రిలో ఫార్మసిస్ట్‌గా పనిచేస్తున్న నాగాంజలిని..  ఆసుపత్రి కోఆర్డినేటర్ దీపక్‌ వేధిస్తున్నాడంటూ..మార్చి 23న మత్తుమందు అధిక మోతాదులో తీసుకుని అత్మహత్యకు పాల్పడింది. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరిలించారు. 

దీపక్‌ వేధింపులపై 3పేజీల లేఖ

12 రోజులు వెంటిలేటర్‌పై నాగాంజలికి చికిత్స పొందుతూ నిన్న చనిపోయింది. బలవన్మరణానికి ముందు దీపక్‌ వేధింపులపై 3పేజీల లేఖ రాసింది నాగాంజలి.  ఆ రోజు రెడ్ సారీ కట్టుకొని వాడి కంటపడటమే నా తప్పయింది అంటూ తన సూసైడ్ లేఖలో వెల్లడించింది.  ఓ ఫంక్షన్‌కు రెడ్ శారీ కట్టుకుని వెళ్లడంతో వాడి కళ్లలో పడ్డానని.. తనను మోసం చేశాడని, తనకు మరణం తప్ప వేరే దారి లేదని, తన గురించి బెంగపెట్టుకోవద్దని, తాను మరణించాక అవయవాలు దానం చేయాలి అంటూ ఫార్మాసిస్ట్ సూసైడ్‌ నోట్‌ రాసిమరీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 

గత నెల 23న తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం కిమ్స్‌ బొల్లినేని ఆసుపత్రిలో ఇంటర్న్‌షిప్‌ చేస్తున్న వికాస్‌ ఫార్మసీ కళాశాల ఫార్మ్‌ డి ఫైనలియర్‌ విద్యార్థిని నాగాంజలి (23) ఆత్మహత్యాయత్నం తీవ్ర సంచలనం రేపింది. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మం డలం రౌతుగూడెం గ్రామానికి చెందిన నాగాంజలి రాజమహేంద్రవరం సమీపంలోని మధురపూడి వద్ద వికాస్‌ ఫార్మసీ కళాశాలలో ఫార్మ్‌ డి పైనలియర్‌ చదువుతోంది. అయితే గత నెలలో నాగాంజలి ఆస్పత్రిలోనే ఎనస్థీషియా అత్యధిక డోస్‌ ఇంజక్షన్‌ తీసుకుంది. దీంతో ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. వెంటనే గమనించిన సహచరులు ఐసీయూలోకి తరలించి చికిత్స అందజేశారు. 

Also Read : మరో నిర్భయ..నోట్లో గుడ్డలు కుక్కి ..కన్న కొడుకుల ముందే తల్లిపై గ్యాంగ్ రేప్!

Advertisment
Advertisment
Advertisment