Devara : 'దేవర' సెకండ్ సింగిల్ అప్డేట్.. ఈసారి అదిరిపోయే మెలోడీతో!

'దేవర' సెకెండ్ సింగిల్ కు సంబంధించి అదిరిపోయే అప్డేట్ బయటికొచ్చింది. జులై రెండో వారంలో సెకెండ్ సింగిల్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఫియర్ సాంగ్ తో గాస్ బంప్స్ తెప్పించిన మూవీ టీమ్.. ఈసారి ఓ రొమాంటిక్ మెలోడీతో రానున్నట్లు సమాచారం.

New Update
Devara : 'దేవర' సెకండ్ సింగిల్ అప్డేట్.. ఈసారి అదిరిపోయే మెలోడీతో!

NTR Devara Second Single Update : మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'దేవర'. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ 'దేవర' రెండు పార్టులుగా విడుదల కానుంది. పార్ట్ 1 సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన 'దేవర' ఫియర్ సాంగ్ మిలియన్లకు పైగా వ్యూస్ తో సోషల్ మీడియాను షేక్ చేస్తుండగా.. సెకెండ్ సింగిల్ కు సంబంధించి అదిరిపోయే అప్డేట్ బయటికొచ్చింది.

జులై రెండో వారంలో...

దేవర సెకెండ్ సింగిల్ జులై రెండో వారంలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది. ఫియర్ సాంగ్ తో గాస్ బంప్స్ తెప్పించిన మూవీ టీమ్.. ఈసారి ఓ రొమాంటిక్ మెలోడీతో రానున్నట్లు సమాచారం. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ పై చిత్రీకరించిన ఈ సాంగ్ కు అనిరుద్ అద్భుతమైన మ్యూజిక్ కంపోజ్ చేసినట్టు చెబుతున్నారు. ఈ సాంగ్ ను విదేశాల్లో గోవాలో షూట్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. త్వరలోనే సెకెండ్ సింగిల్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానుంది.

Also Read : వచ్చే నెల నుంచే ‘సలార్ 2’ షూటింగ్.. ప్రభాస్ కోసం భారీ సెట్!

సముద్రం బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్ రోల్ చేస్తున్నారు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధా ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Oscar Awards 2026: ఈసారి ఏఐ మూవీలకు కూడా ఆస్కార్.. ఫుల్ డిటైల్స్ ఇవే

ఆస్కార్ అవార్డుల వేడుకల వివరాలను అకాడమీ తాజాగా వెల్లడించింది. 98వ ఆస్కార్ అవార్డుల వేడుక 2026 మార్చి 15వ తేదీన జరగనున్నట్లు తెలిపింది. టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుని ఈసారి ఏఐతో తీసిన సినిమాలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు వెల్లడించింది.

New Update
Oscars 2026

Oscars 2026

సినీ రంగంలో ఆస్కార్ అవార్డులను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. అయితే ఆస్కార్ అవార్డుల వేడుకల వివరాలను అకాడమీ తాజాగా వెల్లడించింది. 98వ ఆస్కార్ అవార్డుల వేడుక 2026 మార్చి 15వ తేదీన జరగనున్నట్లు వెల్లడించింది. 2026 జనవరి 22న అవార్డుల కోసం పోటీ పడనున్న చిత్రాల జాబితాను ప్రకటిస్తుంది. కొన్ని కేటగిరీల్లో ఓటింగ్‌ విధానంలో కూడా మార్పులు చేసినట్లు తెలిపింది.

ఇది కూడా చూడండి: Holiday Culture: హాలీడే కల్చర్‌ తో ఉత్పాదకత తగ్గిపోతుందన్న సీఈవో..మండిపడుతున్న నెటిజన్ల

ఇది కూడా చూడండి: Ind: వాణిజ్యం, టెక్నాలజీ..జేడీ వాన్స్ తో ప్రధాని మోదీ చర్చించిన అంశాలివే..

నామినేట్ అయిన సభ్యులు కచ్చితంగా..

ఆస్కార్‌కి నామినేట్ అయిన ప్రతీ మూవీని కూడా అకాడమీ సభ్యులు కచ్చితంగా చూడాలని తెలిపింది. దీంతో పాటు అచీవ్‌మెంట్‌ ఇన్‌ కాస్టింగ్‌ అనే కేటగిరీని కూడా కొత్తగా ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ఈ కేటగిరీకి రెండు దశల్లో ఓటింగ్‌ ప్రక్రియ ఉండనున్నట్లు వెల్లడించింది. ఫైనల్ ఓటింగ్ ముందు కాస్టింగ్‌ డైరెక్టర్లకు కొన్ని రౌండ్ల టెస్టింగ్ ఉంటుందని వెల్లడించింది.

ఇది కూడా చూడండి: Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు అంతగా బాగోలేదు..జాగ్రత్తగా ఉంటే బెటర్‌!

అలాగే టెక్నాలజీని దృష్టిలో ఉంచుకుని.. ఈసారి ఏఐతో తీసిన సినిమాలను కూడా పరిగణనలోకి తీసుకోనున్నట్లు వెల్లడించింది. అయితే ఎక్కువగా సాధారణ చిత్రాలకే ప్రాధాన్యత ఉంటుందని అకాడమీ తెలిపింది. 98వ ఆస్కార్ వేడుకలు లాస్‌ ఏంజెలెస్‌లోని డాల్బీ థియేటర్‌లో జరగనుంది. 2025 జనవరి నుంచి డిసెంబర్‌ వరకు విడుదలైన చిత్రాలు పోటీపడనున్నాయి. మ్యూజిక్‌ కేటగిరీలో ఈ ఏడాది అక్టోబర్‌ 15లోగా చేసుకోవాలి. 

ఇది కూడా చూడండి: శవం ముందు పెళ్లి డ్యాన్సులు.. డీజే పాటలకు చిందేసిన ఆడ, మగ - వీడియో చూశారా?

Advertisment
Advertisment
Advertisment