TG Jobs: తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. త్వరలోనే ఆ ఉద్యోగ నోటిఫికేషన్! తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖలో 755 ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 193 ల్యాబ్ టెక్నీషియన్, 31 స్టాఫ్ నర్సుల పోస్టులున్నట్లు పేర్కొంది. By srinivas 15 Jun 2024 in జాబ్స్ Latest News In Telugu New Update షేర్ చేయండి TG Jobs: తెలంగాణ నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే పలు శాఖల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్ చేయగా.. తాజాగా వైద్య ఆరోగ్య శాఖలోని పలు ఖాళీలను పూరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖలోని మొత్తం 755 ఖాళీలను భర్తీ చేయనుండగా.. 531 సివిల్ అసిస్టెంట్ సర్జన్, 193 ల్యాబ్ టెక్నీషియన్, 31 స్టాఫ్ నర్సుల పోస్టులకు త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపింది. అయితే రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు (MHSRB) ద్వారా పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. #telangana-medical-health-department #jobs-notification సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి