/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2023-12-08T202139.826-jpg.webp)
Governer Tamilisai Soundararajan : గోమూత్ర రాష్ట్రాలైన ఉత్తరాది రాష్ట్రాల్లోనే బీజేపీ గెలుస్తుందంటూ డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్(Senthil Kumar) పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ తెలంగాణ గవర్నర్ తమిళి సై తనదైన శైలిలో స్పందించారు. గోమూత్ర కాదు, గోముద్రకు ఆ రాష్ట్రాలు సంకేతాలని ఆమె వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత.. ప్రభుత్వ కీలక నిర్ణయం
అహ్మదాబాద్ లోని గుజరాత్(Gujarat) యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన కల్చరల్ ఎకానమీ కాన్‌క్లేవ్‌లో ఆమె పాల్గొన్నారు. ఉత్తర - దక్షిణాదులను వేరు చేస్తూ వ్యాఖ్యానించడం తగదని, తన రాష్ట్రం తమిళనాడుకు చెందిన ఎంపీ ఆ వ్యాఖ్యలు చేయడం మరింత బాధ కలిగించిందని ఆమె అన్నారు.
పూర్వం తమిళులు తాము దాచుకున్న పొదుపుతో కాశీ యాత్ర చేసేవాళ్లని, దేశ ప్రజల్లో ఆధ్మాత్మికంగా ఏకత ఉందని తమిళి సై అన్నారు. కాశీ, రామేశ్వరం యాత్రలు దేశ ప్రజల్లో సాంస్కృతిక వారధులుగా ఉన్నాయన్నారు. గతంలో ధ్వంసమైన ఆలయాలు, ఆరాధనా కేంద్రాలను ప్రభుత్వం పునర్నిర్మిస్తున్నదన్నారు. ఆలయాల పునర్నిర్మాణంతో స్థానిక ఆర్థిక వ్యవస్థ బలపడుతుందన్నారు.