TDP: ఆ జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాలపై రాని క్లారిటీ.. అయోమయంలో పార్టీ క్యాడర్..!

ఉమ్మడి కడప జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులపై క్లారిటీ రావడం లేదు. రాజంపేట లేదా కోడూరు జనసేన కంటూ ప్రచారం జరుగుతోంది. బద్వేల్, జమ్మలమడుగు నియోజకవర్గాలు బీజేపీకే అంటూ మరోవైపు వార్తలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు ఎటు తేల్చలేకపోవడంతో పార్టీ క్యాడర్ అయోమయంలో పడింది.

New Update
TDP: ఆ జిల్లాలో 4 అసెంబ్లీ స్థానాలపై రాని క్లారిటీ.. అయోమయంలో పార్టీ క్యాడర్..!

TDP Chandrababu: ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్నప్పటికి ఉమ్మడి కడప జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాల టీడీపీ అభ్యర్థులపై ఇప్పటికి క్లారిటీ రావడం లేదు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎటు తేల్చలేకపోవడంతో పార్టీ క్యాడర్ అయోమయంలో పడినట్లు తెలుస్తోంది. రాజంపేట లేదా కోడూరు జనసేన కంటూ ప్రచారం జరుగుతోంది. మరోవైపు బద్వేల్, జమ్మలమడుగు నియోజకవర్గాలు బీజేపీకే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

Also Read: వంగా గీతకు షాక్.. ప్రచారాన్ని అడ్డుకున్న ఎన్నికల అధికారులు..!

కుటుంబ సభ్యులంతా భూపేష్ వైపే నిలవడంతో మాజీ మంత్రి అదినారాయణ రెడ్డి జమ్మలమడుగు నియోజకవర్గం పోటీ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. కడప ఎంపీగా పోటీ చేయాలనే యోచినలో ఉన్నారని తెలుస్తోంది. ఎంపీ టికెట్ కోసం ఒత్తిడి చేస్తున్నారని స్థానిక రాజకీయ నేతలు అంటున్నారు. ఇదిలా ఉండగా మిగితా మూడు నియోజకవర్గాల అభ్యర్థులపై ఇప్పటికి నో క్లారిటీ. టికెట్ ఎవరికి కేటాయిస్తారోనని స్థానిక నేతల్లో ఉత్కంఠ నెలకొంది. అధినేత ఎప్పుడెప్పుడు అభ్యర్థులను ప్రకటిస్తారా అని తెగ ఎదురుచూస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు