టీ20 వరల్డ్ కప్‌లో భారత్,పాక్ సెమీ ఫైనల్‌ లో ఎదురైయ్యే అవకాశం లేదు..మాజీ ఇంగ్లాండ్ ఆటగాడు

టీ20 ప్రపంచకప్ సిరీస్ ప్రారంభం కానున్న తరుణంలో సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్-పాకిస్థాన్ జట్లు తలపడవని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ జోస్యం చెప్పాడు. అసలు పాకిస్తాన్ సెమీస్ దాకా వస్తేనే కదా అని గ్రేమ్ స్వాన్ అన్నారు.

New Update
టీ20 వరల్డ్ కప్‌లో భారత్,పాక్ సెమీ ఫైనల్‌ లో ఎదురైయ్యే అవకాశం లేదు..మాజీ ఇంగ్లాండ్ ఆటగాడు

ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఐసీసీ టీ20 ప్రపంచకప్ జూన్ 2న జరగనుంది. ఈ టోర్నమెంట్‌ను USA  వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ టోర్నిలో  20 జట్లలో పాల్గొనతుండగా..వాటిని 4 గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌-ఎలో భారత్‌, పాకిస్థాన్‌లు జూన్‌ 9న తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ తలపడే అవకాశం లేదని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ జోస్యం చెప్పాడు.

అంటే 2024లో జరిగే టీ20 ప్రపంచకప్‌ సిరీస్‌లో భారత్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌ సెమీఫైనల్‌లోకి ప్రవేశిస్తాయని చెప్పాడు. అమెరికా, వెస్టిండీస్‌లోని పిచ్‌లు కఠినంగా ఉన్నాయని, బౌండరీలు కొట్టడం కష్టమని చెప్పాడు.అందువల్ల ఈసారి ఇంగ్లండ్‌కు గట్టి సవాల్‌ ఎదురుకానుందని, గతసారి మాదిరిగానే ఈసారి కూడా ఇంగ్లండ్‌ ట్రోఫీని గెలవాలని గ్రేమ్ స్వాన్ అన్నాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు