విపక్ష కూటమి కన్వీనర్ పోస్టుపై..... నితీశ్ కుమార్ ఏమన్నారంటే....! బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని పదవిపై తనకు ఎలాంటి ఆసక్తిలేదని ఆయన వెల్లడించారు. తాను ఎలాంటి పదవులు కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని గతంలో పలు మార్లు వెల్లడించానన్నారు. తాను ఎలాంటి పదవులు కోరుకోవడం లేదన్నారు. తాను కేవలం బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఒక తాటిపైకి తీసుకు రావాలని ప్రయత్నిస్తున్నానని చెప్పారు. By G Ramu 28 Aug 2023 in నేషనల్ New Update షేర్ చేయండి బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని పదవిపై తనకు ఎలాంటి ఆసక్తిలేదని ఆయన వెల్లడించారు. తాను ఎలాంటి పదవులు కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని గతంలో పలు మార్లు వెల్లడించానన్నారు. తాను ఎలాంటి పదవులు కోరుకోవడం లేదన్నారు. తాను కేవలం బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పార్టీలను ఒక తాటిపైకి తీసుకు రావాలని ప్రయత్నిస్తున్నానని చెప్పారు. ఇండియా కూటమి కన్వీనర్ గా అవకాశం ఇస్తే ఆ పదవిని అంగీకరిస్తారా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానం ఇచ్చారు. 1947లో భారత్ స్వాతంత్ర్య దేశం కాలేదని, 1977లో జయ ప్రకాశ్ నారాయణ పోరాటం తర్వాత స్వాతంత్ర్య దేశం అయిందన్న బిహార్ బీజేపీ చీఫ్ సామ్రాట్ చౌదరి వ్యాఖ్యలపై స్పందరించేందుకు నితీశ్ కుమార్ నిరాకరించారు. నిన్న కూడా నితీశ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. విపక్ష ఇండియా కూటమి మూడవ సమావేశంలో మరిన్ని పార్టీలు తమతో చేరబోతున్నాయని పేర్కొన్నారు. అయితే ఆ పార్టీల పేర్లను మాత్రం ఆయన వెల్లడించలేదు. రాబోయే లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలనే విషయంపై ముంబై సమావేశంలో చర్చించనున్నట్టు పేర్కొన్నారు. విపక్ష కూటమి మూడవ సమావేశాన్ని ముంబైలో నిర్వహించనున్నారు. మహా వికాస్ అఘాడీ కూటమిలో శివసేన యూబీటీ, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు ఈ సమావేశానికి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ సమావేశం కోసం ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇది ఇలా వుంటే విపక్ష కూటమికి ఇటీవల ఇండియా అని పేరు పెట్టారు. కానీ ఆ కూటమిని ఎవరు నడిపించాలని, దానికి ఎవరు నాయకత్వం వహించాలనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. #india #nitish #convennor #pm-post మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి