NIMS Recruitment 2024: నిమ్స్ లో 32 వేల వేతనంతో జాబ్స్.. డిగ్రీ, డిప్లొమా చేసిన వారికి ఛాన్స్!

హైదరాబాద్‌ నిమ్స్‌ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 101 టెక్నీషియల్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఆగస్టు 24వ తేదీలోపు అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది.

New Update
Job Alert : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - రైల్వేలో 7951 పోస్టులకు నోటిఫికేసన్‌.. వెంటనే ఆప్లై చేసేయండి!

NIMS Recruitment 2024: హైదరాబాద్‌ నిమ్స్‌ నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదలైంది. ఇందులో భాగంగా మొత్తం 101 టెక్నీషియల్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఆన్ లైన్ నుంచి దరఖాస్తు ఫామ్ ను తీసుకుని చేసుకోని ఆఫ్ లైన్ లో సమర్పించాల్సి ఉంటుంది. ఆగస్టు 24వ తేదీలోపు అప్లికేషన్ ప్రాసెస్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. https://www.nims.edu.in/index వెబ్ సైట్ నుంచి దరఖాస్తు ను డౌన్ లోడ్‌ చేసుకుని పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.

మొత్తం ఖాళీలు 101, రేడియాలజీ, ఇమ్యూనాలజీ, నెఫ్రాలజీ, అనస్తీయా, స్టెమ్ సెల్ ల్యాబ్, మైక్రోబయోలజీ, బ్లడ్ బ్యాంక్, బయో మెడికల్ ఇంజినీరింగ్, డిపార్ట్ మెంట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసన్ తో పాటు పలు విభాగాల్లో పోస్టులకు ఖాళీలున్నాయి. సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా డిప్లోమా చేసి ఉండాలి. పని అనుభవం కూడా ఉండాలి. జీతం - నెలకు రూ.32,500. ఈ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగులను తీసుకుంటారు.

ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఇంటర్వ్యూ లేక రాత పరీక్ష ఉంటుంది. ఈ విషయంపై అధికారులు నిర్ణయం తీసుకుంటారు. ప్రతి డాక్యుమెంట్ జత చేయాలి. దరఖాస్తు లో అడిగిన వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. . అసంపూర్ణంగా ఉంటే రిజెక్ట్ చేస్తారు. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే.. ఆన్ లైన్ లో ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాలి. దానికి రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది. ఫారమ్‌ పూర్తి చేసిన తరువాత ఆన్‌ లైన్‌ లోనే సమర్పించాల్సి ఉంటుంది.

Also Read: ఎల్బీనగర్‌ మెట్రో స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ… టికెట్ల ఆలస్యం

Advertisment
Advertisment
తాజా కథనాలు