Nimmagadda Ramesh: ఇలా చేస్తే ఈసీ ఆదేశాలను ధిక్కరించినట్టే: నిమ్మగడ్డ రమేశ్ వాలంటీర్ల ద్వారా లబ్ధిపొందాలని చూస్తే ఈసీ ఆదేశాలను ధిక్కరించినట్లే అవుతుందని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పేర్కొన్నారు. ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని కోర్టు ఆదేశించినా.. దానికి భిన్నంగా వైసీపీ వ్యవహరిస్తోందని విమర్శలు గుప్పించారు. By Jyoshna Sappogula 28 Feb 2024 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి Nimmagadda Ramesh: తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ‘ఓటు వేద్దాం-ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్. ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో వాలంటీర్ల ద్వారా లబ్ధిపొందాలని చూస్తే ఈసీ ఆదేశాలను ధిక్కరించినట్లే అవుతుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. Also Read: చంద్రబాబు ఆసక్తికర ట్వీట్.. భువనేశ్వరి రియాక్షన్ చూడండి..! తిరుపతి ఉప ఎన్నికల్లో నకిలీ ఈఆర్‌వో పనిచేశారన్నారు. ఎన్నికల్లో ఇలా నకిలీ అధికారులు పనిచేయడం ఆందోళన కలిగిస్తుందని చెప్పుకొచ్చారు. ఓటర్ల వివరాలను వాలంటీర్లు అధికార పార్టీకి అందిస్తున్నారని కామెంట్స్ చేశారు. వైసీపీ కోసం వాలంటీర్లు కష్టపడాలన్న మంత్రుల వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. అధికారులు ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని కోరారు. నిర్లక్ష్యం చేస్తే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. ఎన్నికల విధులకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని కోర్టు ఆదేశించినా.. దానికి భిన్నంగా అధికార పార్టీ వ్యవహరిస్తోందని విమర్శించారు. Also Read: క్యాడ్బరీ డైరీమిల్క్ చాలా ప్రమాదం.. నిర్దారించిన తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబరేటరీ! కాగా, గ్రామ సచివాలయ సిబ్బంది, వాలంటీర్లకి ఎన్నికల విధుల కేటాయింపుపై సీఈసీ స్పష్టత ఇచ్చింది. ఓటర్ల చేతికి ఇంకు మార్క్ లాంటి చిన్న పనులకు మాత్రమే సచివాలయ సిబ్బంది వాడాలని పేర్కొంది. వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల విధుల్లో వాడకూడదని హెచ్చరించింది. వాలంటీర్లను పోలింగ్ ఏజెంట్ గ అనుమతించకూడదని తేల్చిచెప్పింది. #andhra-pradesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి