NIA Raids: ఎన్ఐఏ దాడుల్లో నివ్వెరపోయే విషయాలు.. భారీ పేలుళ్లకు ఉగ్ర కుట్ర.. 8 మంది అరెస్టు

దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లతో విధ్వంసం సృష్టించాలనుకున్న ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థ కుట్రలను ఎన్ఐఏ భగ్నం చేసింది. నిషేధిత స్థావరాలుగా ఉన్న దేశంలోని 19 ప్రదేశాల్లో సోమవారం ఒకే రోజు దాడులు జరిపి 8 మందిని అదుపులోకి తీసుకుంది.

New Update
NIA Raids: ఎన్ఐఏ దాడుల్లో నివ్వెరపోయే విషయాలు.. భారీ పేలుళ్లకు ఉగ్ర కుట్ర.. 8 మంది అరెస్టు

NIA Raids: జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోమవారం చేసిన మెరుపు దాడుల్లో సంచలన విషయాలు బయటపడ్డాయి. దేశవ్యాప్తంగా భారీ పేలుళ్లతో విధ్వంసం సృష్టించాలనుకున్న ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాద సంస్థ కుట్రలను ఎన్ఐఏ భగ్నం చేసింది. నిషేధిత ఐఎస్ఐఎస్ స్థావరాలుగా ఉన్న ప్రదేశాల్లో ఒకేరోజు దాడి చేసిన ఎన్ఐఏ మొత్తం 8 మంది ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుంది. మహారాష్ట్ర, కర్ణాటక, జార్ఖండ్, ఢిల్లీ రాష్ట్రాల్లోని 19 ప్రదేశాల్లో ఎన్ఐఏ సోదాలు జరిగాయి.

ఉగ్రవాద కార్యకలాపాలపై ఇంటెలిజెన్స్ నుంచి పక్కా సమాచారం అందడంతో దాడులకు దిగిన ఎన్ఐఏ భారీ ఉగ్రకుట్రలను భగ్నం చేసింది. కర్ణాటకలోని బళ్లారి, బెంగళూరు; మహారాష్ట్రలోని అమరావతి, ముంబై, పుణె; జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌, బొకారో; రాజధాని ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. 8 మందిని అదుపులోకి తీసుకుని, మిగతా నిందితుల కోసం ఇతర కేంద్ర సంస్థలతో కలిసి దేశవ్యాప్తంగా గాలింపును ముమ్మరం చేసింది.

ఇది కూడా చదవండి: పార్లమెంట్ లో నిరసనలు.. 92 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు

అరెస్టైన 8మందిలో ఒకడైన మినాజ్‌ అలియాస్‌ మహ్మద్‌ సులేమాన్‌ అనే టెర్రరిస్టు నాయకత్వంలో దేశంలో భారీగా పేలుళ్లకు కుట్ర పన్నాడని ఎన్‌ఐఏ అధికారులు తెలిపారు. దాడుల్లో పట్టుబడిన నిందితుల పేర్లను ఎన్‌ఐఏ వెల్లడించింది. మినాజ్‌ అలియాస్‌ మహ్మద్‌ సులేమాన్ తో పాటు సయ్యద్‌ సమీర్‌ బళ్లారిలో పట్టుబడ్డారు. అనాస్‌ ఇక్బాల్‌ షేక్‌ ను ముంబైలో పట్టుకున్నారు. మహ్మద్‌ మునీరుద్దీన్‌, సయీద్‌ సమీయుల్లా అలియాస్‌ సమీ, మహ్మద్‌ ముజామిల్‌ అనే వ్యక్తులను బెంగళూరులో ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలో షయాన్‌ రెహ్మాన్‌ అలియాస్‌ హుస్సేన్‌ ఎన్ఐఏకు చిక్కాడు. మహ్మద్‌ షాబాజ్‌ అలియాస్‌ జుల్ఫికర్‌ అలియాస్‌ గుడ్డూ అనే మరో వ్యక్తి జంషెడ్‌పూర్‌లో అరెస్టయ్యాడు.

వారి నుంచి భారీగా పేలుడు పదార్థాలు, మారణాయుధాలను ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సల్ఫర్, పొటాషియం నైట్రేట్, గన్‌పౌడర్ వంటి పదార్థాలతో పాటు కొంత నగదు వారి వద్ద దొరికాయి. కాలేజీ విద్యార్థులను ఉగ్ర కార్యకలాపాల దిశగా ఆకర్షించేందుకు వారు ప్రయత్నిస్తున్నట్టు అనుమానిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు