గ్రూప్-4 మహిళా అభ్యర్థులకు సూచనలిచ్చిన TSPSC

టీఎస్‌పీఎస్సీ నిర్వహిస్తున్న గ్రూప్-4 ఎగ్జామ్ రేపు జరుగనుంది. ఈ ప‌రీక్ష కోసం టీఎస్‌పీఎస్సీ పటిష్టంగా ఏర్పాట్లు చేస్తోంది. 8,180 గ్రూప్‌-4 పోస్టులకు గాను 9.51 లక్షల మంది నిరుద్యోగాలు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో చోటు చేసుకున్న ఇబ్బందులను, లోపాలను పరిగణలోకి తీసుకున్న కమిషన్ పకడ్భందీగా పరీక్షల నిర్వహణకు చర్యలు చేపట్టింది. అయితే పరీక్షలకు హాజరయ్యే మహిళ అభ్యర్థులకు కొన్ని రూల్స్ ఉంటాయని వెల్లడించింది.

New Update
TSPSC Group-1 Updates: గ్రూప్-1పై టీఎస్పీఎస్సీ ముందున్న రెండు ఆప్షన్లు ఇవే.. నోటిఫికేషన్ నుంచి నేటి వరకు అసలేం జరిగిందంటే?

news-women-candidates-tspsc-chairman-clarity-on-talibottu-and-mettel

మహిళా అభ్యర్థులు పరీక్ష రాయాలంటే తాళిబొట్టు, మెట్టెలు తీసేయాలని నెట్టింట పెద్ద ఎత్తున ప్రచారం సాగుతుంది. ఈ ప్రచారంపై మహిళా అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల పేరుతో సంప్రదాయాలను కించపరుస్తున్నారని ఫైర్ అవుతున్నారు. దీనిపై టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి వివరణ ఇచ్చారు. పరీక్షకు హాజరయ్యే మహిళలు తాళిబొట్టు, మెట్టెలు తీసేయాలని రూల్స్ లేదని ఆయన చెప్పారు. హిందూ సంప్రదాయాలను కించపరుస్తున్నారంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. యువతీ యువకుల కోసం ప్రత్యేకంగా చెక్‌ పాయింట్లు ఉంటాయన్నారు. అందుకు సరిపడా మహిళా సిబ్బందిని నియమించామని కమిషన్ చైర్మన్ జనార్థన్ రెడ్డి చెప్పారు.

పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే ఎగ్జామ్ సెంటర్ల గేట్లు మూసివేస్తామని టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్థన్ రెడ్డి చెప్పారు. ఉదయం పేపర్-1 పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగనుండగా.. 9.45 గంటలు దాటిన తర్వాత అభ్యర్థులను లోనికి అనుమతించరని తెలిపారు. మధ్యాహ్యం పరీక్ష 2:30 గంటల నుంచి 5:00 గంటల వరకు నిర్వహించనుండగా.. 2.15 తరువాత ఎగ్జామ్ హాల్‌ లోపలికి పర్మిషన్ లేదన్నారు. పేపర్-1కు ఉదయం 8 గంటల నుంచి, పేపర్-2కు మధ్యాహ్నం ఒంట గంట నుంచి పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తామన్నారు. ఎగ్జామ్ సెంటర్లలోకి ప్రవేశించే ముందు సెక్యూరిటీ సిబ్బందికి, పరీక్ష గదిలోకి చేరుకున్నాక ఇన్విజిలేటర్‌ కు అభ్యర్థులు తమ ఫొటో గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుందన్నారు.

అభ్యర్థులు చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా సకాలంలో ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్థన్ రెడ్డి కోరారు. OMR షీట్‌లో బ్లూ లేదా బ్లాక్ పెన్‌తో అభ్యర్థులు పేరు, కేంద్రం కోడ్, హాల్ టికెట్, ప్రశ్నపత్రం నంబరు రాయాల్సి ఉంటుందని టీఎస్‌పీఎస్సీ అధికారులు చెప్పారు. హాల్ టికెట్, ప్రశ్నాపత్రం నంబరు సరిగ్గా రాయకున్నా, బ్లూ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ కాకుండా ఇంక్ పెన్, జెల్ పెన్, పెన్సిల్ ఉపయోగించినా ఓఎంఆర్ షీట్ చెల్లదని టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది. ఈ విషయాలను గుర్తు ఉంచుకొని పరీక్షా కేంద్రానికి అభ్యర్థులు రావాలని సూచించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు