రూపాయి బిర్యానీ కోసం వెళ్తే.. వంద రూపాయల ఫైన్! కొంతమంది జనాలు ఏదైనా ఫ్రీగా... వచ్చిందంటే చాలు... ఎనుక ముందు ఏం మాత్రం ఆలోచించకుండా వెళ్తుంటారు. దాని వెనుకాల ఏం పరిణామాలు ఉండబోతాయన్న విషయాన్ని మరిచిపోయి తొందరపడుతుంటారు. అచ్చం అలాంటిదే ఇక్కడ జరిగింది. రూపాయి బిర్యాని కోసం పోతే.. పోలీసులు చలాన్లు వేసి ఇంటికి పంపించారు. ఇంతకీ ఇదెక్కడ జరిగిందంటే.... By Shareef Pasha 17 Jun 2023 in తెలంగాణ కరీంనగర్ New Update షేర్ చేయండి ఓపెనింగ్ రోజే క్రేజీ ఆఫర్ కరీంనగర్ జిల్లాలోని ఓ హోటల్ ఓపెనింగ్ రోజు క్రేజీ ఆఫర్ ను ప్రకటించింది. కేవలం ఒక్క రూపాయికే బిర్యానీ అంటూ ప్రచారం చేసింది. అయితే ఇందులో ఓ ట్విస్ట్ కూడా ఉందండొయ్. అదే ఒక రూపాయి అంటే రూపాయి కాయిన్ కాదు.. రూపాయి నోటు.. రూపాయి నోటు ఉంటే.. బిర్యానీ ఇచ్చేస్తున్నారు. ఈ ఆఫర్ గురించి తెలిసిన జనం ఒక్కసారిగా ఎగబడ్డారు. దీంతో ఒక్క రూపాయి నోటు ఇచ్చిన వారికి బిర్యానీ అంటూ నగరంలో ప్రచారం చేశారు. జనం నానా తిప్పలు అయితే.. నానా తిప్పలు పడి మరి.. ఆ నోట్లను సేకరించి హోటల్ కు ప్రజలు క్యూ కట్టారు.. ఆఫర్ మద్యాహ్నం 2.30 గంటల తరువాత అని హోటల్ యాజమాన్యం ప్రకటించినప్పటికీ జనం మాత్రం అంతకు ముందు నుంచే హోటల్ దగ్గర బిర్యానీ కోసం బారులు తీరారు. క్యూ కట్టిన జనం చాలా సేపు క్యూలో నిల్చోచి సహనం కోల్పోయిన హోటల్‌లోకి చొరబడ్డారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రూపాయి బిర్యానీ, వంద రూపాయల ఫైన్ ఆ హోటల్ ఏరియాలో వందలాది వెహికిల్స్ పార్కింగ్ చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీన్ని గమనించిన స్ధానిక పోలీసులు రంగంలోకి దిగి అక్కడికి వచ్చిన జనాన్ని చెదరగొట్టి.. హోటల్ ను తాత్కాలికంగా క్లోజ్ చేయించారు. హోటల్ ప్రారంభోత్సవం రోజే అందరికి తెలియాలన్న కోరిక నెరవేరినప్పటికి.. ఓపెనింగ్ చేసిన కాసేపటికే మూసివేయాల్సిన పరిస్థితి వచ్చిందని హోటల్ యజమాని అన్నారు. బిర్యానీ కోసం వచ్చిన ప్రజలు నిరుత్సాహంతో తిరిగి వెళ్లిపోయారు. అయితే అక్కడ నో పార్కింగ్ లో పార్కింగ్ చేసిన వెహికిల్స్ కు పోలీసులు రూ.100 జరిమానా విధించారు. రూపాయి బిర్యానీ కోసం వెళ్తే వంద రూపాయల ఫైన్ కట్టాల్సి రావడంతో జనాలు హోటల్ యాజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే కాబోలు అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటంటే... అత్యాశకు పోతే అక్కడికి వచ్చిన కస్టమర్లకు నిరాశే ఎదురైంది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి