World Cup 2023: శ్రీలంకపై కివీస్ భారీ విజయం..రన్ రేట్లోనూ..!!

ప్రపంచ కప్ 2023 లీగ్ మ్యాచ్‌లో, న్యూజిలాండ్ ఏకపక్ష మ్యాచ్‌లో శ్రీలంకను ఓడించి భారీ విజయాన్ని సాధించింది. దాని నెట్ రన్ రేట్‌ను కూడా మెరుగుపరుచుకుంది. ఐదు వికెట్ల తేడాతో కివీస్ లంకను ఓడించింది.

New Update
World Cup 2023: శ్రీలంకపై కివీస్ భారీ విజయం..రన్ రేట్లోనూ..!!

ODI ప్రపంచ కప్ 2023 కింద న్యూజిలాండ్, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. న్యూజిలాండ్ విజయంలో ట్రెంట్ బౌల్ట్ కీలక పాత్ర పోషించాడు. 10 ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి 3 ముఖ్యమైన వికెట్లు తీశాడు. దీంతో అతను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు మొత్తం 171 పరుగులకే ఆలౌటైంది. జట్టు 50 ఓవర్ల పూర్తి కోటాను కూడా ఆడలేకపోయింది. శ్రీలంకకు చెందిన ఒక బ్యాట్స్‌మెన్ మాత్రమే అర్ధ సెంచరీ చేయగలిగాడు, మిగిలిన బ్యాట్స్‌మెన్ వస్తూ పోతూనే ఉన్నారు. కుశాల్ పెరీరా 28 బంతుల్లో 51 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీలంక నిర్దేశించిన లక్ష్యాన్ని న్యూజిలాండ్ కేవలం 23.2 ఓవర్లలోనే ఛేదించింది. ఈ విజయంతో న్యూజిలాండ్ సెమీఫైనల్‌కు చేరుకోవడం దాదాపు ఖాయం చేసుకుంది. అక్కడ భారత్‌తో మ్యాచ్‌ ఆడాల్సి ఉంటుంది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక 46.4 ఓవర్లలో 171 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక బ్యాటర్లలో కుశాల్ పెరీరా(28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51) అర్థ సెంచరీతో రాణించగా.. చివర్లో మహీశ్ తీక్షణ(38 నాటౌట్), దిల్షన్ మధుషంక(19 నాటౌట్) పరుగులు చేశారు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్(3/37), లాకీ ఫెర్గూసన్(2/35), మిచెల్ సాంట్నర్(2/22), రచిన్ రవీంద్ర(2/21) పరుగులు పెట్టించారు.

publive-image

అనంతరం లక్ష్యచేధనకు దిగిన కివీస్ జట్టు 23.2 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు చేసి సునాయస విజయాన్ని సాధించింది. ఓపెనర్లు డెవాన్ కాన్వే(42 బంతుల్లో 9 ఫోర్లతో 45), రచిన్ రవీంద్ర(34 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42), డారిల్ మిచెల్(31 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43) రాణించారు. గ్లేన్ ఫిలిప్స్(10 బంతుల్లో 3 ఫోర్లతో 17 నాటౌట్) సూపర్బ్ గా ఆడాడు. శ్రీలంక బౌలర్లలో ఏంజెలో మాథ్యూస్(2/29) రెండు వికెట్లు తీశారు.. మహీష తీక్షణ, చమీరా తలో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.

publive-image

న్యూజిలాండ్ ప్లేయింగ్ ఎలెవెన్: డెవాన్ కాన్వే, రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, మార్క్ చాప్మన్, గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, టామ్ లాథమ్ (w), టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్, లాకీ ఫెర్గూసన్.

శ్రీలంక ప్లేయింగ్ ఎలెవన్: పాతుమ్ నిస్సాంక, కుసల్ పెరీరా, కుసల్ మెండిస్ (వికెట్ కీపర్/కెప్టెన్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, ధనంజయ్ డి సిల్వా, చమిక కరుణరత్నే, మహిష్ తీక్షణ, దుష్మంత చమీర, దిల్షన్ మదుషాన్.

ఇది కూడా చదవండి: కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది..ఆ పదవి నన్నే వరిస్తుంది…కొండా సురేఖ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

SRH VS MI: మళ్ళీ హైదరాబాద్ ఓటమి..వరుసగా ముంబైకు నాలుగో విజయం

సొంత గ్రౌండ్ లో హైదరాబాద్ సన్ రైజర్స్ మళ్ళీ ఓడిపోయింది. ఉప్పల్ జరిగిన మ్యాచ్ లో హైదరాబాద్ పై ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో అలవోగ్గా విజయం సాధించింది.  144 పరుగుల లక్ష్యాన్ని 15.4 ఓవర్లలో పూర్తి చేసింది. 

New Update
ipl

SRH VS MI

ముంబై బ్యాటర్లు మరోసారి చెలరేగిపోయారు. ఈరోజు హైదరాబాద్ ఉప్పల్ లో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ ను మట్టికరిపించారు. హైదరాబాద్ ఇచ్చిన 144 పరుగుల టార్గెట్ ను 7 వికెట్ల తేడాతో కొట్టి విజయం సాధించారు.  హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఫుల్ ఫామ్ లోని వచ్చేశాడు. ఈ రోజు హైదరాబాద్ సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో 46 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో చెలరేగిపోయాడు. 70 పరుగులు చేసి వరుసగా రెండో అర్దసెంచరీ సాధించాడు. అంతేకాదు ఐపీఎల్ లో అత్యతం వేగంగా 20 వేల పరుగులను పూర్తి చేసుకున్న బ్యాటర్ గా కూడా రికార్డ్ తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే సూర్య కుమార్ యావ్ కూడా  19 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 40 పరుగులు చేసి దూకుడుగా ఆడాడు. రికెల్‌టన్ (11), విల్ జాక్స్ (22) పరుగులు చేశారు. సన్‌రైజర్స్‌ బౌలర్లలో జయదేవ్‌ ఉనద్కత్‌, జీషాన్ అన్సారీ, ఎషాన్ మలింగ తలో వికెట్‌ తీశారు. దీంతో ముంబై ఇంకా 26 బాల్స్ మిగిలుండానే హైదారబాద్ ను చిత్తు చేసింది.  దీంతో ముంబై వరుసగా నాలుగో గెలుపును తన ఖాతాలో వేసుకుంది. అంతేకాదు ఓవరాల్ గా ఐపీఎల్ లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్ లను గెలచి నెట్ రన్ రేట్ ను మెరుగుపరుచుకుని పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. 

చేతులెత్తేసిన హైదరాబాద్..

ముంబై ఇండియన్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు చేతులెత్తేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన SRH జట్టు ప్రారంభం నుంచే తడబడింది. ఓపెనర్లుగా క్రీజ్‌లోకి వచ్చిన ట్రావిస్‌ హెడ్‌, అభిషేక్‌ శర్మ దూకుడుగా ఆడే క్రమంలో పెవిలియన్‌కు చేరారు. తొలి ఓవర్‌కు 2 పరుగులు చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్ 2 ఓవర్లకు 1 వికెట్ కోల్పోయింది. ట్రెంట్‌ బౌల్ట్‌ బౌలింగ్‌లో ట్రావిస్ హెడ్‌ డకౌట్‌ అయ్యాడు. వెను వెంటనే 2 ఓవర్1వ బంతికి సన్‌రైజర్స్ జట్టు రెండో వికెట్ కోల్పోయింది. ఇషాన్‌ కిషన్‌ (1) ఔట్‌అయ్యాడు. దీపక్‌ చాహర్‌ బౌలింగ్‌లో వికెట్‌ కీపర్‌ రికెల్‌టన్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత ఓవర్‌లోనే మరో వికెట్ డౌన్ అయింది. 3 ఓవర్ 3వ బంతికి  అభిషేక్‌ శర్మ (8) ఔటయ్యాడు. ట్రెంట్‌ బౌల్ట్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఇలా 4 ఓవర్లకు 13/3 స్కోర్‌ చేసింది. ఆ తరువాత కూడా వరుసగా వికెట్లను కోల్పోతూ కనీసం వంద అయినా స్కోర్ చేస్తారా అన్న పరిస్థితుల్లోకి వెళ్ళింది. కానీ క్లాసెన్ క్లాసిక్ బ్యాటింగ్‌తో అదరగొట్టేశాడు. 30 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. నిలకడగా ఆడిన క్లాసెన్‌ (71) ఔట్‌ అయ్యాడు. దీంతో హైదరాబాద్ జట్టు ఆరో వికెట్‌ కోల్పోయింది. వెను వెంటనే ఏడో వికెట్‌ డౌన్‌ అయింది. అభినవ్‌ (43), కమిన్స్ (1) ఔట్‌ అయ్యారు. దీంతో 20 ఓవర్లకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. 

today-latest-news-in-telugu | IPL 2025 | srh-vs-mi | match

Also Read: Indus River Agreement: 64 ఏళ్ళ ఒప్పందానికి స్వస్తి..ఎడారిగా మారనున్న పాకిస్తాన్

Advertisment
Advertisment
Advertisment