New Year 2024: న్యూ ఇయర్‌ రోజున మీ లవర్‌కి ఈ వస్తువులను గిఫ్ట్‌గా ఇవ్వొద్దు.. బ్రేకప్ అవ్వొచ్చు!

న్యూ ఇయర్‌ రోజున లవర్‌కి గిఫ్ట్‌ ఇచ్చే విషయంలో కొన్ని వస్తువులను ఇవ్వకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. మనీ ప్లాంట్ బహుమతిగా ఇవ్వకూడదు. దేవుని విగ్రహాలను కానుకగా ఇవ్వడం మానుకోవాలి. వాచ్ లేదా హ్యాండ్‌కర్చీఫ్ బహుమతిగా ఇవ్వాలనుకుంటే ఆ నిర్ణయాన్ని మార్చుకోండి.

New Update
New Year 2024: న్యూ ఇయర్‌ రోజున మీ లవర్‌కి ఈ వస్తువులను గిఫ్ట్‌గా ఇవ్వొద్దు.. బ్రేకప్ అవ్వొచ్చు!

న్యూ ఇయర్‌(New Year) వచ్చేస్తోంది.. మరి కొన్ని గంటల్లో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. 2023కి గుడ్‌బై చెప్పి 2024లోకి ఎంట్రీ ఇస్తున్నాం. న్యూ ఇయర్‌కి సంబంధించి ప్లాన్స్‌ ఎవరికి వారు వేసేసుకున్నారు. ఫ్రెండ్స్‌, ఫ్యామిలీ ఎవరికి వారు వాళ్ల ప్రిపరేషన్స్‌ పూర్తి చేసుకుంటున్నారు. అయితే వీళ్లందరి ప్లాన్స్‌ వేరు.. లవర్స్‌ ప్లాన్స్‌ వేరు. ప్రేమ అన్నిటికంటే స్వీట్‌ రిలేషన్‌షిప్‌. అందుకే న్యూఇయర్‌కి లవర్స్‌ ఒకరికొకరు గిఫ్ట్స్‌(Gifts) ఇచ్చుకుంటారు. అయితే ఇవ్వకూడని గిఫ్ట్స్‌ ఉంటాయి. అవి ఇస్తే రిలేషన్‌షిప్‌ పాడవుతుందన్న ప్రచారం ఉంది. అవేంటో తెలుసుకోండి.

బూట్లు- చెప్పులు:
ఎవరికీ బూట్లు లేదా చెప్పులు బహుమతిగా ఇవ్వకూడదు. ఎందుకంటే బూట్లు , చెప్పులు పేదరికానికి చిహ్నంగా పరిగణించబడతాయట. వీటిని బహుమతులుగా ఇవ్వడం వల్ల పేదరికం ఎప్పటికీ పోదట.

వాచ్‌, హ్యాండ్‌కర్చీఫ్
మీరు న్యూ ఇయర్ సందర్భంగా వాచ్ లేదా హ్యాండ్‌కర్చీఫ్ బహుమతిగా ఇవ్వాలనుకుంటే ఆ నిర్ణయాన్ని మార్చుకోండి. హ్యాండ్‌కర్చీఫ్ ఇవ్వడం వల్ల ప్రతికూలత పెరుగుతుందని.. సంబంధాలలో అపార్థాలు ఏర్పడతాయని ఒక నమ్మకం ఉంది. అదే సమయంలో.. ఒకరికి వాచ్ ఇవ్వడం ద్వారా మంచి సమయం కూడా చెడిపోతుందని కొందరు నమ్ముతుంటారు.

ఎవరికైనా వస్తువున బహుమతిగా ఇస్తున్నప్పుడు అందులో పదునైన వస్తువు ఉండకూడదని గుర్తుంచుకోండి. జ్యోతిష్కుల ప్రకారం, పదునైన వస్తువులను బహుమతిగా ఇవ్వడం సంబంధాలలో ద్రోహానికి దారి తీస్తుంది. మీరు కూడా అలాంటి వాటిని బహుమతిగా పొందినట్లయితే, వాటిని ఎవరికైనా దానం చేయండి. పొరపాటున కూడా మీ దగ్గర ఉంచుకోకండి.

పర్సు లేదా బ్యాగ్:
పర్సు లేదా బ్యాగ్ ఎవరికీ బహుమతిగా ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల మన ఆర్థిక పరిస్థితి మరింత దిగజారవచ్చు.

దేవతలు- దేవతల విగ్రహాలు
దేవుని విగ్రహాలను ఎవరికైనా కానుకగా ఇవ్వడం మానుకోవాలి. ఇలా చేస్తే దేవుడు మీపై కోపగించుకోవచ్చు.

మనీ ప్లాంట్ ఎవ్వరికీ బహుమతిగా ఇవ్వకూడదు లేదా ఎవరి నుంచి తీసుకోకూడదు. ఇలా చేస్తే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

గమనిక: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. RTV దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.

Also Read: ఈ ఆహారపు అలవాట్లతో మలబద్ధకం సమస్యకు పరిష్కారం.. అవేంటో చూడండి..!!

WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు