TRT 2023: తెలంగాణ టీఆర్టీ అభ్యర్థులకు కొత్త టెన్షన్.. ఆ సమస్య పరిష్కారం ఎలా?

New Update
TS TRT 2023 Exam: టీఆర్టీ కూడా వాయిదా ? లేటెస్ట్ అప్డేట్ ఇదే!

తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి జిల్లాల వారీగా పోస్టుల సంఖ్యను రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. టీఆర్టీకి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పరీక్షకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్టీ విషయంలో స్థానికత అంశంపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. విద్యాశాఖ దీనిపై స్పష్టత ఇవ్వాలంటూ కోరుతున్నారు. ధ్రువీకరణ కష్టంగా మారుతుందంటున్నారు అభ్యర్ధులు. స్థానికతకు సంబంధించిన నిబంధన మార్పుతో చాలా సమస్యలు ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన పాఠశాలలు ఇప్పుడు మూతపడటంతో అవస్థలు పడుతున్నారు.

కొన్నింటికి పర్మిషన్ లేకపోవడంతో డీఈవో కార్యాలయాల్లోనూ డేటా లభించడంలేదు. పలు జిల్లాల్లో ఎస్ఏ పోస్టులు కూడా లేవు. నాన్ లోక్ పోస్టులకూ అవకాశమే లేదు. ఈ అంశంపై విద్యాశాఖ వివరణ ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కొత్త జిల్లాల ఏర్పాటు అనంతరం ప్రభుత్వం 317జీవోను అమలు చేసింది. దీని ప్రకారం స్థానికతలను నిర్దారించిన ప్రభుత్వం ఇప్పటివరకు ఉద్యోగులకే పరిమితమైందని అభ్యుర్థులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: సీపీ ఆనంద్‌ను కలిసిన ప్రీ వెడ్డింగ్ షూట్ పోలీస్ దంపతులు

ఇప్పుడు తాజాగా టీచర్ల నియామకంలోనూ దీన్నే అమలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం 1 నుంచి 7వ తరగతి వరకు ఎక్కడ 4ఏళ్లు చదివినా ఆ జిల్లాలను స్థానికత కింద పరిగణిస్తారు. గతంలో 4 నుంచి 10 తరగతుల్లో ఎక్కడా నాలుగేళ్లు చదవినా దాన్ని స్థానికతగా చూసేవాళ్లు. ఈ నిబంధనల్లో మార్పుల వల్ల స్థానికత నిర్ధారణలో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయంటూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

అభ్యర్థుల ప్రాథమిక విద్యాకు సంబంధించిన సరైన రికార్డు 6వ తరగతి నుంచే ఉంటంది. అయితే ఇప్పుడు టీఆర్టీ రాసే అభ్యర్థులు దాదాపు 15ఏళ్ల క్రితం 1 నుంచి 5వ తరగతి వరకు చదివి ఉంటారు. ఇందులో చాలా స్కూళ్లకు పరిమిషన్ లేదని అభ్యర్థులు అంటున్నారు. దీంతో ఏ జిల్లాలో చదవుకున్నామో నిరూపించడం కష్టంగా ఉందంటున్నారు. ఇప్పటికే చాలా స్కూళ్లు మూతపడటం, కొన్నింటికి అనుమతి లేకుపోడంతో డీఈవో కార్యాలయంలోనూ వారికి సంబంధించిన డేటా లభించకపోవడంతో కష్టంగా మారింది.

ఇది కూడా చదవండి: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ లో ప్రభాస్, నయనతార

ఇక రాష్ట్రవ్యాప్తగా 5,089 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ వేసిన సంగతి తెలిసిందే. రోస్టర్ విధానం తర్వాత అనేక జిల్లాల్లో ఎస్ఏ పోస్టులు ఒకటి లేవు. 16 జిల్లాల్లో ఎస్ఏ గణితం, 7 జిల్లాలకు చెందిన అభ్యర్థులు వేరే జిల్లాలో ఉండే పోస్టులకు నాన్ లోకల్ కేటగిరి కింద పరీక్ష రాయాల్సి ఉంటుంది. నియామకాల్లో స్థానికేతరుల కోటాలను కేవలం 5శాతానికే పరిమితం చేయడంతో ఇతర జిల్లాల్ల 20 పోస్టులు ఉంటేనే నాన్ లోకల్ కు ఒక పోస్టు అయినా ఉంటుంది. కానీ ఏ జిల్లాలోనూ ఏ సబ్జెక్టు కు సంబంధించి కూడా ఇన్ని పోస్టులు ఇవ్వలేదు. అలాంటిప్పుడు నాన్ లోకల్ కింద పరీక్ష రాసి ఏంటి ప్రయోజనం అంటూ ప్రశ్నిస్తున్నారు. స్థానికత నిబంధనలపై ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలని కోరుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు