Mirai Movie : తేజ సజ్జా బర్త్ డే స్పెషల్.. 'మిరాయ్' న్యూ పోస్టర్ అదిరింది

తేజ సజ్జా హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిరాయ్‌’. నేడు తేజ బర్త్ డే కావడంతో నిర్మాణ సంస్థ ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది.' రైడ్‌ కోసం సూపర్‌ యోధ పుట్టాడు. మా సూపర్‌ హీరోకు శుభాకాంక్షలు' అంటూ పేర్కొంది. తాజాగా రిలీజైన పోస్టర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది.

New Update
Mirai Movie : తేజ సజ్జా బర్త్ డే స్పెషల్.. 'మిరాయ్' న్యూ పోస్టర్ అదిరింది

Teja Sajja Mirai Movie : 'హనుమాన్' మూవీతో యంగ్ హీరో తేజ సజ్జా క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమా రూ.25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.300 కోట్లకుపైగా రాబట్టింది. అంతకు ముందు వచ్చిన ఓ బేబీ, జాంబీ రెడ్డిలతో మంచి పేరు తెచ్చుకున్న తేజ.. హనుమాన్ తో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.

దీంతో తనకు వచ్చిన క్రేజ్‌ను కాపాడుకోవాలని జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈసారి సూపర్ యోధగా అలరించనున్నాడు. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మిరాయ్‌’. నేడు తేజ పుట్టినరోజు సందర్భంగా నిర్మాణ సంస్థ ఓ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది.

Also Read : నెట్ ఫ్లిక్స్ లో ‘మహారాజ’ రేర్ ఫీట్.. విజయ్ సేతుపతి దెబ్బకు యానిమల్, డుంకీ రికార్డ్స్ బ్రేక్

' రైడ్‌ కోసం సూపర్‌ యోధ పుట్టాడు. మా సూపర్‌ హీరోకు శుభాకాంక్షలు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 18న త్రీడీలో ఈ యాక్షన్‌- అడ్వెంచర్‌ను వీక్షించేందుకు సిద్ధంగా ఉండండి ' అంటూ తేజకు బర్త్ డే విషెస్‌ చెప్పింది. అలాగే తెలుగుతోపాటు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ, మరాఠీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా రిలీజైన పోస్టర్ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు