Nepal : వాట్ ఏ మ్యాచ్.. ఒక్క పరుగు తేడాతో దక్షిణాఫ్రికాపై ఓడిన నేపాల్ టీ20 వరల్డ్ కప్ లో మరో రోమాంచిత మ్యాచ్ అభిమానులను అలరించింది. బలమైన దక్షిణాఫ్రికా జట్టుపై బలహీనమైన నేపాల్ జట్టు గెలిచినంత పనిచేసింది. కానీ, ఒక్క పరుగు తేడాతో ఓటమి పాలైంది. 116 పరుగుల విజయలక్షాన్ని ఛేదించే క్రమంలో చివరి రన్ చేయలేక పోయింది నేపాల్ By KVD Varma 15 Jun 2024 in Latest News In Telugu ట్రెండింగ్ New Update షేర్ చేయండి South Africa : టీ20 ప్రపంచకప్ (T20 World Cup) 31వ మ్యాచ్‌లో నేపాల్ జట్టు దక్షిణాఫ్రికాపై ఒకే ఒక్క పరుగు తేడాతో ఓడింది. కానీ, బలమైన దక్షిణాఫ్రికా జట్టుపై నేపాల్ టీమ్ వీరోచిత పోరాటం మాత్రం క్రికెట్ అభిమానుల మనసులు గెలుచుకుంది. కింగ్‌స్‌టౌన్‌లోని ఆర్నోస్ వేల్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌లో నేపాల్ జట్టు (Nepal Team) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తదనుగుణంగా తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టుకు ఓపెనర్ రీజా హెండ్రిక్స్ శుభారంభం అందించాడు. అయితే మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగిన ట్రిస్టన్ స్టబ్స్ 18 బంతుల్లో 1 సిక్స్, 2 ఫోర్లతో 27 పరుగులు చేశాడు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. నేపాల్ తరఫున కుశాల్ భుర్టెల్ 4 ఓవర్లలో 19 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా, దీపేంద్ర సింగ్ 4 ఓవర్లలో 21 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి మెరిశాడు. నేపాల్ పోరాటం.. 116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ జట్టు శుభారంభం చేసింది. దక్షిణాఫ్రికా అనుభవజ్ఞులైన పేసర్లపై ఓపెనర్లు కుశాల్ భుర్టెల్ (Kushal Bhurtel), ఆసిఫ్ షేక్ తొలి వికెట్‌కు 35 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కానీ 8వ ఓవర్లో కుశాల్ భుర్టెల్ (13) అవుటయ్యాడు. దీనితరువాత వెంటనే రోహిత్ పాడెల్ (0) కూడా వచ్చినంత వేగంగా వెనుదిరిగాడు. నాలుగో స్థానంలో వచ్చిన అనిల్ సాహ్ 24 బంతుల్లో 1 సిక్స్, 3 ఫోర్లతో 27 పరుగులు చేశాడు. అయితే, మరోవైపు ఆసిఫ్ షేక్ (Asif Shaik) బాధ్యతాయుతంగా బ్యాటింగ్ కొనసాగించాడు. ఆసిఫ్ 49 బంతులు ఎదుర్కొని 1 సిక్స్, 4 ఫోర్లతో 42 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ సమయానికి నేపాల్ జట్టు 15 ఓవర్లలో 100 పరుగులు చేసింది. చివరి 2 ఓవర్లలో నేపాల్‌కు 16 పరుగులు కావాలి. ఎన్రిక్ నోకియా వేసిన 19వ ఓవర్ తొలి 4 బంతుల్లో పరుగులేమీ నమోదు కాలేదు. 5వ బంతికి సోంపాల్ కమీ భారీ సిక్సర్ కొట్టాడు. చివరి బంతికి 2 పరుగులు చేశాడు. దీని ప్రకారం నేపాల్ జట్టుకు చివరి 6 బంతుల్లో 8 పరుగులు కావాలి. ఒట్నీల్ బార్ట్‌మన్ వేసిన చివరి ఓవర్‌లో గుల్షన్ ఝా మొదటి 2 బంతులను ఎదుర్కొని పరుగులు సాధించలేదు. నేపాల్ ఓటమికి కారణమైన ఒక్క పరుగు వీడియో ఇక్కడ చూడొచ్చు.. BIGGEST HEART-BREAKING MOMENT IN NEPAL CRICKET HISTORY. 💔 pic.twitter.com/aUeJPAoBvv — Johns. (@CricCrazyJohns) June 15, 2024 Also Read : స్కాట్‌లాండ్ పై జర్మనీ ఘన విజయం.. మిగిలిన టీమ్స్ కు హెచ్చరిక 3వ బంతికి గుల్షన్ ఫోర్ కొట్టాడు. 4వ బంతికి మరో రెండు పరుగులు రాబట్టాడు. 5వ బంతికి పరుగు లేదు. చివరి బంతికి 2 పరుగులు కావాలి. బార్ట్‌మన్ విసిరిన బంతి వికెట్ కీపర్ చేతిలో పడింది. ఇక్కడ నేపాలీ బ్యాటర్లు పరుగుల కోసం పరుగులు తీశారు. కానీ స్లో రన్నింగ్ కారణంగా నాన్ స్ట్రైకర్స్ ఎండ్‌లో గుల్షన్ ఝా రనౌట్ అయ్యాడు. దీంతో నేపాల్ జట్టు కొన్ని అంగుళాల తేడాతో ఓడినట్టయింది. దీంతో దక్షిణాఫ్రికా జట్టు కేవలం 1 పరుగు తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. ఈ చేదు ఓటమి నేపథ్యంలో, నేపాల్ యువ దళం అద్భుతమైన ప్రదర్శనతో ప్రశంసలు అందుకుంది. దక్షిణాఫ్రికా ప్లేయింగ్ 11: క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), రీజా హెండ్రిక్స్, ఐడెన్ మార్క్రామ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కో జాన్సెన్, కగిసో రబడ, హెన్రిక్ నోకియా, ఒట్నీల్ బార్ట్‌మన్, తబ్రేజ్ షమ్సీ. నేపాల్ ప్లేయింగ్ 11: కుశాల్ భుర్టెల్, ఆసిఫ్ షేక్ (వికెట్ కీపర్), అనిల్ సా, రోహిత్ పౌడెల్ (కెప్టెన్), కుశాల్ మల్లా, దీపేంద్ర సింగ్ ఐరీ, గుల్షన్ ఝా, సోంపాల్ కమీ, కరణ్ కెసి, సందీప్ లామిచానే, అబినాష్ బోహార. #2024-t20-world-cup #nepal-cricket #cricket-south-africa మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి