Nellore: వినాయకుడే ఆ కుటుంబాలకు జీవనాధారం

విఘ్నాలను తొలగించి శుభాలను ప్రసాదించే ఆదిదేవుడు గణనాథుడు అటువంటి గణనాధుని క్షేత్రాలలో కల ప్రసిద్ధిగాంచింది తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలులోని శ్రీ లక్ష్మీ గణపతి క్షేత్రం. సోమవారం వేకువజాము నుండే స్వామివారికి అభిషేకాలతో ప్రత్యేక పూజలతో ప్రారంభమయ్యాయి.

New Update
Nellore: వినాయకుడే ఆ కుటుంబాలకు జీవనాధారం

మట్టి విగ్రహాలకు పెట్టింది పేరు ఆ గ్రామం

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం సంగం మండలం వెంగారెడ్డిపాలెం గ్రామానికి చెందిన సుమారు 50 శాలివాహన కుమ్మరి కుటుంబాలు వినాయక చవితి పండుగ సందర్భంగా మట్టి విగ్రహలు తయారు చేయడం ఆనవాయితీ. ఈ గ్రామంలో దొరికే మట్టి విగ్రహాలకు మంచి గిరాకీ ఉంది. ఆర అడుగు నుంచి 5 అడుగుల వరకు కేవలం బంకమట్టిని ఉపయోగించి మాత్రమే వినాయక విగ్రహలు తయారు చేస్తుంటారు. జిల్లాలోని అన్ని ప్రాంతాలతో పాటు తెలంగాణ తమిళనాడు ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి మట్టి విగ్రహాలను తీసుకెళ్తూ ఉంటారు.

విగ్రహాలు తయారీలోని నిమగ్నం

ముందస్తుగా ఫోన్ ద్వారా వారికి కావలసిన విగ్రహాల సైజులను ఎన్ని విగ్రహాలు కావాలో ఆర్డర్ ఇచ్చి గ్రామస్తులు తయారు చేసిన తర్వాత వాటిని తీసుకెళ్తూ ఉంటారు. వినాయక చవితి పండుగకు మూడు నెలల నుంచి ఈ కుటుంబాలలో గ్రామంలోని ఇక్కడ ప్రతి ఇంట కుటీర పరిశ్రమలగా వినాయక విగ్రహం తయారు చేయడం ప్రత్యేకత. కుటుంబం మొత్తం ఈ మూడు నెలలు ఈ విగ్రహం తయారీలోని పాలుపంచుకుంటారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో మట్టి వినాయక విగ్రహాలు అనగానే వెంటనే గుర్తుచే పేరు వెంగారెడ్డిపాలెం. సంగం మండలంలోని మారుమూల ప్రాంతమున ఈ చిన్న గ్రామంలో సుమారు 100 కుటుంబాలు ఉండగా 40 కుటుంబాలు మొత్తం ఈ వినాయక విగ్రహాలు తయారీలోని నిమగ్నమై ఉంటారు. కుమ్మరి కులస్తులుగా కుండలను కూజాలను వినాయక ప్రతిమలను తయారు చేస్తూ జీవించే వీళ్లు ముఖ్యంగా వినాయక చవితికి ముందు మూడు నెలలపాటు తయారు చేసే వినాయక విగ్రహాలే ఏడాది పొడవున ఈ కుటుంబాలు జీవనాధారంగా ఎంచుకున్నాయి.

ఎటువంటి సమస్యలైన దూరం

ఈ విషయమై ఇక్కడి మట్టి విగ్రహాలు మాట్లాడుతూ.. తమ గ్రామానికి బయట ప్రాంతాల నుంచి పలువురు ఆర్డర్లపై వినాయక విగ్రహాలు కొనుగోలు చేసుకుంటారని మట్టి విగ్రహలు తయారుచేసి కొనుగోలుదారుల కోరిక మీద కొన్ని విగ్రహాలకు ఎటువంటి ఇబ్బంది కలిగించని కొన్ని రంగులను మాత్రమే విగ్రహాలకు పూస్తామని దాదాపు మట్టి విగ్రహాలని ఎక్కువగా తీసుకెళ్తూ ఉంటారని తెలిపారు. ఈ మట్టి విగ్రహాలను వినాయక చవితి రోజు వాడితే భక్తి భావంతో పాటు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండమని భక్తుల విశ్వాసం అంటూ వీరు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు