బీఎస్పీకి షాక్ ఇచ్చిన యువనేత.. రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లోకి నీలం మధు!

బీసీ యువనేత నీలం మధు బీఎస్పీకి రాజీనామ చేశారు. ఈ నెల 15న ముఖ్యమంత్రి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో గుర్తించి పార్టీ టిక్కెట్ కేటాయించినందుకు బీఎస్పీ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

New Update
బీఎస్పీకి షాక్ ఇచ్చిన యువనేత.. రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ లోకి నీలం మధు!

NEELAM MADHU: లోక్ సభ ఎన్నికల వేళ తెలంగాణలో బీఎస్పీకి (BSP) షాక్ తగిలింది. బీసీ యువనేతగా మంచి గుర్తింపు దక్కించుకున్న నీలం మధు బీఎస్పీకి రాజీనామ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ మధు మళ్లీ కాంగ్రెస్ గూటీకి చేరబోతున్నారు. మరో వారం రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ (Cm Revanth) సమక్షంలో హస్తం తీర్థం పుచ్చుకోనుండగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తైనట్లు సమాచారం.

బీఎస్పీ నాయకత్వానికి ధన్యవాదాలు..
ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు కార్యకర్తల ఆద్శర్యంలో ఈ నెల 15 న కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు బీఎస్పీ పార్టీకి రాజీనామా లేఖను సమర్పించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో గుర్తించి పార్టీ టిక్కెట్ కేటాయించినందుకు బీఎస్పీ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన వెంట నడుస్తున్న నాయకులు, కార్యకర్తల సలహా మేరకు కాంగ్రెస్ పార్టీ లో చేరాలని డిసైడ్ అయినట్లు ఆయన పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో కార్యకర్తలంతా కాంగ్రెస్‌లో చేరాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు ప్రజల సంక్షేమం కోసం ప్రజా పాలనలో తాము సైతం భాగస్వాములు కావడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈనెల 15న తన వెంట నడుస్తున్న నాయకులు, కార్యకర్తలు, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులతో కలిసి గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీప్ దాస్ మున్షీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి : Kiss day: ఫస్ట్ లాంగెస్ట్ ఆన్-స్క్రీన్ ముద్దు వీళ్లదే.. అతనితో లేచిపోయి ట్విస్ట్ ఇచ్చిన నటి

కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలతో అన్ని వర్గాల ప్రజలకు, ప్రతి ఇంటికి సంక్షేమం, సమన్యాయం జరుగుతుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో చేరి అందరితో కలుపుగోలుగా ఉంటూ కలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. తనకు కాంగ్రెస్ పార్టీకి సేవ చేసే అవకాశం కల్పించిన ఏఐసీసీ అధినాయకత్వంతో పాటు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల కనుగుణంగా పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి తనవంతుగా పాటుపడతానని మధు చెప్పుకొచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు