Saripdhaa Sanivaram Twitter Review : 'సరిపోదా శనివారం' ట్విట్టర్ టాక్.. పోతారు.. మొత్తం పోతారు

నాని నటించిన 'సరిపోదా శనివారం' మూవీ నేడు థియేటర్స్ లో విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్ లో షోలు పడ్డాయి. మూవీకి ట్విట్టర్ లో పాజిటివ్ టాక్ నడుస్తోంది. సినిమాలో నాని, SJ సూర్యల పర్ఫార్మెన్స్ యాక్షన్ సీన్స్, బీజియం నెక్స్ట్ లెవెల్ అంటూ నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు.

New Update
Saripdhaa Sanivaram Twitter Review : 'సరిపోదా శనివారం' ట్విట్టర్ టాక్.. పోతారు.. మొత్తం పోతారు

Saripdhaa Sanivaram Twitter Review : న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన 'సరిపోదా శనివారం' మూవీ నేడు (ఆగస్టు 29) థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇప్పటికే ఓవర్సీస్ లో షోలు పడ్డాయి. అటు తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని చోట్ల షోస్ పడగా.. ట్విట్టర్ వేదికగా ఫ్యాన్స్ హంగామా షూరు చేశారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో సినిమా ఎలా ఉందో తమ రివ్యూల రూపంలో తెలుపుతున్నారు.


సినిమా విషయానికొస్తే.. నాని, ఎస్ జే సూర్యల ఫర్ఫార్మెన్స్ మాత్రం అదిరిపోయిందట. ఇక యాక్షన్ సీక్వెన్స్ ఫీస్ట్ లా ఉంటుందని.. ఆర్ఆర్ మాత్రం పగిలిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఫస్ట్ హాఫ్ లో నాని, SJ సూర్యల పర్ఫార్మెన్స్ అదిరిపోయిందని..వీరిద్దరి కోసమే ఈ చిత్రాన్ని థియేటర్లలో చూడాల్సిందేనని.. ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిందని ట్వీట్ చేస్తున్నారు.

Also Read : మాస్ అయినా.. క్లాస్ అయినా.. ఇండస్ట్రీకి ‘కింగ్’ ఒక్కడే

పోతారు.. మొత్తం పోతారు.. ఇక సెకండాఫ్ వచ్చే సరికి కాస్త బోరింగ్ అని ట్వీట్ చేశాడు. స్క్రీన్ ప్లే అనుకున్న స్థాయిలో లేదు, యాక్షన్ సీన్స్, బీజియం నెక్స్ట్ లెవెల్. ఇంటర్వెల్ బ్యాంగ్ కు పోతారు, మొత్తం పోతారు అని మరో నెటిజన్ పేర్కొన్నాడు. మరో హిట్టు కొట్టేశాం అని నాని ఫ్యాన్ పోస్ట్ పెట్టాడు. మొత్తంగా 'సరిపోదా శనివారం' మూవీకి ట్విట్టర్ లో పాజిటివ్ టాక్ నడుస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు