/rtv/media/media_files/2026/05/04/cm-stalin-2026-05-04-16-10-29.jpg)
తమిళనాడులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొలత్తూరులోద్రవిడ మున్నేట్ర కజగం అధినేత, సీఎం స్టాలిన్ ఓటమి దాదాపుగా ఖాయమైంది. ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న తాజా సమాచారం ప్రకారం, ఆయనపై TVK పార్టీ అభ్యర్థి వీఎస్ బాబు 8,000 ఓట్లకు పైగా ఆధిక్యంలో ఉన్నారు. ఇది డీఎంకేకు పెద్ద ఎదరుదెబ్బ. దీంతో పవర్ లో ఉన్న డీఎంకే అందులోనూ సీఎంను ఓడించిన క్యాండెట్ ఎవరు అతని బ్యాక్ గ్రౌండ్ గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. గతంలో వీఎస్ బాబు కూడా డీఎంకే పార్టీలోనే ఉన్నారు. 2006లో జరిగిన పురసవాక్కం శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ ఎన్నికలలో ఏఐఏడీఎంకే అభ్యర్థిపై 90,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు. 2026వరకు అదే పార్టీలో ఉన్నారు. సరిగ్గా ఎన్నికలకు ముందు 7 ఫిబ్రవరి ఆయన తమిళగ వెట్రి కజగంలో చేరారు. విజయ్ ఆయనకు ఎంతో నమ్మకంతో ఎం.కె. స్టాలిన్‌పై పోటీ చేయడానికి కొలత్తూరు నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చారు. వీఎస్ బాబు ఏకంగా సీఎంను ఓడించి సంచలనంగా మారారు. తన 2026 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం, బాబు రూ. 3.7 కోట్ల విలువైన ఆస్తులను ప్రకటించారు.
Follow Us