Pune: ట్యాంకర్ ను మింగేసిన రోడ్డు! పూణే మున్సిపల్ కార్పొరేషన్ సంస్థకు చెందిన వాటర్ ట్యాంకర్ రోడ్డు పై ఓ ప్రాంతాన్ని దాటుతున్న సమయంలో ఒక్కసారిగా కిందకి కూరుకుపోయింది. వెనుక భాగంలో గుంత ఏర్పడటం వల్ల ఈ ప్రమాదం జరిగింది. By Bhavana 21 Sep 2024 in నేషనల్ క్రైం New Update షేర్ చేయండి Pune: అప్పుడేప్పుడో బ్రహ్మం గారు చెప్పినట్లు కలియుగంలో ఎన్నో వింతలు జరుగుతున్నాయి. తాజాగా మహారాష్ట్రలోని పూణేలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డుపై వెళ్తున్న ఓ ట్యాంకర్ అకస్మాత్తుగా ఉన్నచోటే రోడ్డులోకి కూరుకుపోయింది. అనూహ్య రీతిలో పెద్ద గుంత పడి అందులోకి ట్యాంకర్ పడిపోయింది. రెప్పపాటులోనే ఇదంతా జరిగిపోయింది. పూణే మున్సిపల్ కార్పొరేషన్ సంస్థకు చెందిన వాటర్ ట్యాంకర్ ఈ ప్రమాదానికి గురైంది. ఇందుకు సంబంధించిన దృశ్యం సీసీటీవీ ఫుటేజీలో రికార్డయింది. రోడ్డుపై వెళుతున్న ట్యాంకర్ ఓ ప్రాంతాన్ని దాటుతుండగా వెనుక నుంచి గుంత ఏర్పడింది. వాహనం కూడా వెనుక భాగం వైపు నుంచి లోపలికి దూసుకెళ్లింది. ట్రక్కు వెనుక చక్రాల భాగం మొత్తం గుంతలోకి పడిపోయింది. Visuals from pune where a truck of pune municipal corporation sucked by a sudden pit that developed in port office premises #pune #PMC #Roadcondition pic.twitter.com/Ick6OZgHXl — Nilesh shukla (@Nilesh_isme) September 20, 2024 లక్కీగా ఈ ప్రమాదంలో ఎవరూ కూడా గాయపడలేదని అధికారులు తెలిపారు. క్యాబిన్ భాగం పైకి ఉండడంతో డ్రైవర్ సురక్షితంగా బయట పడ్డాడు. ఇక సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరోవైపు మున్సిపల్ అధికారులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. గుంత ఏర్పడడానికి కారణాలను గురించి ఆరాతీస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని, రోడ్డు మరమ్మతు పనులను వెంటనే చేపట్టాలని స్థానికులు అధికారులను వేడుకుంటున్నారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి