CM Vijay: "విజయ్ సామాన్యుల ఆరాధ్య నాయకుడు' ధన్యవాదాలు చెప్పిన విశాల్..ఎందుకో తెలుసా?

తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ సినీ పరిశ్రమ సంక్షేమం దిశగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ హీరో, నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్ సోషల్ మీడియా వేదికగా విజయ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన ఇంట్రెస్టింగ్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

New Update
FotoJet (17)

Vishal thanked Vijay for being a "lovable leader of the common man"

CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం ప్రారంభమైన తరుణంలో.. నూతన ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత సి. జోసెఫ్ విజయ్ (దళపతి విజయ్) సినీ పరిశ్రమ సంక్షేమం దిశగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. కోలీవుడ్ చిత్ర పరిశ్రమను ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ఆయన తీసుకున్న ఈ సంచలన నిర్ణయంపై యావత్ సినీ ప్రపంచం హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రముఖ యాక్షన్ హీరో, నడిగర్ సంఘం కార్యదర్శి విశాల్ సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి విజయ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన ఇంట్రెస్టింగ్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

 తమిళనాడులో చిన్న, పెద్ద సినిమాలనే తేడా లేకుండా చిత్ర పరిశ్రమ తీవ్ర క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈ సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్న సీఎం విజయ్.. థియేటర్ల వ్యవస్థకు భారీ ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నారు.గతంలో ఉన్న కఠిన నిబంధనలను సవరిస్తూ, ఇకపై రాష్ట్రంలో కొత్తగా విడుదలయ్యే ప్రతి తమిళ సినిమాకు మొదటి వారం (తొలి 7 రోజులు) రోజుకు 5 షోలను (Daily 5 Shows) ప్రదర్శించుకోవడానికి అధికారికంగా అనుమతి ఇచ్చారు. ఇందుకోసం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమాన్యాలు ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదు. వారి పరస్పర నిర్ణయం మేరకే ఈ ఐదో షోను ప్రదర్శించుకోవచ్చు.

 ముఖ్యమంత్రి విజయ్ కార్యాలయం విడుదల చేసిన అధికారిక ప్రెస్ నోట్ ప్రకారం..గత నెల ఏప్రిల్ 16న తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులు నూతన ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌ను కలిసి పరిశ్రమ సమస్యలపై పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు.: ఇండస్ట్రీ అభ్యర్థనను సానుకూలంగా పరిశీలించిన సీఎం, 'తమిళనాడు సినిమా థియేటర్ల (నియంత్రణ) నిబంధనలను' సవరించాలని అధికారులను ఆదేశించారు. కొత్త సినిమాలు విడుదలైన మొదటి 7 రోజులతో పాటు.. స్థానిక పండుగలు, ప్రభుత్వ సెలవు దినాలు, శని,ఆదివారాల్లో కూడా (Weekends) రోజుకు ఐదు ప్రదర్శనలు ఇచ్చుకునేలా శాశ్వత అనుమతులు జారీ చేశారు.

"ఆయన సామాన్యుల ఆరాధ్య నాయకుడు" – హీరో విశాల్ భావోద్వేగ ట్వీట్

ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై తమిళ నటుడు, నిర్మాత విశాల్ స్పందిస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సీఎం విజయ్‌ను ఆకాశానికెత్తారు. సినీ పరిశ్రమ కష్టాలను ఒక నటుడిగా, ఒక ముఖ్యమంత్రిగా విజయ్ సరైన సమయంలో గుర్తించారని కొనియాడారు.

విశాల్ తన పోస్ట్‌లో ఏమన్నారంటే...

"మన ప్రియమైన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన సామాన్యుల ఆరాధ్య నాయకుడు. రాజకీయాల్లోకి ప్రవేశించిన అత్యంత ప్రభావవంతమైన నటుడు ఆయనే. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రస్తుత ఆర్థిక, క్లిష్ట పరిస్థితులను అర్థం చేసుకుని, కొత్త చిత్రాలు విడుదలైన మొదటి 7 రోజులు రోజుకు 5 ప్రదర్శనలకు అనుమతించినందుకు కృతజ్ఞతలు. సినిమా రంగానికే కాకుండా, రాబోయే రోజుల్లో అన్ని రంగాల్లోనూ సామాన్యుల కోసం ఆయన ఇలాంటి గొప్ప నిర్ణయాలే తీసుకుంటారని ఆశిస్తున్నాం. మా యావత్ సినీ పరిశ్రమ తరపున మీకు శతకోటి వందనాలు."

కోలీవుడ్‌లో కొత్త ఉత్సాహం..

సినిమా కలెక్షన్లను పెంచుకోవడానికి, థియేటర్ల నిర్వహణ ఖర్చులు భరించడానికి రోజుకు ఐదో షో అనేది చిత్ర పరిశ్రమకు ఒక బూస్టర్ డోస్ లాంటిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా చిన్న బడ్జెట్ సినిమాలకు ఈ నిర్ణయం ఎంతగానో లబ్ధి చేకూర్చనుంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే సినీ పరిశ్రమకు ఇంత పెద్ద మేలు చేయడంతో కోలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్ హీరోలు, అగ్ర దర్శకులు, నిర్మాతలు సీఎం విజయ్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ సామాజిక మాధ్యమాల్లో అభినందనల వర్షం కురిపిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు