/rtv/media/media_files/2026/04/10/monalisa-1-2026-04-10-11-48-54.jpg)
సోషల్ మీడియాలో వైరల్ గర్ల్ గా పేరు తెచ్చుకున్న మోనాలిసా భోంస్లే ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ప్రేమ, పెళ్లి అంటూ సాగిన ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు కుట్రను జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (NCST) బట్టబయలు చేసింది. మోనాలిసా మైనర్ అని, తప్పుడు పత్రాలతో ఆమెను మేజర్ అని నమ్మించి పెళ్లి చేశారని తేలడంతో ఈ కేసు ఒక్కసారిగా మలుపు తిరిగింది.
మోనాలిసాది మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్‌కు చెందిన పారధి తెగ (ఎస్టీ). అయితే ఆమెకు, ఫర్మాన్ ఖాన్ అనే వ్యక్తికి కేరళలో వివాహం జరిగింది. ఈ పెళ్లి సమయంలో ఆమె మేజర్ అని చూపించడానికి ఆధార్ కార్డులో తప్పుడు వయసును నమోదు చేశారు. కానీ, కమిషన్ చైర్మన్ అంతర్ సింగ్ ఆర్య నేతృత్వంలోని బృందం లోతుగా విచారించగా అసలు నిజం బయటపడింది. మహేశ్వర్ ప్రభుత్వ ఆసుపత్రి రికార్డుల ప్రకారం మోనాలిసా డిసెంబర్ 30, 2009న జన్మించింది. అంటే పెళ్లి సమయానికి ఆమె వయసు కేవలం 16 ఏళ్లే. దీనిని బట్టి ఆమె మైనర్ అని స్పష్టమైంది.
72 గంటల్లోనే బట్టబయలు
కేరళ నుంచి మధ్యప్రదేశ్ వరకు విస్తరించిన ఈ నెట్‌వర్క్‌ను దర్యాప్తు సంస్థలు కేవలం 72 గంటల్లోనే బట్టబయలు చేశాయి. మున్సిపల్ కౌన్సిల్ జారీ చేసిన నకిలీ పుట్టిన తేదీ ధృవీకరణ పత్రాన్ని కూడా అధికారులు గుర్తించి, దానిని రద్దు చేసే ప్రక్రియను ప్రారంభించారు. ఒక మైనర్ బాలికను పక్కా ప్లాన్ ప్రకారం మేజర్‌గా చిత్రీకరించి పెళ్లి చేయడం వెనుక పెద్ద కుట్రే ఉందని న్యాయవాది ప్రథమ్ దూబే చేసిన ఫిర్యాదుతో ఈ దర్యాప్తు వేగవంతమైంది.
ఈ నిజాలు బయటపడటంతో మోనాలిసా భర్త ఫర్మాన్ ఖాన్ పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. మధ్యప్రదేశ్ పోలీసులు అతనిపై అత్యంత కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసును జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏప్రిల్ 22, 2026న కేరళ, మధ్యప్రదేశ్ రాష్ట్రాల డీజీపీలను (DGP) వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. బాధ్యులైన ప్రతి ఒక్కరినీ శిక్షించే వరకు వదిలే ప్రసక్తే లేదని కమిషన్ స్పష్టం చేసింది.
Follow Us