వినేశ్ ఉడుం 'పట్టు' దెబ్బకు బీజేపీ అభ్యర్థి అడ్రెస్ గల్లంతు! ఒలింపిక్స్ లో గెలుపు తీరాలకు చేరినట్లు చేరి.. ఆఖరి నిమిషంలో పతకం కోల్పోయిన వినేశ్ ఫొగాట్.. పాలిటిక్స్ లో మాత్రం తొలి ప్రయత్నంలోనే విజయం సాధించి సత్తా చాటారు. హోరాహోరీగా సాగిన హర్యానా ఎన్నికల్లో 6 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. By Nikhil 08 Oct 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి హర్యానాలోని జులానా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫొగట్ విజయం సాధించారు. మొదట ఆధిక్యంలో కొనసాగిన ఆమె.. తరువాత కొన్ని రౌండ్ల పాటు వెనుకబడ్డారు. అనూహ్యంగా మళ్లీ దూసుకొచ్చి విజయకేతనం ఎగురవేశారు. నిజానికి వినేష్ తన జీవితాన్ని తానే నిర్మించుకుంది. కష్టాలకు భయపడి ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. జంతర్ మంతర్ రోడ్లపైన అయినా.. ఒలింపింక్స్లో అయినా పోరాడింది. క్రమశిక్షణతో.. వినేశ్ ఫొగాట్ విజయంలో కీలకపాత్ర పోషించిన అంశం క్రమశిక్షణ. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన వినేష్ తన ప్రాక్టీస్, కెరీర్, వ్యక్తిగత జీవితంపై ఎప్పుడూ స్పష్టమైన ఆలోచనలతో ఉంటారు. ఇటు రాజకీయాల్లోనూ అదే సూత్రాన్ని ఫాలో అయ్యారు. ఇక పారిస్ ఒలింపిక్స్లో తృటిలో పతకాన్ని చేజార్చుకున్న వినేశ్ ఫొగాట్ రాజకీయాల్లో డెబ్యూలోనే సక్సెస్ కావడం పట్ల క్రీడా ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. #vinesh-phogat మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి