/rtv/media/media_files/2025/03/12/yK8ljYbsTEpNmn04WYTx.jpg)
ఉప రాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 2025 మార్చి 9న ఛాతీ నొప్పితో బాధపడుతూ ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయన బుధవారం ఉదయం డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఉప రాష్ట్రపతి కోలుకున్నారని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని .. అందుకే ఆయన్ను డిశ్చార్జి చేశామని వైద్యులు తెలిపారు. అయినప్పటికీ మరికొన్ని రోజులు పాటు ఆయనకు విశ్రాంతి అవసరమని పేర్కొంటూ ఓ ప్రకటన విడుదల చేశారు.
2022 ఆగస్టు నుంచి ఉప రాష్ట్రపతిగా
73 ఏళ్ల జగ్‌దీప్ ధన్‌ఖడ్ ను డాక్టర్ రాజీవ్ నారంగ్ సంరక్షణలో క్రిటికల్ కేర్ యూనిట్ (సిసియు)లో ఉంచారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ , కేంద్ర ఆరోగ్య మంత్రి, బీజేపీ చీఫ్ జగత్ ప్రకాష్ నడ్డా జగ్‌దీప్ ధన్‌ఖడ్ ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. రాజస్థాన్‌కు చెందిన జగ్‌దీప్ ధన్‌ఖడ్ 2022 ఆగస్టు నుంచి ఉప రాష్ట్రపతిగా కొనసాగుతున్నారు.
Vice President Jagdeep Dhankhar discharged from AIIMS Delhi. He was admitted to AIIMS on 9th March following cardiac-related ailments...he made a satisfactory recovery..He has been advised to take adequate rest for the next few days: AIIMS Delhi pic.twitter.com/ETgoZJV1PW
— ANI (@ANI) March 12, 2025
Also Read : హిందీలో 'ఛావా' కలెక్షన్ల జోరు.. 'బాహుబలి-2' రికార్డ్ బ్రేక్! ఎన్ని కోట్లంటే