VerSe Innovation : VerSe Innovation ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా పి.ఆర్.రమేష్..ఆయన బ్యాక్ గ్రౌండ్‌ ఇదే..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత లోకల్ లాంగ్వేజ్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ 'VerSe Innovation' తన వ్యూహాత్మక అభివృద్ధిలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. పి.ఆర్. రమేష్‌ను ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నియమించుకుంది.

New Update
FotoJet (20)

pr. ramesh and umangbedi


VerSe Innovation : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత లోకల్ లాంగ్వేజ్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్ 'VerSe Innovation' తన వ్యూహాత్మక అభివృద్ధిలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. పి.ఆర్. రమేష్‌ను ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా నియమించుకుంది. ఆయన దేశంలోని అత్యంత అనుభవజ్ఞులైన ఫైనాన్షియల్ అడ్వైజర్లలో ఒకరుగా ఉన్నారు. పీఆర్‌ రమేష్ బోర్డులో సభ్యుడిగానే కాకుండా, ఆడిట్ కమిటీ ఛైర్మన్‌గా కూడా వ్యవహరిస్తారని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

ఇంతకీ పి.ఆర్. రమేష్‌ ఎవరంటే?

పి.ఆర్‌. రమేష్‌ కు  చార్టర్డ్ అకౌంటెంట్‌గా 40 ఏళ్లకు పైగా విశేష అనుభవం ఉంది.  గతంలో  ఆయన డెలాయిట్ ఇండియా ఛైర్మన్‌గా కూడా పనిచేశారు. డెలాయిట్ గ్లోబల్ బోర్డులో కూడా సభ్యుడిగా సేవలందించారు. ప్రస్తుతం పి.ఆర్. రమేష్‌ ఎయిర్ ఇండియా, సిప్లా, నెస్లే ఇండియా, ఎల్ అండ్ టీ వంటి దిగ్గజ సంస్థల బోర్డుల్లో సభ్యుడిగా కొనసాగుతుండటం గమనార్హం. పి.ఆర్‌. రమేష్‌ 2022-23 సంవత్సరానికి గాను ఆసియా సెంటర్ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్ నుండి "బెస్ట్ ఇండిపెండెంట్ డైరెక్టర్" అవార్డును అందుకోవడం విశేషం. పి,ఆర్‌. రమేష్‌ సెబీ (SEBI), ఆర్బీఐ (RBI), ఐఆర్డీఏ (IRDA) తదితర నియంత్రణ సంస్థల అడ్వైజరీ కమిటీల్లో సభ్యుడిగా పనిచేచయడంతో పాటు దేశ ఆర్థిక ప్రమాణాల రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. 

కాగా, పి.ఆర్‌, రమేష్‌ ను ఇండిపెండెంట్‌గా నియమించుకోవడం పై VerSe సహ-వ్యవస్థాపకుడు ఉమంగ్ బేడీ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ఒక సంస్థ కాలపరీక్షను తట్టుకొని నిలబడాలంటే బలమైన ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత అవసరం. రమేష్  అనుభవం మా గవర్నెన్స్ ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తుంది" అన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఇదే విషయమై  పి.ఆర్. రమేష్  మాట్లాడుతూ.. "డిజిటల్ రంగంలో VerSe అత్యున్నత స్థాయికి చేరుకుంది. సంస్థ వృద్ధి చెందుతున్న కొద్దీ జవాబుదారీతనం, రిస్క్ మేనేజ్‌మెంట్ వంటి వ్యవస్థలు కూడా అదే స్థాయిలో పటిష్టంగా ఉండాలి. బాధ్యతాయుతమైన వృద్ధి దిశగా మేనేజ్‌మెంట్ టీంతో కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను" అని స్పష్టం చేశారు.

VerSe Innovation ప్రస్థానం

కాగా VerSe Innovation టెక్నాలజీ సాయంతో డిజిటల్ అంతరాన్ని తగ్గించాలనే లక్ష్యంతో ప్రారంభమైంది. నేడు స్థానిక భాషల్లో వందల మిలియన్ల మందికి కంటెంట్‌ను అందిస్తోంది. ఇందులో  డైలీహంట్ (Dailyhunt), జోష్ (Josh), మ్యాగ్జ్‌టర్ (Magzter), నెక్స్ వర్స్ (NexVerse.ai) ప్రధాన యాప్స్‌గా ఉండగా,  గూగుల్, మైక్రోసాఫ్ట్, సెకోయా కాపిటల్, గోల్డ్ మాన్ సాక్స్ వంటి దిగ్గజ సంస్థలు ఇందులో పెట్టుబడిదారులగా ఉన్నాయి.  గడచిన కొంతకాలంగా వరుసగా కొత్త ఆవిష్కరణలతో దూసుకుపోతున్న VerSe Innovation,లో పి.ఆర్. రమేష్ వంటి దిగ్గజం బోర్డులోకి రావడం ద్వారా తన సంస్థాగత విశ్వసనీయతను మరింత పెంచుకున్నట్లయింది. పారదర్శకమైన ఆర్థిక విధానాలతో సుస్థిర వృద్ధిని సాధించడమే లక్ష్యంగా పి,ఆర్‌, రమేష్‌ను నియమించుకున్నట్లు స్పష్టమవుతోంది.

Advertisment
తాజా కథనాలు