/rtv/media/media_files/2026/02/07/trade-2026-02-07-11-31-16.jpg)
In India-US Trade Framework, Washington's Kashmir Message To Pakistan
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన రెండో విడత పాలనలో స్వదేశీ పరిశ్రమలను కాపాడుకునేందుకు దూకుడు పెంచారు. విదేశీ పారిశ్రామిక ఉత్పత్తుల వల్ల అమెరికా మార్కెట్ దెబ్బతింటోందని భావిస్తున్న ట్రంప్ ప్రభుత్వం, బుధవారం నుంచి వాణిజ్య దర్యాప్తును ప్రారంభించింది. 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 కింద ఈ విచారణ జరుగుతోంది. గతంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని సాకుగా చూపి ట్రంప్ విధించిన టారిఫ్‌లను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో వెనక్కి తగ్గని ట్రంప్ యంత్రాంగం, ఇప్పుడు పక్కా చట్టబద్ధమైన పద్ధతిలో విచారణ చేపట్టి, ఆయా దేశాల నుంచి వచ్చే వస్తువులపై భారీగా సుంకాలు వేయడానికి సిద్ధమవుతోంది.
టార్గెట్‌లో 16 ప్రధాన దేశాలు
ఈ దర్యాప్తు కేవలం ఒక్క దేశానికే పరిమితం కాలేదు. అమెరికాతో అతిపెద్ద వాణిజ్య సంబంధాలు ఉన్న భారత్, చైనా, యూరోపియన్ యూనియన్, మెక్సికో, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటితో పాటు ఆగ్నేయాసియా దేశాలైన వియత్నాం, థాయిలాండ్, బంగ్లాదేశ్ కూడా అమెరికా నిఘా నీడలోకి వచ్చాయి. అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్ ప్రకారం.. అనేక దేశాలు తమ దేశీయ అవసరాల కంటే చాలా ఎక్కువగా వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాయి. ఆ మిగులు ఉత్పత్తులను అమెరికా మార్కెట్లోకి తక్కువ ధరకే పంపిస్తూ, అక్కడి స్థానిక కర్మాగారాలను దెబ్బతీస్తున్నాయని ఆయన ఆరోపించారు. దీనివల్ల అమెరికాలో కొత్త ఫ్యాక్టరీల నిర్మాణం ఆగిపోతోందని ప్రభుత్వం భావిస్తోంది.
భారత దేశంపై ప్రభావం
భారత్ ఈ జాబితాలో ఉన్నప్పటికీ, ఇటీవలే ట్రంప్ ప్రభుత్వం భారత్‌కు ఒక పెద్ద ఊరటనిచ్చింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించుకుంటామన్న హామీతో, భారత ఉత్పత్తులపై పన్నును 50% నుండి 18%కి తగ్గించారు. ఈ దర్యాప్తుతో అమెరికా, ఇండియా చేసుకున్న ట్రేడ్ డీల్ దెబ్బతింటుందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ, తాజా సెక్షన్ 301 దర్యాప్తు వల్ల భవిష్యత్తులో ఈ సమీకరణాలు ఎలా మారతాయో వేచి చూడాలి. "అమెరికా కార్మికులకు మేలు జరగాలి, ఇక్కడే ఉద్యోగాలు రావాలి" అనేది ట్రంప్ నినాదం. ఇతర దేశాల వస్తువులపై పన్నులు పెంచడం ద్వారా అమెరికా కంపెనీలు లాభపడతాయని, తద్వారా సప్లై చైయిన్ మళ్ళీ అమెరికా చేతుల్లోకి వస్తుందని ఆయన నమ్ముతున్నారు.
Follow Us