Vijay Tweet : మంచే జరుగుతుంది .. విజయం నిశ్చయం : విజయ్ సంచలన ట్వీట్!

విద్యార్థులను అభినందిస్తూ, పరీక్షల్లో వెనుకబడిన వారికి కొండంత ధైర్యాన్ని ఇస్తూ తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, నటుడు విజయ్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

New Update
vijay

తమిళనాడులో 12వ తరగతి బోర్డు పరీక్షల ఫలితాలు కొద్దీసేపటి క్రితమే విడుదలయ్యాయి. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 95.20 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి సత్తా చాటారు. ఈ నేపథ్యంలో విద్యార్థులను అభినందిస్తూ, పరీక్షల్లో వెనుకబడిన వారికి కొండంత ధైర్యాన్ని ఇస్తూ తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, నటుడు విజయ్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విజయ్ హృదయపూర్వకంగా అభినందించారు. "పట్టుదలతో శ్రమించి పరీక్షల్లో విజయం సాధించిన నా ప్రియమైన తమ్ముళ్లకు, చెల్లెళ్లకు నా అభినందనలు. ఈ విజయం మీ హార్డ్‌వర్క్‌కు దక్కిన అసలైన గుర్తింపు. ఇదే ఆత్మవిశ్వాసంతో ఉన్నత చదువుల వైపు మీ తదుపరి అడుగులు వేయండి" అని విజయ్ పిలుపునిచ్చారు.

చాలా మంది విద్యార్థులు ఫలితాలు తక్కువగా వస్తే తీవ్ర నిరాశకు లోనవుతుంటారు. అలాంటి వారిలో ధైర్యం నింపేలా విజయ్ రాసిన మాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. "ఒకవేళ ఈసారి విజయం సాధించలేకపోయినా ఎవరూ అధైర్యపడకండి. మళ్లీ ప్రయత్నించండి. గుర్తుంచుకోండి.. మనం విజయానికి అత్యంత సమీపంలోనే ఉన్నాం. మీ అందరి భవిష్యత్తు ఉజ్వలంగా ప్రకాశించాలి. మంచే జరుగుతుంది.. విజయం నిశ్చయం!" అంటూ విద్యార్థులకు ఆయన భరోసా ఇచ్చారు. కాగా, ఈ ఏడాది విడుదలైన ఫలితాల్లో ఎప్పటిలాగే అమ్మాయిలు (97% ఉత్తీర్ణత) అబ్బాయిల కంటే (93.19% ఉత్తీర్ణత) మెరుగైన ఫలితాలు సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈరోడ్ జిల్లా మొదటి స్థానంలో నిలిచింది.

Advertisment
తాజా కథనాలు