Vijay Manifesto : మహిళలకు 8 గ్రాముల బంగారం, పట్టుచీర ..విజయ్ సంచలన మేనిఫెస్టో

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధ్యక్షుడు విజయ్ తన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు.

New Update
vijay

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధ్యక్షుడు విజయ్ తన పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఏప్రిల్ 23న జరగనున్న పోలింగ్ కోసం ఓటర్లను ఆకట్టుకునేలా భారీ హామీలను ఆయన ప్రకటించారు.

మేనిఫెస్టోలోని ముఖ్య అంశాలు:

  • ప్రతి నెలా మహిళలకు రూ. 2,500 ఆర్థిక సాయం అందిస్తామని విజయ్ హామీ ఇచ్చారు.
  •  పేద కుటుంబాల్లోని వధువులకు వివాహ సాయం కింద 8 గ్రాముల బంగారం నాణ్యమైన పట్టుచీర అందజేస్తామని ప్రకటించారు.
  • ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు సహకార బ్యాంకుల్లో ఉన్న పంట రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని తెలిపారు. అలాగే, వరి క్వింటాల్‌కు రూ. 3,500 మద్దతు ధర కల్పిస్తామని చెప్పారు.
  • పిల్లలు బడి మానేయకుండా ఉండటానికి తల్లులకు ఏడాదికి రూ. 15,000 సాయం చేస్తామని, మహిళా పొదుపు సంఘాలకు రూ. 5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని హామీ ఇచ్చారు.


మరోవైపు, చెన్నై జిల్లాలోని 16 నియోజకవర్గాల్లో 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగుల కోసం హోమ్ ఓటింగ్ గురువారం ప్రారంభమైంది. ఏప్రిల్ 18 వరకు సాగే ఈ ప్రక్రియలో మొత్తం 8,947 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.ఎన్నికల సంఘం ఇప్పటికే ఓటర్లకు సమాచార చీటీలను పంపిణీ చేస్తోంది. తమిళనాడుతో పాటు పశ్చిమ బెంగాల్‌లో కూడా ఏప్రిల్ 23న మొదటి విడత ఎన్నికలు జరగనున్నాయి. విజయ్ ప్రకటించిన ఈ వరాల జల్లు ఇప్పుడు తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Advertisment
తాజా కథనాలు