/rtv/media/media_files/2026/05/04/trisha-vijay-cabinet-2026-05-04-15-32-27.jpg)
తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన వార్త ఒకటి తెగ హల్ చల్ చేస్తోంది. ఎన్నికల ఫలితాల్లో తమిళగ వెట్రి కజగం (TVK) ప్రభంజనం సృష్టిస్తుండటంతో, విజయ్ ఏర్పాటు చేయబోయే కేబినెట్‌లో హీరోయిన్ త్రిష కూడా ఉండబోతున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
రెండింటిలోనూ భారీ ఆధిక్యంతో
విజయ్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. ఇప్పుడు రెండింటిలోనూ భారీ ఆధిక్యంతో దూసుకుపోతున్నారు. ఈ రెండు చోట్లా ఆయన గెలుపు దాదాపుగా ఖాయమే. నిబంధనల ప్రకారం ఒక అభ్యర్థి రెండు చోట్ల గెలిస్తే, ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. విజయ్ తన తిరుచ్చి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేసే అవకాశం ఉందని సమాచారం. విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ స్థానానికి జరగబోయే ఉప ఎన్నికలో హీరోయిన్ త్రిషను పోటీకి దింపాలని విజయ్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
టీవీకే పార్టీ పెట్టినప్పటి నుంచి త్రిష విజయ్‌కు అండగా ఉంటూ వస్తున్నారు. కేవలం ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా, ఆమెను తన మంత్రివర్గంలోకి తీసుకుని ఆమెకు సినిమాటోగ్రాఫీ శాఖను అప్పగించే ఆలోచనలో విజయ్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే, తమిళనాడు రాజకీయాల్లో జయలలిత తర్వాత అంతటి ప్రభావం చూపగల మహిళా నేతగా త్రిష అవతరించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆమె విజయ్ విజయం కోసం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం, ఫలితాల రోజే విజయ్ ఇంటికి వెళ్లి అభినందించడం ఈ వార్తలకు మరింత బలాన్ని ఇస్తోంది.
Follow Us