BIG BREAKING : దీదీకి మరో బిగ్ షాక్ : పార్టీని వీడిన ఫైర్‌బ్రాండ్ లీడర్.. నమ్ముకున్నోళ్లే హ్యాండ్ ఇస్తున్నారు!

మమతా బెనర్జీ క్యాంప్‌లో ఒకరి తర్వాత ఒకరు కీలక నేతలు చేజారిపోతున్నారు. కేవలం వారం రోజుల క్రితమే దీదీకి అత్యంత ఆప్తుడైన సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేశారు.

New Update
mamata

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్  అధినేత్రి మమతా బెనర్జీకి గడ్డుకాలం నడుస్తోంది. మొన్నటికి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై అధికారాన్ని కోల్పోయిన టీఎంసీని.. ఇప్పుడు సొంత పార్టీ నేతల తిరుగుబాటు కోలుకోలేని దెబ్బతీస్తోంది. బెంగాల్‌లో దాదాపు 61 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు నేత రీతబ్రతా బెనర్జీ వైపు నిలబడటంతో మొదలైన ఈ సంచలన తిరుగుబాటు.. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీకి, పార్లమెంట్‌కు సైతం పాకింది. తాజాగా మమతా బెనర్జీకి అత్యంత నమ్మకస్థురాలైన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.

రాజ్యసభ సీటు ఇచ్చి

మమతా బెనర్జీ క్యాంప్‌లో ఒకరి తర్వాత ఒకరు కీలక నేతలు చేజారిపోతున్నారు. కేవలం వారం రోజుల క్రితమే దీదీకి అత్యంత ఆప్తుడైన సీనియర్ నేత సుఖేందు శేఖర్ రాయ్ రాజ్యసభ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేశారు. ఆ షాక్ నుంచి కోలుకోకముందే, బుధవారం నాడు మరో ఫైర్‌బ్రాండ్ నాయకురాలు సుస్మితా దేవ్ కూడా ఎగువ సభతో పాటుగా పార్టీకి కూడా రాజీనామా సమర్పించారు. ఇది మమతా బెనర్జీ పార్లమెంటరీ బలాన్ని తీవ్రంగా దెబ్బతీసింది.

అస్సాంలోని సిల్చార్ నుంచి గతంలో కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీగా గెలిచిన సుస్మితా దేవ్, ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. అయితే, 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆమె 2021లో కాంగ్రెస్‌ను వీడి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు.  టీఎంసీలో చేరిన కొద్దిరోజుల్లోనే పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మమతా బెనర్జీ ఆమెకు బెంగాల్ నుంచి రాజ్యసభ సీటు ఇచ్చి గౌరవించారు. అయితే, బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ ఓడిపోవడం, పార్టీపై మమత-అభిషేక్ బెనర్జీల పట్టు సడలడంతో ఆమె కూడా తిరుగుబాటు గ్రూపు వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

ఈ తిరుగుబాటు కేవలం ఇద్దరు రాజ్యసభ ఎంపీలతో ఆగడం లేదు. లోక్‌సభలో ఉన్న 29 మంది టీఎంసీ ఎంపీలలో ఏకంగా 20 మంది ఎంపీలు కాకలి ఘోష్ దస్తీదార్ నాయకత్వంలో తిరుగుబాటు జెండా ఎగరేశారు. పార్టీ ఫిరాయింపుల చట్టం పరిధిలోకి రాకుండా ఉండేందుకు కావాల్సిన 2/3 వంతు మెజారిటీ ఈ రెబెల్స్ వద్ద ఉండటంతో, టీఎంసీ అధికారికంగా రెండు ముక్కలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవైపు మమతా బెనర్జీ ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశంలో పాల్గొంటుండగా.. అదే సమయంలో ఆమె సొంత పార్టీ ఎంపీలు ఎన్డీయే వైపు వెళ్లడం దీదీ 28 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలోనే అత్యంత పెద్ద సవాల్‌గా మారింది.

Advertisment
తాజా కథనాలు