Kapil Sahu: ప్రశాంత్ కిషోర్ టీం నుంచి బయటకు వచ్చి.. విజయ్ ను గెలిపించిన కపిల్ సాహు ట్రాక్ రికార్డ్ ఇదే!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 'తమిళగ వెట్రి కళగం' (TVK) సాధించిన అసాధారణ విజయం వెనుక కేవలం విజయ్ ఛరిష్మా మాత్రమే కాదు, ఒక పక్కా వ్యూహకర్త మేధస్సు కూడా ఉంది. దళపతి వెనుక ఉండి చక్రం తిప్పిన ఆ వ్యూహకర్త కపిల్ సాహు. ఆయన పాత్రపై తాజాగా పెద్ద చర్చ సాగుతోంది.

New Update
FotoJet - 2026-05-05T112553.113

TVK Vijay's Election Strategist Kapil Sahu

Kapil Sahu: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 'తమిళగ వెట్రి కళగం' (TVK) సాధించిన అసాధారణ విజయం వెనుక కేవలం విజయ్ ఛరిష్మా మాత్రమే కాదు, ఒక పక్కా వ్యూహకర్త మేధస్సు కూడా ఉంది. దళపతి విజయ్ వెనుక ఉండి చక్రం తిప్పిన ఆ వ్యూహకర్త కపిల్ సాహు. ఈ ఎన్నికల్లో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించడంలో కపిల్ సాహు పోషించిన పాత్రపై తాజాగా పెద్ద చర్చ సాగుతోంది. రాజకీయ వ్యూహకర్తగా కపిల్ సాహుకు దశాబ్ద కాలానికి పైగా అనుభవం ఉంది. గతంలో ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని IPAC (ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ)లో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన, రెండేళ్ల క్రితం తన 12 మంది నిపుణుల బృందంతో కలిసి బయటకు వచ్చి స్వతంత్రంగా రాజకీయ కన్సల్టెన్సీని ప్రారంభించారు. దేశంలోని 9 రాష్ట్రాల్లో వివిధ పార్టీల కోసం పనిచేసిన అనుభవం ఆయనను ఈ స్థాయికి చేర్చింది.

Also Read: ‘ఫౌజీ’ షూటింగ్ కు వెళ్తుండగా ప్రమాదం.. ఒకరు మృతి!

విజయ్ రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించిన నాటి నుండి, క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడంలో కపిల్ సాహు కీలక పాత్ర పోషించారు. కేవలం సోషల్ మీడియా ప్రచారానికే పరిమితం కాకుండా, ప్రతి గ్రామంలోనూ పార్టీ నెట్‌వర్క్‌ను నిర్మించడం, ఓటర్ల డేటాను విశ్లేషించడం , యువతను ఆకర్షించేలా నినాదాలను రూపొందించడంలో ఆయన సిద్ధహస్తుడు. ఉత్తరప్రదేశ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) విస్తరణలో కూడా ఆయన ఇదే తరహా వ్యూహాన్ని అమలు చేశారు..కపిల్ సాహు గతంలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ వంటి జాతీయ పార్టీలతో కలిసి పనిచేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రాఘవ్ చద్దా కోసం మైక్రో-లెవల్ ప్రచారాన్ని నిర్వహించి విజయం సాధించడంలో తోడ్పడ్డారు. ప్రస్తుతం టీవీకేకు కాంగ్రెస్ మద్దతు లభించడం వెనుక, రాహుల్ గాంధీ విజయ్‌తో మాట్లాడటం వెనుక కూడా కపిల్ సాహు పాత పరిచయాలు ,రాజకీయ లాబీయింగ్ ఒక కారణమనే చర్చ నడుస్తోంది.

Also Read: 'గిల్లి' నుంచి 'లియో' వరకు.. విజయ్-త్రిష హిట్ ట్రాక్ రికార్డ్ ఇదే!

 తమిళనాడులో దశాబ్దాలుగా పాతుకుపోయిన డీఎంకే, ఏఐఏడీఎంకే వంటి దిగ్గజ పార్టీలను ఎదుర్కోవడానికి కపిల్ సాహు ఒక ప్రత్యేక 'వార్ రూమ్'ను ఏర్పాటు చేశారు. ద్రవిడ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా 'తమిళ జాతీయవాదం + అభివృద్ధి' అనే కొత్త నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. గతంలో కర్ణాటక మంత్రి అశ్వత్ నారాయణ్ కార్యాలయంలో వ్యూహాత్మక కమ్యూనికేషన్ హెడ్‌గా పనిచేసిన అనుభవంతో, విజయ్ మాటలను ప్రజలకు ఎలా చేరువ చేయాలో ఆయన పక్కాగా అమలు చేశారు.

Also Read: ‘దళపతి’ టూ ‘సీఎం’ విజయ్.. విక్టరీతో మారిన ‘జన నాయకన్’ టైటిల్..!

కింగ్ మేకర్ నుండి కింగ్ వైపు..

ప్రస్తుతం టీవీకే 108 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచిన తరుణంలో, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మిగిలిన 10 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టడంలో కపిల్ సాహు టీమ్ బిజీగా ఉంది. కాంగ్రెస్, పీఎంకే వంటి పార్టీలతో చర్చలు జరపడంలో, గవర్నర్‌కు పంపిన లేఖలోని అంశాలను రూపొందించడంలో ఈ వ్యూహకర్త పాత్ర ఎంతో ఉంది. మొత్తానికి, సినిమాల్లో విజయ్ ఎలాగైతే విలన్ల ఎత్తులను చిత్తు చేస్తారో, రాజకీయాల్లో కపిల్ సాహు వ్యూహాలతో విజయ్ అదే స్థాయి విజయాన్ని అందుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2026 తమిళనాడు ఫలితాలు కపిల్ సాహును దేశంలోని టాప్ పొలిటికల్ స్ట్రాటజిస్టుల సరసన నిలబెట్టాయి.

Advertisment
తాజా కథనాలు