/rtv/media/media_files/2025/02/13/Eyx9Cu6CiZ3WR0cThaRj.jpg)
President Rule in Manipur
మణిపుర్‌లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించింది. ఈ మేరకు దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల సీఎం పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కానీ తదుపరి సీఎం ఎవరు అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే గత రెండేళ్లుగా మణిపుర్‌లో మెయిటీ, కుకీల జాతుల మధ్య అల్లర్లు జరగుతున్న సంగతి తెలిసిందే.
Also Read: యూట్యూబర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. పార్లమెంటరీ ప్యానెల్ కీలక నిర్ణయం
ఆదివారం బీరెన్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో అక్కడ రాజకీయ అనిశ్చితి నెలకొంది. సీఎం రాజీనామాను ఇప్పిటికే గవర్నర్ అజయ్ కుమార్ భల్లా ఆమోదించారు. తదుపరి నియామకం జరిగే వరకు తాత్కాలిక ముఖ్యమంత్రిగా వ్యవహరించాలని బీరెన్ సింగ్‌ను కోరారు. కానీ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై గవర్నర్ పంపిన నివేదికలో మణిపుర్‌లోలో రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయాలని కూడా కోరినట్లు తెలిసింది.
Also Read: ‘నాన్న క్షమించండి.. మీ కలల్ని నెరవేర్చలేకపోయా’: జేఈఈ విద్యార్థిని సూసైడ్!
మరోవైపు సోమవారం నుంచి అక్కడ జరగాల్సిన అసెంబ్లీ సమావేశాలను రద్దు చేస్తూ గవర్నర్ ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే బీరెన్ సింగ్ సీఎం పదవికి రాజీనామా చేసిన అనంతరం తదుపరి సీఎం ఎవరనేది తేలడం లేదు. ఎవరికి అవకాశం ఇవ్వాలనే దానిపై బీజేపీ హైకమాండ్ తర్జన భర్జన పడుతోంది. చివరికి కేంద్రానికి రాష్ట్రపతి పాలన విధించడమే ప్రత్నామ్యాయంగా కనిపించింది. ఈ నేపథ్యంలోనే అనుకున్నట్లుగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఈ అంశం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది.
Also Read: కంగనా రనౌత్‌కు అభినందనలు చెప్పిన కాంగ్రెస్.. ఎందుకంటే ?