విజయ్కు దెబ్బ మీద దెబ్బ.. VCK పార్టీ  సంచలన డిమాండ్ !

తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు హై-వోల్టేజ్ సినిమాను తలపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) చేస్తున్న ప్రయత్నాలకు క్షణక్షణానికి సవాళ్లు ఎదురవుతున్నాయి.

New Update
vck party

తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు హై-వోల్టేజ్ సినిమాను తలపిస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) చేస్తున్న ప్రయత్నాలకు క్షణక్షణానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. ఒకవైపు మద్దతు కోసం బేరసారాలు, మరోవైపు ఆరోపణలు, ఇంకోవైపు గవర్నర్ నిరూపించమంటున్న బలం.. ఇవన్నీ తమిళనాడును వేడెక్కిస్తున్నాయి. అసెంబ్లీలో మొత్తం 234 సీట్లకు గానూ విజయ్ పార్టీ ఒంటరిగా 108 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా నిలిచింది. మెజారిటీ మార్క్ అయిన 118 కి కేవలం 10 సీట్ల దూరంలో నిలిచింది. 

ఇతరుల మద్దతు అత్యంత కీలకం

ఎన్నికల తర్వాత కాంగ్రెస్ (5 సీట్లు) విజయ్‌కు మద్దతు తెలపడంతో బలం 113 స్థానాలకు చేరింది. అయితే, డీఎమ్‌కే (DMK) కూటమిలో భాగమైన ఐయూఎమ్‌ఎల్ (IUML - రెండు సీట్లు) విజయ్‌కు మద్దతు ఇవ్వడానికి నిరాకరించింది. తమది కేవలం ఎన్నికల పొత్తు కాదని, సిద్ధాంతపరమైన బంధమని చెబుతూ డీఎమ్‌కే వెంటే ఉంటామని స్పష్టం చేసింది.దీంతో విజయ్ బలపరీక్షలో నెగ్గడానికి ఇతరుల మద్దతు అత్యంత కీలకంగా మారింది. ఇలాంటి ఉత్కంఠ భరిత సమయంలో, రెండు స్థానాలు గెలుచుకున్న విడుతలై చిరుతైగల్ కట్చి పార్టీ విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడానికి సిద్ధమైంది. కానీ, ఉచితంగా కాదు. తమ పార్టీ అధినేత తోల్ తిరుమావళవన్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని వీసీకే నేతలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. గతంలో తాము డీఎమ్‌కే ప్రభుత్వంలో ఇలాంటి అధికార భాగస్వామ్యాన్ని ఆశించినా దక్కలేదని, ఇప్పుడు విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే తమ మద్దతు తప్పనిసరి కాబట్టి డిప్యూటీ సీఎం పీఠాన్ని కేటాయించాల్సిందేనని పట్టుబడుతున్నారు.

ఈ రాజకీయ సంక్షోభం మధ్య విజయ్‌కు ఊరటనిచ్చేలా లెఫ్ట్ పార్టీలైన సీపీఐ (CPI - 2 సీట్లు), సీపీఐ(ఎం) (CPI-M - 2 సీట్లు) రాతపూర్వక మద్దతు లేఖలను గవర్నర్‌కు అందించాయి. తమిళనాడులో ఒక స్థిరమైన, లౌకిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం, అలాగే కేంద్రంలోని శక్తులు ఇక్కడ కుట్రలు చేయకుండా అడ్డుకోవడం కోసమే తాము విజయ్‌కు మద్దతు ఇస్తున్నట్లు లెఫ్ట్ నేతలు ప్రకటించారు. మే 7న విజయ్ స్వయంగా గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతించాలని కోరారు. అయితే, మెజారిటీకి కావాల్సిన 118 మంది ఎమ్మెల్యేల సంపూర్ణ మద్దతు పత్రాలను చూపించాలని గవర్నర్ స్పష్టం చేశారు. మొత్తానికి కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు, వీసీకే మద్దతుతో విజయ్ సేన మ్యాజిక్ ఫిగర్‌కు చేరినట్లు కనిపిస్తున్నా.. వీసీకే పెట్టిన డిప్యూటీ సీఎం కండిషన్‌ను విజయ్ ఎలా డీల్ చేస్తారనే దానిపైనే ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటు ఆధారపడి ఉంది.

#telugu-news #vijay #tvk party #VCK
Advertisment
తాజా కథనాలు