Tamil Nadu : సీఎం విజయ్ వద్ద కీలక శాఖలు.. కీర్తనకు భారీ పోర్ట్‌ఫోలియో!

తమిళనాడులో కొత్తగా కొలువుదీరిన సీఎం జోసెఫ్ విజయ్ మంత్రివర్గంలోని సభ్యులకు శాఖలను కేటాయించారు. అత్యంత కీలకమైన హోంశాఖతో పాటు రక్షణ, శాంతిభద్రతలకు సంబంధించిన విభాగాలను విజయ్ తన వద్దే ఉంచుకున్నారు.

New Update
vijay

తమిళనాడులో కొత్తగా కొలువుదీరిన సీఎం జోసెఫ్ విజయ్ మంత్రివర్గంలోని సభ్యులకు శాఖలను కేటాయించారు. అత్యంత కీలకమైన హోంశాఖతో పాటు రక్షణ, శాంతిభద్రతలకు సంబంధించిన విభాగాలను విజయ్ తన వద్దే ఉంచుకున్నారు. సీనియర్ నాయకులతో పాటు యువతకు, మహిళలకు ఈ కేబినెట్‌లో ప్రాధాన్యత దక్కడం విశేషం.

హోం, పోలీస్ శాఖలతో పాటు మహిళా, శిశు సంక్షేమ బాధ్యతలను సీఎం విజయ్ స్వయంగా పర్యవేక్షించనున్నారు.  తమిళనాడు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్ నాయకుడు కె.ఎ. సెంగోట్టయన్‌కు అత్యంత కీలకమైన ఆర్థిక శాఖను కేటాయించారు. ఆయన కొత్త ప్రభుత్వంలో ఫైనాన్స్, పెన్షన్లు, పెన్షన్ అలవెన్సుల విభాగాలను నిర్వహించనున్నారు.

విజయ్ కేబినెట్‌లో అందరికంటే చిన్న వయస్కురాలైన మహిళా మంత్రి సెల్వి ఎస్. కీర్తనకు భారీ పోర్ట్‌ఫోలియో దక్కింది. ఆమెకు పరిశ్రమల శాఖ తో పాటు ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్  బాధ్యతలను అప్పగించారు. తమిళనాడు పారిశ్రామిక రంగాన్ని నడిపించే పెద్ద విభాగాన్ని ఒక యువ మహిళా మంత్రికి కేటాయించడం ఇప్పుడు తమిళ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇతర మంత్రులు - కేటాయించిన శాఖలు:

  • ఎన్. ఆనంద్ (రూరల్ డెవలప్‌మెంట్): గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్, పేదరిక నిర్మూలన కార్యక్రమాలు, చిన్న నీటి పారుదల ప్రాజెక్టులు.
  • ఆదవ్ అర్జున (PWD & స్పోర్ట్స్): పబ్లిక్ వర్క్స్ (భవనాలు, రహదారులు, మైనర్ పోర్టులు), క్రీడాభివృద్ధి శాఖ.
  • డాక్టర్ కె.జి. అరుణ్‌రాజ్ (హెల్త్): ఆరోగ్య, వైద్య విద్య, కుటుంబ సంక్షేమ శాఖ.
  • పి. వెంకటరమణన్ (సివిల్ సప్లైస్): ఆహార, పౌరసరఫరాలు, వినియోగదారుల రక్షణ, ధరల నియంత్రణ.
  • ఆర్. నిర్మల్‌కుమార్ (ఎనర్జీ & లా): విద్యుత్ శాఖ, న్యాయశాఖ 
  • రాజ్‌మోహన్ (స్కూల్ ఎడ్యుకేషన్ & కల్చర్): విద్యాశాఖ, సమాచార-పౌరసంబంధాల శాఖ, పురావస్తు శాఖ, సినిమాటోగ్రాఫీ
  • డాక్టర్ టి.కె. ప్రభు (నేచురల్ రిసోర్సెస్): సహజ వనరుల శాఖ (ఖనిజాలు, గనులు). 
Advertisment
తాజా కథనాలు