Thalapathy Vijay : జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ అనే నేను....రేపే సీఎంగా దళపతి ప్రమాణ స్వీకారం

తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ రేపిన పొలిటికల్ సస్పెన్స్‌కు తెరపడింది. తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, సినీ నటుడు విజయ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. రేపు మధ్యాహ్నం 3:15 గంటలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

New Update
TVK Vijay

TVK Vijay

Thalapathy Vijay : తమిళనాడు రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా ఉత్కంఠ రేపిన పొలిటికల్ సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, సినీ నటుడు విజయ్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. మెజారిటీకి కావాల్సిన ఎమ్మెల్యేల మద్దతు లేఖలను పరిశీలించిన గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్.. విజయ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు.రేపు అంటే మే 10 (ఆదివారం) మధ్యాహ్నం 3:15 గంటలకు చెన్నైలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో విజయ్ ముఖ్యమంత్రిగా అత్యంత వైభవంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి పలువురు జాతీయ, ప్రాంతీయ రాజకీయ ప్రముఖులు, సినీ రంగ ప్రతినిధులు హాజరుకానున్నారు.

120కి చేరిన విజయ్ బలం..  

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తీవ్ర ఉత్కంఠ నెలకొన్న తరుణంలో.. చివరి నిమిషంలో విదుతలై చిరుతైగల్ కచ్చి (VCK), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) పార్టీలు విజయ్‌కు తమ మద్దతు లేఖలను అందజేశాయి. ఇప్పటికే కాంగ్రెస్, వామపక్షాలు (CPI, CPM) మద్దతు ప్రకటించడంతో విజయ్ నేతృత్వంలోని కూటమి బలం 120కి (విజయ్ రెండు స్థానాల నుంచి పోటీ చేయడంతో ఎఫెక్టివ్ బలం 121గా పరిగణించబడుతుంది) చేరింది. తమిళనాడు శాసనసభలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మేజిక్ ఫిగర్ 118 కంటే ఎక్కువ మద్దతు లభించడంతో విజయ్ పీఠం ఖాయమైంది. శనివారం సాయంత్రం రాజ్ భవన్‌కు వెళ్లిన విజయ్.. మద్దతుదారులైన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు అందజేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి క్లెయిమ్ చేశారు.

క్యాబినెట్ పదవులకు దూరం: వీసీకే, లెఫ్ట్ పార్టీల నిర్ణయం

విజయ్ ప్రభుత్వానికి బలం చేకూర్చిన కీలక మద్దతుదారులు క్యాబినెట్ పదవుల విషయంలో వెనక్కి తగ్గారు. వీసీకే (VCK) అధినేత తిరుమావళవన్ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు."మేము విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో చేరడం లేదు. కేవలం వెలుపల నుంచే మద్దతు ఇస్తాం. భవిష్యత్‌లో ప్రభుత్వంలో భాగం అవుతామా లేదా అనేది ఇప్పుడు చెప్పలేం. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను నివారించేందుకు, ప్రజా తీర్పు గౌరవించేందుకే ఈ మద్దతు ప్రకటిస్తున్నాం. సిద్ధాంతపరంగా మేం ఇప్పటికీ డీఎంకే నేతృత్వంలోని లౌకిక ప్రగతిశీల కూటమిలోనే ఉన్నాం." అని వీసీకే చీఫ్ తిరుమావళవన్ ప్రకటించారు.ఇప్పటికే వామపక్షాలు (సీపీఐ, సీపీఎం) కూడా క్యాబినెట్ పదవులు వదులుకుని బయటి నుంచే మద్దతు ఇస్తామని స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

అసెంబ్లీలో ప్రస్తుత సంఖ్యా బలం

 TVK కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు పలికిన పార్టీల వారీగా స్థానాల వివరాలు ఇలా ఉన్నాయి. తమిళగ వెట్రి కళగం (TVK)107 (విజయ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో గెలవడంతో ఎఫెక్టివ్ బలం) భారత జాతీయ కాంగ్రెస్5, సీపీఐ (CPI)2, సీపీఎం (CPI-M)2, వీసీకే (VCK)2, ఐయూఎంఎల్ (IUML)2, మొత్తం బలం120 (121).

Advertisment
తాజా కథనాలు