స్టార్ హెల్త్ కస్టమర్లకు షాక్.. టెలిగ్రామ్‌లో కస్టమర్ల డేటా!

స్టార్ హెల్త్ కంపెనీ కస్లమర్ల డేటా చోరీకి గురైంది. టెలిగ్రామ్‌లో చాట్‌బోట్ల ద్వారా స్టార్ హెల్త్‌కి చెందిన కస్లమర్ల వ్యక్తిగత డేటా లీక్ అయ్యిందని తెలుస్తోంది. చాట్ బాట్ సష్టికర్త ఓ సెక్యూరిటీ రీసెర్చ్‌కు ఈ విషయాన్ని చెప్పడంతో వెలుగులోకి వచ్చింది.

author-image
By Nikhil
New Update
Star health cyber crime

ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ స్టార్ హెల్త్ కస్టమర్ల డేటా లీక్ అయ్యింది. టెలిగ్రామ్‌లో కస్టమర్ల వ్యక్తిగత సమాచారాన్ని అమ్మకానికి పెట్టడంతో ప్రస్తుతం ఈ అంశం చర్చనీయాంశం అవుతుంది. ఈ డేటాలో కస్టమర్ల మెడికల్ రిపోర్టులు కూడా ఉన్నట్లు సమాచారం. చాట్స్ బాట్స్ ద్వారా టెలిగ్రామ్‌లో స్టార్ హెల్త్‌ కస్టమర్లకు బంధించిన మొత్తం డిటైల్స్ ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కొన్ని రోజుల కిందటే టెలిగ్రామ్ అధినేత పావెల్ దురోవ్ మీద ఆరోపణలు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు ఇలా కస్టమర్ల డేటా చోరీకి గురికావడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. 

టెలిగ్రామ్‌లో స్టార్ హెల్త్‌కి సంబంధించిన కస్టమర్ల డేటా చాట్‌బాట్‌లో కనిపిస్తున్నాయి. ఈ విషయాన్ని చాట్‌బాట్ సృష్టికర్త ఒక సెక్యూరిటీ రీసెర్చర్‌కు చెప్పడంతో అతను ఈ విషయాన్ని బయటకు తెలియజేశాడు. ఎంతో మంది కస్టమర్ల డేటాను టెలిగ్రామ్‌లో ఇలా అమ్మకానికి పెట్టారు. అయితే ఈ విషయంపై స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ స్పందించింది. ఈ విషయంపై అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపింది. కస్టమర్ల డేటా సురక్షితంగా ఉంటుందని తెలిపింది. అలాగే చాట్‌బాట్ల ద్వారా పాలసీ, క్లెయిమ్ డాక్యుమెంట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వీటి ద్వారా కస్టమర్ల వివరాలు, చిరునామా, ట్యాక్స్ వివరాలు, పరీక్షలు చేయించుకున్న ఫలితాలు, ఐడీ కార్డులు వంటి సమాచారాన్ని కూడా పొందవచ్చని చాట్‌బాట్ చెబుతుంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు