చంద్రబాబు, స్టాలిన్ వింత సందేశాలు.. పిల్లలను కనడంపై ఈ సీఎంల లాజిక్ కరెక్టేనా? ఇటీవల దక్షిణాది రాష్ట్రాల సీఎంలు ఎక్కువ మంది పిల్లలను కనాలంటూ ప్రజలకు ఇస్తున్న పిలుపులు చర్చనీయాంశం అయ్యాయి. 16 మంది పిల్లలను కనాలని స్టాలిన్ పిలుపునిస్తే.. ఎక్కువ మందిని కంటే ప్రోత్సాహకాలు ఇస్తామని చంద్రబాబు చెప్పారు. వీరి వ్యాఖ్యలపై విశ్లేషణ ఈ కథనంలో.. By Nikhil 23 Oct 2024 in నేషనల్ ఆంధ్రప్రదేశ్ New Update షేర్ చేయండి కొత్తగా పెళ్లి చేసుకునే జంటలు 16 మంది చొప్పున పిల్లల్ని కనాలి... ఇది తమిళనాడు సీఎం స్టాలిన్ మాట..! ఎక్కువ మంది పిల్లలను కలిగి ఉన్న కుటుంబాలకు ప్రోత్సాహకాలు అందిస్తాం.. ఇది ఏపీ సీఎం చంద్రబాబునాయుడి మాట..! ఇదేంటి ఉన్నట్టుండి దక్షిణాది రాష్ట్రాల సీఎంలు జనాభా పెరుగుదల మీద పడ్డారని ఆలోచిస్తున్నారా? దీనికి బలమైన కారణముంది. 2026లో పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. దీంతో 5 దక్షిణాది రాష్ట్రాల్లో లోక్‌సభ స్థానాలు తగ్గనున్నాయి. దీనిపై ఇప్పటికే సంబంధిత రాష్ట్రాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఉత్తరాది ఆధిపత్యం పెరిగిపోతుందని ద్రవిడనాట లీడర్లు బాధపడుతున్నారు. అయితే దీనికి ఎందుకు మంది పిల్లలను కనడం పరిష్కారామా? స్టాలిన్ నేరుగా ఇదే సొలూష్యన్ అన్నట్టు మాట్లాడుతున్నారు..! చంద్రబాబు మాత్రం దక్షిణాది రాష్ట్రాల్లో వృద్ధాప్య జనాభాపై పెరుగుతుందని.. అందుకే ఇద్దరి కంటే ఎక్కువ మందిని కనాలని సూచిస్తున్నట్టుగా కామెంట్ చేశారు. అయితే ఈ ఇద్దరు సీఎంలు చెప్పింది నిజంగా పరిష్కార మార్గామేనా? జనాభా పెరిగితే భవిష్యత్ కు సవాలే.. జనాభా పెరుగుదల ఎప్పటికీ మంచిది కాదు.. అది ఏ విధంగా చూసుకున్నా జనాభా పెరుగుదల అనేది భవిష్యత్ తరాలకు పెద్ద సవాలే! అందులో చైనా, ఇండియా లాంటి దేశాలు జనాభా పెరుగుదలపై ప్రత్యేకంగా ఫోకస్ చేసేవి. చైనాలో ఒక్కరినే కనాలనే పాలసీ చాలా కాలం కొనసాగింది. ఇటు ఇండియాలో ఇద్దరికి ఇద్దరే ముద్దు అనే పాలసీని ప్రభుత్వాలు ప్రమోట్ చేశాయి. అయితే చైనాలో ఒక్కరినే కనాలనే పాలసీ కారణంగా వృద్ధాప్య జనాభా పెరిగి, యువత జనాభా తగ్గడం సమస్యను సృష్టించింది. కానీ ఇండియాకు అలాంటి పరిస్థితి వస్తుందా అంటే భవిష్యత్‌లో ఏమో కానీ.. ఇప్పుడైతే ఆ ఢోకా లేదు. ఇండియాలో యూత్ పాపులేషన్ ఎక్కువ. ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రకారం, భారత్ జనాభాలో 40శాతం కంటే ఎక్కువ మంది 25 ఏళ్లలోపు వారే ఉన్నారు. అందుకే ఇండియాను చైనాతో కంపేర్ చేసుకోకూడదని నిపుణులు అంటున్నారు. దీంతో చంద్రబాబు సూచన అసలు కరెక్టేనా? ఏ దేశంలో ఎంత ఫెర్టిలిటీ రేటు ఉందంటే? ఒకసారి ప్రపంచవ్యాప్తంగా జనాభా పెరుగుదల, తగ్గుదల ఉన్న పరిస్థితులను చూద్దాం. అభివృద్ధి చెందిన దేశాలలో సంతానోత్పత్తి రేటు.. అంటే టోటల్ ఫెర్టిలిటీ రేటు ఇద్దరి పిల్లల కంటే తక్కువ. అంటే డెవలపెడ్ కంట్రీస్‌లో చాలా మంది స్త్రీలు ఇద్దరి కంటే తక్కువ మందినే కంటున్నారు. అమెరికాలో టోటల్ ఫెర్టిలిటీ రేటు 1.7గా ఉంది. ఇది కెనడాలో 1.5గా ఉంది. మరోవైపు యునైటెడ్ కింగ్‌డమ్‌ను చూస్తే సంతానోత్పత్తి రేటు 1.6గా రికార్డయింది. ఇటు అభివృద్ధిలో దూసుకుపోతున్న జర్మనీలో టోటల్ ఫెర్టిలిటీ రేటు 1.5గా నమోదైంది. ఇక ఫ్రాన్స్‌లో ఈ రేటు 1.8గా ఉంది. అభివృద్ధికి కేరాఫ్‌గా ఉండే ఆసియా దేశామైన జపాన్‌లో సంతానోత్పత్తి రేటు 1.3గా రికార్డయింది. ఇక ఇటలీలో ఈ రేటు 1.3గా ఉండగా.. స్వీడన్‌లో 1.7గా నమోదైంది. ఇదంతా 2023 లెక్కలు. ఇండియాలో ఇదే సమయంలో సంతానోత్పత్తి రేటు 2.1గా ఉంది. మీరు సరిగ్గా పరిశీలిస్తే అభివృద్ధి చెందిన దేశాల్లోని జంటలు పిల్లలను ఇద్దరి కంటే తక్కువగానే కంటున్నాయి. ఇక ఏ మాత్రం అభివృద్ధిని నోచుకోని సబ్-సహారా ఆఫ్రికా ప్రాంతాలు సంతానోత్పత్తి రేటు 4 కంటే ఎక్కువగా ఉంది. మన దేశంలో ఎంతో తెలుసా? ఇప్పుడు ఇండియా విషయానికి వద్దాం! భారత్‌లో దక్షిణాది రాష్ట్రాలది ప్రత్యేక స్థానం. దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రొడక్టవిటీ ఎక్కువ. అదే సమయంలో సంతానోత్పత్తి రేటు రెండు కంటే తక్కువ. నిజానికి దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో కఠినంగా ఉండేవి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ , తమిళనాడు రాష్ట్రాల సంతానోత్పత్తి రేటు 1.73గా ఉంది. ఇది జాతీయ సగటు 2.1 కంటే చాలా తక్కువ. తెలంగాణలో ఈ రేటు 1.82గా ఉంది. అటు కర్ణాటకలో 1.7గా రికార్డయింది. కేరళలో టోటల్ ఫెర్టిలిటీ రేటు 1.8గా నమోదైంది. ఇక తమిళనాడులో సంతానోత్పత్తి రేటు 1.80 ఉంటే.. ఇక ఆంధ్రప్రదేశ్‌లో ఈ రేటు 1.7గా ఉంది. దేశంలో ఐదు పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, రాజస్థాన్‌తో పాటు జార్ఖండ్ సగటు సంతానోత్పత్తి రేటు 2.4గా ఉంది. జీడీపీలో మహారాష్ట్ర ఫస్ట్.. అటు GDP పరంగా అత్యంత సంపన్న భారతీయ రాష్ట్రాల జాబితాపై ఓ లుక్కేద్దాం! మహారాష్ట్ర ఈ లిస్ట్‌లో ఫస్ట్ ఉంది. జాతీయ GDPలో మహారాష్ట్ర వాటా 13.3శాతంగా ఉంది. అటు రెండో స్థానంలో ఉన్న తమిళనాడు జాతీయ GDPలో 8.9శాతం షేర్‌ను కలిగి ఉంది. ఇటు మూడో స్థానంలో ఉన్న కర్ణాటక జాతీయ GDPలో 8.2శాతం షేర్‌ను కలిగి ఉంది. అంటే జీడీపీ పరంగా అత్యంత సంపన్న రాష్ట్రాల్లో తొలి మూడుస్థానాల్లో రెండు దక్షిణాదివే ఉన్నాయి. అయితే జనాభా పరంగా మాత్రం తమిళనాడు ఆరో స్థానంలో ఉండగా.. కర్ణాటక ఎనిమిదో స్థానంలో ఉంది. దక్షిణాది రాష్ట్రాలతోనే దేశం ముందుకు.. ఓవరాల్‌గా చూస్తే జనాభా కంట్రోల్ ఉన్న దక్షిణాది రాష్ట్రాలే ఇండియాను ముందుకు నడపిస్తున్నాయి. నిజానికి ప్రపంచాన్ని శాసిస్తున్న దేశాలు కూడా రెండు కంటే తక్కువ సంతానోత్పత్తి రేటును కలిగి ఉన్నాయి. అమెరికా, యూకే లాంటి దేశాలకు ఉద్యోగుల కోరత ఉండదు. ఎందుకంటే వారు ఇతర దేశాల నుంచి వర్కర్స్‌ను తెచ్చుకుంటున్నారు. ఐటి రంగమైనా, ఇతర రంగమైనా వివిధ దేశాల నుంచి వచ్చే ఉద్యోగులతో తమ ప్రొడక్టవిటీని పెంచుకుంటారు. ఇది చాలా తెలివైన పని. అందుకే మీరు గమనిస్తే ఇతర దేశాల్లోని టాప్ కంపెనీలకు సీఈవోలు ఇండియా వారు ఉండొచ్చు కానీ బాస్ మాత్రం ఆ దేశస్థులే ఉంటారు. ఇలా వారి దేశంలో తక్కువ జనాభా ఉన్నా ఇతర దేశాల ఉద్యోగులను ఆకర్షిస్తూ వివిధ దేశాలు అభివృద్ధి పథంలో పోతుంటాయి. ప్రత్యర్థులతో పోల్చితే తమ జనాభా తగ్గుతుందని.. అందుకే ఎక్కువ మంది పిల్లలను కనాలని, రాజకీయ ప్రయోజనాల కోసం, స్వలాభం కోసం గతంలో అనేక మంది లీడర్లు చెప్పిన సందర్భాలున్నాయి. 1938లో నాటి జర్మనీ ఛాన్సెలర్ అడాల్ఫ్ హిట్లర్ కుటుంబాలు ఎక్కువ మంది పిల్లలను కనాలని ప్రోత్సహించారు. యూదుల సంఖ్య కంటే స్వచ్ఛమైన జర్మన్లు తన దేశంలో ఉండాలని కోరుకున్నాడు. అయితే నేటి జర్మని వేరు.. ఇటు ఇండియాలోనూ జనాభా పెరుగుదల అతిపెద్ద సమస్య. అయితే మంచి విషయం ఏంటంటే ఇండియాలో జాబ్ చేసే ఏజ్ గ్రూప్ క్యాటగీరి ఎక్కువ. చాలా రాష్ట్రాల సగటు సంతానోత్పత్తి రేటు 2గా ఉండడమే దీనికి కారణం. ఈ రేటు ఒక్కటి కంటే తక్కువ ఉంటే చైనా లాంటి సమస్యలు వస్తాయి. మూడు కంటే ఎక్కువ ఉంటే ఆఫ్రికా లాంటి సమస్యలు వస్తాయి. మరి ఎంత ఉండాలో అంతే ఉన్నప్పుడు జనాభా పెంచుకోవాలని దక్షిణాది రాష్ట్రాల సీఎంలు సూచించడం ఎందుకున్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఉత్తరాది డామినేషన్‌ను ఎదుర్కొనే పద్ధతి ఇది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇష్టానుసారంగా పిల్లలను కనుకుంటే పోతే వారిని పోషించేది ఎవరు? #chandrababu-naidu #cm-mk-stalin #fertility-rate మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి