Delhi IGI Airport : ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 2 విమానాలు ఢీ

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI)లో పెను ప్రమాదం తప్పింది. రన్‌వేపై టాక్సీయింగ్ చేస్తున్న స్పైస్‌జెట్ విమానం, అక్కడే నిలిపి ఉంచి ఉన్న ఆకాశ ఎయిర్ విమానాన్ని ఢీకొట్టింది.

New Update
ia

ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (IGI)లో పెను ప్రమాదం తప్పింది. రన్‌వేపై టాక్సీయింగ్ చేస్తున్న స్పైస్‌జెట్ విమానం, అక్కడే నిలిపి ఉంచి ఉన్న ఆకాశ ఎయిర్ విమానాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు విమానాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఆకాశ ఎయిర్ విమానంలో ఉన్న ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. 

కుడి వైపు రెక్క భాగం

ఈ ప్రమాద సమయంలో స్పైస్‌జెట్ విమానం (B737-700) కుడి వైపు రెక్క భాగం దెబ్బతినగా.. ఆకాశ ఎయిర్ విమానానికి ఎడమ వైపు ఉండే హారిజాంటల్ స్టెబిలైజర్  దెబ్బతిన్నట్లు విమానయాన సంస్థ ప్రతినిధి తెలిపారు. ఢిల్లీ నుండి హైదరాబాద్ వెళ్లాల్సిన ఆకాశ ఎయిర్ విమానం (QP 1406) ప్రయాణానికి సిద్ధంగా నిలబడి ఉన్న సమయంలోనే ఈ ఘటన జరగడంతో, వెంటనే ఆ విమానాన్ని పార్కింగ్ ఏరియాకు తరలించారు.

ప్రస్తుతం స్పైస్‌జెట్ విమానాన్ని ఢిల్లీ విమానాశ్రయంలోనే నిలిపివేశారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై భారత విమానయాన నియంత్రణ సంస్థ (DGCA) విచారణ చేపట్టనుంది. విమాన ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Advertisment
తాజా కథనాలు