SCR: రైల్వే ప్రయాణికులకు తీపి కబురు.. ఇక నుంచి ఆ బాధపడనవసరం లేదు! సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ట్రైన్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పారు. ట్రైన్లలో జనరల్ బోగీల సంఖ్యను పెంచుతున్నట్లు అధికారులు ప్రకటించారు. By Bhavana 05 Dec 2024 in నేషనల్ Latest News In Telugu New Update షేర్ చేయండి SCR: ట్రైన్ ప్రయాణికులకు సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ఓ గుడ్ న్యూస్ చెప్పారు. స్టేషన్‌లో అప్పటికప్పుడు టికెట్లు తీసుకునేవారికి ఇక నుంచి ఎలాంటి టెన్షన్ అవసరం లేదు. ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ రైళ్లలో జనరల్ బోగీల సంఖ్యను దశలవారీగా పెంచుతున్నట్లు అధికారులు వివరించారు. ప్రస్తుతం రెండే జనరల్ కోచ్‌లు ఉన్న ట్రైన్లలలో ఆ సంఖ్యను నాలుగుకు పెంచనున్నట్లు వివరించారు. Also Read: ఫ్రాన్స్ లో అనుకోని పరిణామాలు..అవిశ్వాస తీర్మానంలో ఓడిన ప్రధాని! ఆ కోచ్‌లు కూడా ఆధునిక పరిజ్ఞానం కలిగిన ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు కూడా ఉంటాయని వివరించారు. జోన్ పరిధిలోని 21 జతల ట్రైన్లకు అదనగా 80 ఎల్‌హెచ్‌బీ బోగీలు అందుబాటులోకి వస్తాయని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రకటించారు. ఇంతకాలం ట్రైన్లలో పాతకాలం నాటి సాధారణ బోగీలే అందుబాటులో ఉండేవి. Also Read: Mulugu: వాజేడు ఎస్సై ఆత్మహత్య కేసు...పోలీసుల అదుపులో యువతి! చాలా రైళ్లలో రెండే జనరల్ బోగీలు ఉండటంతో పేద ప్రయాణికులు అందులో ఎక్కలేక తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈ నేపథ్యంలో జనరల్ బోగీల సంఖ్యను పెంచాలని రైల్వేబోర్డు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా వస్తున్న జనరల్ బోగీలను ఎల్‌హెచ్‌బీ పరిజ్ఞానంతో తయారుచేసినవి ఉపయోగించబోతున్నారు. పాతతరం ICF బోగీల్లో 90 సీట్లు ఉంటే.. LHB బోగీల్లో సీట్ల సంఖ్య 100 ఉంటాయి. ఇందులో ఎక్కువ మంది ప్రయాణించవచ్చునని అన్నారు. Also Read: AP: ఏపీలో వారందరికి ఉచితంగా స్కూటీలు..! ప్రమాదాలు జరిగినప్పుడు సైతం తక్కువ నష్టం ఉంటుందని అధికారులు చెప్పారు.ఎల్‌హెచ్‌బీ బోగీలను ఇప్పటి వరకు ఏసీ, స్లీపర్ క్లాసుల్లో రైల్వే శాఖ ప్రవేశపెడుతుంది. తాజాగా జనరల్ క్లాస్‌లోనూ ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే జోన్ పరిధిలో 19 ఎక్స్‌ప్రెస్ ట్రైన్లకుు 66 ఎల్‌హెచ్‌బీ కోచ్‌లను సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దక్షిణ్, నారాయణాద్రి, గౌతమి తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లలో అదనంగా ఎల్‌హెచ్‌బీ జనరల్ కోచ్‌లు అందుబాటులోకి వచ్చాయి. Also Read: US: భారతీయులకు అలర్ట్...హెచ్-1బీ వీసా లిమిట్‌పై అప్‌డేట్! దేశవ్యాప్తంగా 370 ట్రైన్లలో అదనంగా ఎల్‌హెచ్‌బీ బోగీలను దశలవారీగా జతచేసేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది.ఈ నిర్ణయం ద్వారా ప్రతి రోజూ అదనంగా 70 వేల మంది ప్రయాణికులు జనరల్ బోగీల్లో ప్రయాణించే అవకాశాలున్నాయి. జనరల్ బోగీల పెంపు ద్వారా సాధారణ ప్రయాణికులకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తెలిపారు. ఎల్‌హెచ్‌బీ కోచ్‌లు అత్యంత సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తాయని అధికారులు చెబుతున్నారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి